Cancer Causing Items ఈ ఫుడ్, వస్తువులు దూరం పెట్టండి.. లేదంటే క్యాన్సర్ ఖాయం!

Published : Feb 20, 2025, 10:20 AM IST

క్యాన్సర్ పేరు వింటేనే మనం గజగజా వణికిపోతుంటాం. భారత్‌లో ప్రతి సంవత్సరం క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఈ ప్రాణాంతక వ్యాధి నుంచి కొందరు బయటపడితే, సరైన చికిత్స అందక లేదా అప్పటికే ఆలస్యమై మరికొందరు చనిపోతున్నారు. అయితే క్యాన్సర్లు రకరకాలు. అసలు క్యాన్సర్ వచ్చేలా చేసే ఆహారాలు, వస్తువులు ఏవి? వాటిని దూరంగా పెట్టడం వల్ల ఈ ప్రమాదం బారిన పడకుండా ఎలా ఉండాలి??

PREV
15
Cancer Causing Items ఈ ఫుడ్, వస్తువులు దూరం పెట్టండి.. లేదంటే క్యాన్సర్ ఖాయం!
ప్లాస్టిక్ అసలే వద్దు

ప్లాస్టిక్ కంటైనర్లు, ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లతో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందంటున్నారు వైద్య నిపుణులు. అయితే వీటివల్లే కచ్చితంగా క్యాన్సర్ వస్తుందనడానికి సరైన ఆధారాలు లేవు.  ఒకే వాటర్ బాటిల్‌లో పదే పదే నీళ్లు పోసి తాగడం మంచిది కాదు. ఇందులో క్యాన్సర్ కారకాలు ఉంటాయి. నాసిరకం ప్లాస్టిక్ ను వాడకుండా ఉంటేనే మంచిది. వీలైతే వీటికి బదులు స్టీల్, గాజు బాటిళ్లు వినియోగించాలి.

25
అల్యూమినియం ఫాయిల్

బిర్యానీ, తాజాతాజా ఆహారం ప్యాక్ చేయడానికి అల్యూమినియం ఫాయిల్ ని వినియోగించడం ఈమధ్య కాలంలో ఎక్కువైంది.  దీనివల్ల క్యాన్సర్ రాదు కానీ, ఎక్కువ వాడితే ఆరోగ్యానికి హాని చేసే అంశాలున్నాయి.  వీటికి ప్రత్యామ్నాయంగా అరటి, విస్తరి ఆకులు వాడవచ్చు.

35
శుద్ధి చేసిన నూనె

శుద్ధి చేసిన నూనె వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల మరికొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. అన్నింటికన్నా ఎక్కువ ప్రమాదం ఏంటంటే.. వాడిన నూనెనే మళ్లీ మళ్లీ వేడి చేసి వాడటం. బజ్జీలు, మిర్చీలు, అప్పడాల్లాంటి వాటిలో వీటిని ఎక్కువగా వినియోగిస్తుంటారు. తప్పనిసరిగా తినాలనిపిస్తే ఒక్కసారి మాత్రమే వేడి చేసిన నూనెలో తయారు చేసిన ఈ పదార్థాలు తినాలి.

45
ప్రాసెస్ చేసిన ఫుడ్

పరిశ్రమల్లో తయారయ్యే ఆహార పదార్థాలను అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అంటారు. వీటిని తయారు చేసేటప్పుడు రంగులు కలుపుతారు. ఇది కాకుండా నాన్ స్టిక్ కంటైనర్ వాడకం వల్ల క్యాన్సర్ వస్తుందనే అభిప్రాయం ఉంది కానీ అది రుజువు కాలేదు.  మరీ అవసరమైతే తప్ప వాటిని వాడకపోవడమే ఉత్తమం.

55
కొవ్వొత్తులు

కొవ్వొత్తుల్లో తక్కువ మోతాదులో క్యాన్సర్ కారకాలు ఉన్నాయని చెబుతున్నారు. ఆరోగ్య పరంగా వీటిని అవాయిడ్ చేస్తే మంచిది. ప్లాస్టిక్ బోర్డుల వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. దీనిపై కూరగాయలు తరిగినప్పుడు సూక్ష్్మమైన ప్లాస్టిక్ ఆహారంలో కలుస్తుంది. జీర్ణ వ్యవస్థతో పాటు కొన్ని సమస్యలు వస్తాయట.

Read more Photos on
click me!

Recommended Stories