రొట్టె చేసేటప్పుడు ఈ తప్పులు మాత్రం చేయకండి

First Published Dec 8, 2023, 11:50 AM IST

ఇండియాలో రొట్టెలను ఎక్కువగా తింటుంటారు. నిజానికి అన్నం కంటే రొట్టెలే మన ఆరోగ్యానికి చాలా చాలా మంచివి. ఇవి మన శరీరాన్ని బలంగా ఉంచుతాయి. అలాగే ఎన్నో సమస్యలకు దూరంగా ఉంచుతాయి. కానీ వీటిని తయారుచేసేటప్పుడు మాత్రం కొన్ని తప్పులను చేయకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే? 
 

గోధుమపిండితో చేసే చపాతీ మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాదు జొన్నలు, సజ్జలతో కూడా రొట్టెలను తయారుచేస్తారు. ఈ రొట్టెల్లో విటమిన్లు, ఫైబర్, ప్రోటీన్లతో పాటుగా ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే అన్నం తినకున్నా రొట్టెను మాత్రం ఖచ్చితంగా తినాలని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అన్నం వండటం కంటే.. రొట్టెను తయారుచేయడమే కష్టంగా, ఎక్కువ సమయం పడుతుంది. అందుకే చాలా మంది తొందరగా కావాలని అన్నాన్నే వండుతుంటారు. కానీ అన్నం కంటే రొట్టెలే మన ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటాయి. అందుకే కష్టమైనా సరే రొట్టెను తినాలి. 
 

రొట్టెలను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మనలో చాలా మందికి తెలుసు. అయితే దీనిలోని పోషకాలను పొందడానికి మాత్రం రొట్టెను కొన్ని పద్దతుల్లోనే తయారుచేయాలని నిపుణులు చెబుతున్నారు. అయితే మనలో చాలా మందికి రొట్టెను ఎలా తయారుచేయాలో ఇంకా సరిగ్గా తెలియదు. నచ్చిన విధంగా చేసేస్తూ ఉంటాం. కానీ దీనివల్ల రొట్టెల్లోని పోషకాలు నశిస్తాయి. డైటీషియన్ అయిన డాక్టర్ లవ్లీన్ కౌర్ తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ న్ షేర్ చేసారు. దానిలో రొట్టెలను తయారు చేసేటప్పుడు జనాలు చేసే తప్పులు ఏంటి? వాటిని ఎలా నివారించాలో తెలియజేశారు. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. 

Latest Videos


Roti

1. ముందుగా మనలో చాలా మంది రొట్టెలను తయారుచేయడానికి రకరకాల ధాన్యాలను కలిపి పిండిని పట్టిస్తారు. వీటితో రొట్టె చేస్తారు. కానీ ఇలా చేయడం తప్పు.  ఒకేరకమైన పిండితోనే రొట్టెను చేయాలి. రకరకాల పిండిని కలిపి రొట్టె చేయకూడదు. రాగులు, జొన్నలు, బార్లీ వంటి రకరకాల ధాన్యాలు ఉంటాయి. కానీ మీకు నచ్చిన ధాన్యం పిండితోనే రొట్టెను చేయండి. కానీ రకరకాల ధాన్యాలు కలిపిన పిండితో రొట్టెలను చేసి తినకండి. 

2. ముఖ్యంగా రొట్టెలను కాల్చడానికి నాన్ స్టిక్ పాన్ ను ఉపయోగించకూడదు. వీటిని ఇనుప పాన్ మీదే కాల్చాలని నిపుణులు చెబుతున్నారు. 

3. రొట్టెను తయారు చేయడానికి మీరు పిండిని కనీసం 10-15 నిమిషాల పాటు కలిపి ముద్దగా చేసి పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల రెండు ప్రయోజనాలు కలుగుతాయి. ఒకటి ఈ పిండి ముద్దలో మంచి బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది. ఇక రెండోది రొట్టె మరింత మృదువుగా వస్తుంది. 
 

4. చాలా మంది రోటీని ప్యాక్ చేయడానికి అల్యూమినియం ఫాయిల్ ను ఉపయోగిస్తారు. కానీ వీటికి బదులుగా గుడ్డను మాత్రమే ఉపయోగించండి.  దీనివల్ల రోటీ మృదువుగా ఉంటుంది. అలాగే దీనిలోని పోషకాలు కూడా అలాగే ఉంటాయి. 

click me!