బీపీ నార్మల్ గా ఉండాలంటే వీటిని తినండి

First Published | Dec 7, 2023, 1:14 PM IST

ఈ రోజుల్లో చిన్న పిల్లలు కూడా అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. కానీ ఈ సమస్య ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అందుకే దీన్ని ఎప్పుడూ కూడా నియంత్రణలోనే ఉంచుకోవాలి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. కొన్ని ఆహారాలను తింటే రక్తపోటు అదుపులో ఉంటుంది. అవేంటంటే?

అధిక రక్తపోటు చిన్న సమస్యేం కాదు. ఎందుకంటే ఇది ఎన్నో ప్రమాదకరమైన రోగాలకు దారితీస్తుంది. చాలా మంది రక్తపోటును తగ్గించడానికి మందులను ఉపయోగిస్తుంటారు. ఇలాంటి వారు గుండెను రక్షించే ఆహారాలను తినాలని డాక్టర్లు చెబుతున్నారు. అధిక రక్తపోటు పేషెంట్లు మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇవి హైబీపీని కంట్రోల్ చేస్తాయి. మరి రక్తపోటు తగ్గడానికి ఎలాంటి ఆహారాలను తినాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. 

leafy vegetables

ఆకుకూరలు

ఆకుకూరల్లో మన శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ఆకు కూరలు బీపీ పేషెంట్లకు ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిలో పొటాషియం, నైట్రేట్ లు మెండుగా ఉంటాయి. ఇవి మూత్రపిండాలు మూత్రం ద్వారా అదనపు సోడియంను తొలగించడానికి సహాయపడుతాయి. అందుకే హైబీపీ పేషెంట్లు తమ రోజువారి ఆహారంలో ఆకు కూరలు ఉండేట్టు చూసుకోవాలి.
 

Latest Videos


బెర్రీలు

బెర్రీలు పోషకాలకు మంచి వనరు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు సమృద్ధిగా ఉంటాయి. ఇలాంటి బెర్రీలను రోజూ తింటే రక్త ప్రవాహం మెరుగుపడుతుంది. అలాగే రక్తపోటు పెరిగే ప్రమాదం కూడా తప్పుతుంది. 
 

బీట్రూట్ 

బీట్ రూట్ లో నైట్రేట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది. బీట్ రూట్ అధిక రక్తపోటును తగ్గిస్తుందని ఎన్నో అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. బీట్ రూట్ జ్యూస్ లేదా ఉడకబెట్టిన బీట్ రూట్ ను తింటే రక్తపోటు తగ్గిపోతుంది. ఇవి శరీర మంటను తగ్గించడానికి కూడా సహాయపడుతుందని అధ్యయనాలు కనుగొన్నాయి. 
 

ఓట్స్

ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఓట్స్ ను తింటే బరువు తగ్గుతారు. శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్  కూడా అదుపులో ఉంటుంది. అలాగే అధిక రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది. వోట్మీల్ రక్తపోటును తగ్గించడానికి, జీర్ణక్రియను మెరుగుపర్చడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఓట్స్ లో  కరిగే ఫైబర్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయని నిరూపించబడింది. 
 

అరటి

అరటిపండును తింటే మన శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. మీకు తెలుసా? అరటిపండు కూడా అధిక రక్తపోటును కంట్రోల్ చేస్తుంది. అరటిపండును తినడం వల్ల ఆరోగ్యకరమైన రక్తపోటును నిర్వహించడానికి అవసరమైన శరీరంలో సోడియం మొత్తం తగ్గుతుంది. 

సాల్మన్ ఫిష్

సాల్మన్, మాకేరెల్, సార్డినెస్ వంటి చేపలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ చేపల్లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ చేపలను తింటే అధిక రక్తపోటు తగ్గిపోతుంది. అలాగే ఈ చేపలు శరీర మంట, కొవ్వు, చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి రక్తపోటు స్థాయిలను తగ్గిస్తాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. 
 

డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్ మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఈ చాక్లెట్స్ ను డయాబెటీస్ పేషెంట్లే కాదు అధిక రక్తపోటు పేషెంట్లు కూడా తినొచ్చు. ఈ డార్క్ చాక్లెట్లో యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గించడానికి ఎంతగానో సహాయపడతాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. 

click me!