బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ తింటే ఏమౌతుందో తెలుసా?

First Published Sep 15, 2024, 10:13 AM IST

చాలా తొందరగా, ఈజీగా తయారుచేసే బ్రేక్ ఫాస్ట్ ఏదైనా ఉందా అంటే అది ఇడ్లీ అనే చెప్పాలి. చాలా మంది ఇడ్లీలను చాలా ఇష్టంగా తింటుంటారు. అయితే మీరు ఉదయం ఇడ్లీలు తింటే ఏమౌతుందో తెలుసా?
 

ఇడ్లీ, దోష, వడ, పూరీ ఇలా ఎన్నో రకాల బ్రేక్ ఫాస్ట్ లను తయారుచేస్తూ ఉంటుంటారు. అయితే కొంతమంది ఇడ్లీలనే ఎక్కువ ఇష్టంగా తింటుంటారు. వారానికి మూడు నాలుగు సార్లైనా ఇడ్లీలనే బ్రేక్ ఫాస్ట్ లో తింటుంటారు. నిజానికి ఇవి తయారుచేయడం చాలా ఈజీ. తొందరగా అయిపోతుంది కూడా.
 

ఎక్కువ కష్టపడకుండా తయారుచేయగలిగే బ్రేక్  ఫాస్ట్ ఒక్క ఇడ్లీ అనే చెప్పాలి. అయితే ఇడ్లీలు టేస్టీగా ఉండటమే కాకుండా.. మన ఆరోగ్యానికి కూడా ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. అవును మీరు బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీలను తింటే లెక్కలేనన్ని ప్రయోజనాలు పొందుతారు అవేంటో ఓ లుక్కేద్దాం పదండి. 

Latest Videos


వెయిట్ లాస్

ఈ రోజుల్లో పెద్దల నుంచి పిల్లల వరకు ప్రతి ఒక్కరూ అధిక బరువుతో బాధపడుతున్నారు. ఈ ఓవర్ వెయిట్ వల్ల డయాబెటీస్ నుంచి గుండె జబ్బుల వరకు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. చాలా మంది బరువు తగ్గాలని రోజూ వ్యాయామం చేస్తుంటారు. స్పెషల్ డైట్ ను ఫాలో అవుతుంటారు.

అయితే బరువు తగ్గాలనుకునేవారికి ఇడ్లీలో ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఇడ్లీల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.  కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది మీ బరువును తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది. 
 

త్వరగా జీర్ణమవుతుంది

బరువు తగ్గాలంటే జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయాలి. అప్పుడే కొవ్వులు నిల్వ ఉండాలి. ఇడ్లీలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి మీరు వీటిని తిన్న 2 గంటల్లో జీర్ణమవుతుంది. కాబట్టి మీరు వీటిని పిల్లలకు ఘనాహారం ఇవ్వొచ్చు. బరువు తగ్గాలనుకునేవారు కూడా వీటిని తినొచ్చు. 

తక్కువ కొలెస్ట్రాల్

శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అయితే మీరు ఇడ్లీలను తింటే ఈ సమస్య ఉండదు.ఆవిరిలో ఉడికిన ఇడ్లీలల్లో  కొలెస్ట్రాల్, కొవ్వులు చాలా తక్కువగా ఉంటాయి.వీటిని తింటే శరీరంలో కొవ్వు పెరిగిపోతుందన్న భయం ఉండదు. కాబట్టి గుండెజబ్బులు ఉన్నవారికి ఇడ్లీలే చాలా మంచివి. 
 


పోషకాలను అందిస్తుంది

ఇడ్లీ పిండిని కొన్ని గంటల పాటు పులియబెడతారు. కాబట్టి వీటిలోని ఖనిజాలను, విటమిన్లను మీ శరీరం సులభంగా గ్రహిస్తుంది. ఇడ్లీలు మీ శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది.

దీంతో మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.  ఇడ్లీలో ఉండే ఫైబర్, ప్రోటీన్లు మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతాయి. ఇది మీరు అతిగా తినకుండా చేస్తుంది. 

ఇడ్లీల్లో మన శరీరానికి అవసరమైన అన్ని రకాల అమైనో ఆమ్లాలను పుష్కలంగా ఉంటాయి. దీంతో మన శరీరానికి మంచి పోషణ అందుతుంది. కిణ్వ ప్రక్రియ వల్ల ఇడ్లీల్లొ ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి.

ఇది మీ గట్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇవి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. 

ఇడ్లీలను మరింత పోషకంగా తయారుచేయడానికి మీరు తెల్లగానే కాకుండా వివిధ రంగుల్లో కూడా తయారుచేయొచ్చు.

ఇడ్లీల్లో మరిన్ని ప్రోటీన్లు, ఫైబర్, సూక్ష్మపోషకాలు ఉండటానికి కూరగాయలను చేర్చొచ్చు. మీకు నచ్చిన కూరగాయలను సన్నగా తరిగి పిండిలో కలుపుకుని ఇడ్లీలు వేసి తినండి. ఇడ్లీల్లో కూడా ఐరన్ ఉంటుంది. వీటిని తింటే రక్త లోపం పోతుంది.

click me!