చింతపండును రోజూ తినడం మంచిదేనా?

First Published | Sep 29, 2023, 2:08 PM IST

చింతపండులో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. దీనిలో కొవ్వు అసలే ఉండదు. ఈ పులుపు ను ప్రతిరోజూ తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా బరువు కూడా తగ్గుతారని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అసలు పులుపును రోజూ తినడం మంచిదేనా? 
 

tamarind

చాలా మంది పులుపును ఎక్కువగా తింటుంటారు. ముఖ్యంగా చింతపండును పప్పు చార్లు, పచ్చల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. చింతపండు వంటలను టేస్టీగా చేస్తుంంది. అందుకే దీన్ని ఎక్కువగా వాడుతుంటారు. నిజానికి చింతపండులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగున్నాయి. 

Image: Getty

చింతపండులో యాంటీఆక్సిడెంట్లు, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఈ పులుపులో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. కానీ కొవ్వు మాత్రం అసలే ఉండదు. అందుకే దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారని పలు అధ్యయనాలు వెళ్లడిస్తున్నాయి. ఈ చింతపండులో ఫ్లేవనాయిడ్లు, పాలీఫెనాల్స్ కూడా ఉంటాయి. 
 


ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే చింతపండును రోజూ తినడం వల్ల అజీర్థ అనే సమస్యే ఉండదని నిపుణులు చెబుతున్నారు. దీనిలో ఉండే ఫైబర్స్ మన జీర్ణవ్యవస్థను మెరుగుపరచడానికి సహాయపడతాయి. చింతపండును తింటే మన శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అలాగే అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అలాగే మీ గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం రెగ్యులర్ గా చింతపండు వాటర్ ను తాగొచ్చు. 
 

చింతపండు వాటర్ డయాబెటీస్ పేషెంట్లకు మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ నీళ్లను తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చింతపండులో విటమిన్ సి కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. చింతపండును రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో అంటువ్యాధులు, ఇతర రోగాలొచ్చే ముప్పు తప్పుతుంది.
 

చింతపండులో పాలీఫెనోలిక్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి అల్సర్లను నివారించడానికి  ఎంతో సహాయపడతాయి. అలాగే గట్ ను కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. చింతపండు కాలెయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయ పడుతుందని కూడా ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చింతపండులో మెగ్నీషియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారికి ఎంతో సహాయపడుతుంది. ఇది మీరు బాగా నిద్రపోవడానికి ఎంతో సహాయపడుతుంది. యాంటీ బాక్టీరియల్ లక్షణాలున్న చింతపండు మన చర్మాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడానికి కూడా సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు.

Latest Videos

click me!