నోరూరించే క్యారెట్, గుమ్మడికాయ కేక్.. ఇంట్లోనే ఇలా సులువుగా తయారుచేయండి

First Published | Dec 7, 2023, 10:41 AM IST

Winter Cake Recipe: నిజానికి కేకులను బయట తెచ్చుకుని తినడం కంటే ఇంట్లోనే తయారుచేసుకుని తినడం మంచిది. అయితే ఈ కేకులను తయారుచేయడం పెద్ద ప్రాసెస్, చాలా టైం పడుతుంది, వీటిని తయారుచేయడానికి ఏవేవో కావాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. నిజమేంటంటే.. మన ఇంట్లో ఉన్నవాటితోనే చాలా తొందరగా, చాలా సింపుల్ గా కేక్ లను తయారుచేయొచ్చు. ఈ రోజు చాలా టేస్టీగా, తొందరగా తయారుచేయగలిగే క్యారెట్,  గుమ్మడికాయ కేక్ ల తయారీ గురించి తెలుసుకుందాం పదండి. 

కేక్ లు ఒక్క చిన్నపిల్లలే కాదు.. పెద్దల నుంచి ప్రతి ఒక్కరూ తినడానికి ఇష్టపడతారు. అందుకే నెలకోసారైనా ఎలాంటి స్పెషల్ డే లేకున్నా కేక్ లను కొని ఇంటిళ్లిపాది తింటూ ఉంటారు. ఎందుకంటే కేక్ లు అంత టేస్టీగా ఉంటాయి మరి. ప్రస్తుతం చాలా మంది ఒక్క పుట్టిన రోజులకే కాదు.. ప్రమోషన్స్, జాబ్స్ రావడం, పెళ్లిళ్లు, యానివర్సరీలు అంటూ ప్రతి ప్రత్యేకమైన సందర్భానికి కేక్ ను కట్ చేస్తున్నారు. ఈ సంగతి పక్కన పెడితే పిల్లలు తరచుగా కేక్ ను అడుగుతుంటారు. ఇంకేముంది షాప్ కు వెళ్లి కొనిపెడుతుంటారు పేరెంట్స్. కానీ బయటదొరికే కేక్ లు ఆరోగ్యానికి అంత మంచివి కాకపోవచ్చు. వీటిని ఇంట్లోనే తయారుచేసి తినడం మంచిదని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు కూడా చెప్తూ ఉంటారు. ముందే క్రిస్ మస్, న్యూయిర్ కూడా రాబోతున్నాయి. మరి మీరు ఇంట్లోనే చాలా సులువుగా, చాలా తొందరగా తయారుచేయగలిగే రెండు కేక్ ల గురించి ఈ రోజు తెలుసుకుందాం.. చలికాలంలో అందరూ ఇష్టంగా తినే క్యారెట్, గుమ్మడికాయ కేక్ లను ఈ రోజు ఎలా టేస్టీగా తయారుచేయాలో తెలుసుకుందాం పదండి. 

క్యారెట్ కేక్

కావాల్సిన పదార్థాలు: క్యారెట్లు 2 లేదా 3, గుడ్లు - 2, మైదా పిండి - 2 కప్పులు, రుచికి తగినంత చక్కెర, ఆలివ్ ఆయిల్ - 2 టేబుల్ స్పూన్లు, వెనీలా ఎసెన్స్, ఉప్పు , బేకింగ్ పౌడర్ - 1 టీస్పూన్.
 


తయారీ విధానం

క్యారెట్ కేక్ ను తయారుచేయడానికి ముందుగా మైక్రోవేవ్ ను 180 డిగ్రీలకు ప్రీహీట్ చేయండి. తర్వాత క్యారెట్, పంచదార, నూనె, గుడ్డు, వెనిల్లా ఎసెన్స్ ను ఒక బౌల్ లో వేసి బాగా మిక్స్ చేయండి. ఆ తర్వాత దీనిలో పిండి, బేకింగ్ పౌడర్. ఉప్పును వేసి కలగలపండి. అంతే కేక్ ను తయారుచేయడానికి మిశ్రమం తయారైనట్టే. ఇక దీన్ని బేకింగ్ ట్రేలో వేసి 20 నుంచి 30 నిమిషాలు బేక్ చేయండి. ఇంతే చాలా సింపుల్ గా, చాలా ఈజీగా క్యారెట్ కేక్ తయారైనట్టే. ఈ కేక్ ను చిన్నపిల్లలకే కాదు పెద్దలకు కూడా ఎంతో నచ్చుతుంది. ఈ కేక్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఈ క్రిస్ మస్ కో, లేకపోతే న్యూఇయర్ కో ఈ కేక్ ను ట్రై చేయండి.

గుమ్మడికాయ కేక్

కావాల్సిన పదార్థాలు: మైదా పిండి - 2 కప్పులు, బేకింగ్ పౌడర్ - 3 టీస్పూన్లు, దాల్చిన చెక్క తురుము 2 టీస్పూన్లు, బేకింగ్ సోడా - 2 టీస్పూన్లు, పంచదార 2 కప్పులు, ఉప్పు - చిటికెడు, నూనె - 1 కప్పు, గుమ్మడికాయ పేస్ట్ - 2 కప్పులు, వెనీలా యాసిన్స్ - 1 టీస్పూన్, గుడ్లు - 4.
 

తయారీవిధానం

గుమ్మడికాయ కేక్ తయారు చేయడానికి ముందుగా మీరు మైక్రోవేవ్ ను 180 డిగ్రీలకు ప్రీహీట్ చేయండి. ఆ తర్వాత ఒక గిన్నెను తీసుకుని అందులో మైదా పిండి, బేకింగ్ పౌడర్, సోడా, దాల్చిన చెక్క పొడి, ఉప్పు ను వేసి బాగా కలపండి. ఇప్పుడు దీనిలో పంచదార, నూనె వేసి కలపండి. ఆ తర్వాత  దీనిలో గుమ్మడికాయ, వెనీలా ఆసిన్స్ వేసి ఒక గుడ్డు వేసి బాగా కలపండి. ఇప్పుడు ఈ పిండిని ఓవెన్ ట్రేలో పెట్టి 30 నిమిషాల పాటు బేక్ చేయండి. అంతే టేస్టీ టేస్టీ గుమ్మడికాయ కేక్ తయారైనట్టే. ఈ కేక్ ప్రతి ఒక్కరికీ బాగా నచ్చుతుంది. 

Latest Videos

click me!