40 ఏండ్ల లో కూడా మీరు అందంగా, యవ్వనంగా కనిపించాలంటే వీటిని ఖచ్చితంగా తినండి

First Published | Oct 20, 2023, 12:45 PM IST

హెల్తీ ఫుడ్స్ మనల్ని మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాదు.. మన చర్మాన్ని కూడా ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంచడానికి సహాయపడతాయి. 40 ఏండ్లలో చర్మం వదులుగా మారుతుంది. ముడతలు, మచ్చలు వస్తాయి. అయితే కొన్ని రకాల ఆహారాలను తింటే ఇలాంటి చర్మ సమస్యలేం రావని నిపుణులు చెబుతున్నారు.
 

skin care

వయసు పెరిగే కొద్దీ రోగాలు రావడం ఎంత కామనో.. మన చర్మంపై ముడతలు ఏర్పడం కూడా అంతే కామన్. వయసు పెరుగుతున్న కొద్ది చర్మంపై ముడతలు, మచ్చలు, గీతలు వస్తుంటాయి. కానీ ఇవి అందాన్ని పూర్తిగా తగ్గిస్తాయి. కొన్ని చిట్కాలను పాటిస్తే 40 ఏండ్ల తర్వాత కూడా మీ స్కిన్ సహజంగా మెరిసిపోతుంది. ఆరోగ్యంగా ఉంటుందంటున్నారు నిపుణులు. 

ముఖ్యంగా ఆహారం మన ఆరోగ్యంపై ఎంతో ప్రభావాన్ని చూపుతుంది. మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని చాలావరకు నిర్ణయిస్తుంది. చర్మ సంరక్షణలో కూడా ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. 40 ఏండ్లు దాటిన తర్వాత మీ చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉండటానికి ఎలాంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 


figs

అత్తిపండ్లు

అత్తి పండ్లు లేదా అంజీర పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిని రెగ్యులర్ గా తినొచ్చు. ఈ అంజీర పండ్లలో ఐరన్, పొటాషియం, వివిధ రకాల విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఈ పండ్లను రెగ్యులర్ గాతింటే మీ చర్మం ఆరోగ్యంగా, అందంగా, ముడతలు లేకుండా ఉంటుంది. 
 

చిక్కుళ్లు

చిక్కుళ్లను రెగ్యులర్ గా తినొచ్చు. ఇవి మన చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి ప్రధానంగా 'కొల్లాజెన్' అనే ప్రోటీన్ ఉత్పత్తికి సహాయపడతాయి. ఇది చర్మాన్ని ఆరోగ్యాన్ని, కాంతివంతంగా ఉంచడానికి  సహాయపడుతుంది. గ్రీన్ బీన్స్, బీన్స్, బిగ్ బీన్స్, చన్నా వంటివన్నీ తినొచ్చు. 
 

బాదం పప్పు

రెగ్యులర్ గా తినే ఆహారాల్లో బాదం ఒకటి. వీటిని నానబెట్టుకుని తింటే మన ఆరోగ్యానికి, చర్మానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. వీటిలో ఉండే విటమిన్ ఎ మన చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా చర్మంపై ముడతలను తగ్గించడానికి బాదం సహాయపడుతుంది. బాదం కూడా చర్మాన్ని టైట్ గా ఉంచడానికి సహాయపడుతుంది. 
 

leafy vegetables

ఆకు కూరలు

ఆకు కూరలను కూడా క్రమం తప్పకుండా తినొచ్చు. వీటిలో మన చర్మానికి అవసరమయ్యే ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. బచ్చలికూర, మునగాకు, పాలకూర వంటి ఆకుకూరలను రెగ్యులర్ గా తినొచ్చు. వీటిలో ఉండే క్లోరోఫిల్ చర్మానికి మేలు చేస్తుంది. వీటిలో ఉండే విటమిన్ -సి కూడా చర్మాన్ని ఆరోగ్యంగా, అందంగా ఉంచుతాయి. 
 

బొప్పాయి

బొప్పాయి మన చర్మానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. 40 ఏండ్లు దాటిన వారు దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలి. చర్మంపై ముడతలు, నలుపు రంగును తొలగించడానికి బొప్పాయి గ్రేట్ గా సహాయపడుతుంది. ఇందులో ఉండే విటమిన్-ఎ, విటమిన్ సి, విటమిన్ కె చర్మానికి మేలు చేస్తాయి.

Latest Videos

click me!