కళ్లు బాగా కనిపించాలంటే.. ఈ పండ్లను ఖచ్చితంగా తినండి

First Published | Sep 28, 2023, 1:46 PM IST

పోషకాల లోపం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కంటిచూపు బాగా తగ్గుతుంది. పోషకాలు పుష్కలంగా ఉండే కొన్ని పండ్లను తింటే కంటిచూపు బాగా పెరగడంతో పాటుగా ఇతర అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

eye health

మారుతున్న జీవన శైలి, పని ఒత్తిడి, గంటల తరబడి ఫోన్, ల్యాప్ టాప్ ను చూడటం వల్ల నేడు చాలా మంది కళ్ల జోళ్లను వాడుతున్నారు. ఒక వయస్సు తర్వాత కళ్లు బలహీనపడతాయి. ఈ కారణంగానే కళ్లజోడును ధరించాల్సి వస్తుంది. కానీ పోషకాల లోపం వల్ల నేడు చిన్న పిల్లలు కూడా కళ్లజోళ్లను వాడుతున్నారు. మన కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే..  పౌష్టికాహారాన్ని తినాలి. అలాగే ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. ముఖ్యంగా పనిలో మధ్యమధ్యలో గ్యాప్ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే కంటిచూపును మెరుగుపర్చడానికి, కంటి సమస్యలను దూరం చేయడానికి కొన్ని రకాల పండ్లు ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే? 

Image: Getty

కివి

కివి మంచి పోషకాల బాంఢాగారం. ఈ పండును తింటే మీ కంటి చూపు పెరుగుతుంది. వయసు పైబడిన తర్వాత కంటి చూపు తగ్గిపోతూ ఉంటుంది. అందుకే ఈ పండును తినడం వల్ల కంటిచూపు తగ్గే అవకాశం ఉండదు. కివిలు మన కళ్లకు మంచివి. ఈ పండులో జియాక్సంతిన్, లుటిన్ అనే వర్ణద్రవ్యాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి మన కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. కంటిచూపు తగ్గకుండా కాపాడుతాయి. అంతేకాకుండా ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటిశుక్లం వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. 


బొప్పాయి

బొప్పాయి ఎన్నో ఔషదగుణాలున్న పండు. ఈ పండును తినడం వల్ల మన కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ఈ పండు కంటిసమస్యలను రాకుండా చేస్తాయి. బొప్పాయిలో విటమిన్-ఎ, విటమిన్ సి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఈ పండులో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి మన కంటిచూపును పెంచుతాయి. 
 


అవొకాడో

అవొకాడో కూడా మన కంటి ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పండులో విటమిన్-సి, విటమిన్ ఇ, విటమిన్ బి-6, ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఈ పండు మన కంటిచూపును పెంచడానికి సహాయపడతాయి. 
 

Image: Freepik

ఉసిరి

ఉసిరి మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇది జుట్టు, చర్మానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాదు ఉసిరి కంటికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఉసిసిరిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఉసిరిలో ఉండే విటమిన్ సి కంటి సమస్యలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఇది కళ్లలోని రెటీనా కణాలను బలంగా చేస్తుంది. 

Latest Videos

click me!