ఎంతకీ బరువు తగ్గడం లేదా? అయితే ఇప్పటి నుంచి ఈ ఆహారాలను ఖచ్చితంగా తినండి

First Published Sep 29, 2023, 2:50 PM IST

ఖచ్చితంగా బరువు తగ్గాలంటే మాత్రం తీపి, వేయించిన, కార్భోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాలను ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే ఇవి మీ బరువును తగ్గించడానికి బదులుగా మరింత పెంచుతాయి. 
 

weight loss

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఊబకాయుల సంఖ్య బాగా పెరిగిపోతోంది. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లే ఇందుకు ప్రధాన కారణం. ఇక బరువు తగ్గాలని ఎన్నో ప్రయత్నాలను చేస్తుంటారు. కొంతమంది ఏం చేసిన బరువు కొంచెం కూడా తగ్గరు. ఖచ్చితంగా బరువు తగ్గాలంటే మాత్రం మీరు తినే ఆహారం కొన్ని మార్పులు ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారు తీపి పదార్థాలను ఎక్కువగా తినకూడదు. వేయించిన, కొవ్వు, కార్బోహైడ్రేట్లు, చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. అలాగే కేలరీలు తక్కువగా ఉండే ఆహారాలనే తినాలి. బరువు తగ్గడానికి ఎలాంటి ఆహారాలను మీ డైట్ లో చేర్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

పెరుగు

పెరుగును కాలాలతో సంబంధం లేకుండా తినొచ్చు. నిజానికి పెరుగు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. 100 గ్రాముల పెరుగులో కేవలం 56 కేలరీలు మాత్రమే ఉంటాయి. పెరుగును తినడం వల్ల మీ శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు కూడా ఉందుతాయి. పెరుగును తింటే మీ బరువు నియంత్రణలో ఉంటుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరగడం కూడా మొదలవుతుంది. 
 

Latest Videos


Image: Getty Images

చిలగడదుంపలు

తీపి బంగాళాదుంపలు కూడా మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి సహాయపడతాయి. చిలగడదుంపల్లో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. చిలగడదుంపలలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి. అందుకే వీటిని తింటే మీరు సులువుగా బరువు తగ్గుతారు. 
 

Ginger Tea

అల్లం టీ

అల్లం టీ లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. అల్లం టీని తాగడం వల్ల దగ్గు, జలుబు వంటి ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. రెగ్యులర్ గా మీరు పాలు, పంచదార కలిపిన టీకి బదులుగా అల్లం టీని తాగడం వల్ల బరువు బాగా తగ్గుతారు. బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది. 

చిక్కుళ్లు

చిక్కుళ్లు మంచి పోషకాలున్న ఆహారం. వీటి ద్వారా మన శరీరానికి అవసరమైన ఎన్నో ప్రోటీన్స్ అందుతాయి. ఇవి బరువు తగ్గాలనుకునేవారికి కూడా సహాయపడతాయి. ఇందుకోసం వేరుశెనగ, బీన్స్ వంటి చిక్కుళ్లను మీ ఆహారంలో చేర్చుకోవాలి. ఇవి ఆకలిని నియంత్రిస్తాయి. దీంతో మీరు బరువు తగ్గొచ్చు.
 

ఆపిల్ సైడర్ వెనిగర్ 

ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మీ కడుపును తొందరగా నింపుతుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ మీరు కేలరీలు తీసుకోవడాన్ని తగ్గిస్తుంది. రాత్రి పడుకునే ముందు ఆపిల్ సైడర్ వెనిగర్ తాగడం వల్ల ఊబకాయం తగ్గుతుంది. దీన్ని నీటిలో కలిపి తాగొచ్చు. ఇందుకోసం గోరువెచ్చని నీటిని తాగడం మంచిది. అయితే వాటిలో యాసిడ్ ఉంటుంది. అందుకే దీన్ని ఎక్కువగా తినకూడదు. 

click me!