తొక్కలే కదా అని తీసిపారేయకండి.. ఈ పండ్ల తొక్కలు కూడా ఎన్నో రోగాలను దూరం చేస్తయ్ తెలుసా..?

First Published | Nov 18, 2023, 11:40 AM IST

పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిని రెగ్యలర్ గా తినడం వల్ల ఎన్నో రోగాల నుంచి ఉపశమనం కలుగుతుంది. అయితే చాలా మంది కొన్ని పండ్ల తొక్కలను తీసేసి  తింటుంటారు. ఎందుకంటే అవి ఎందుకూ పనికిరావని.. నిజానికి ఈ పండ్ల తొక్కలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి తెలుసా? 
 

పండ్లలో మన శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటిని రెగ్యలర్ గా తినాలని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు సలహానిస్తుంటారు. అయితే మనలో చాలా మంది కొన్ని పండ్లను తొక్కలతో సహా తింటే.. కొన్ని పండ్లను మాత్రం తొక్క తీసేసే తింటుంటారు. నిజానికి కొన్ని పండ్ల తొక్కలు పండ్ల మాదిరిగానే మనకు మేలు చేస్తాయి. ఎన్నో పోషకాలను అందిస్తాయి. అసలు ఏ పండ్ల తొక్కలు మనకు మేలు చేస్తాయో తెలుసుకుందాం పదండి. 

పియర్

పియర్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే ఈ పండును ఇష్టపడనివారుండరు. ఈ పండును సాధారణంగా తొక్కతో సహా తింటారు. కానీ కొంతమంది దీనిని తొక్క తీసేసే తింటారు. నిపుణుల ప్రకారం.. ఈ పండును తొక్కతో సహా తినేయాలి. ఎందుకంటే దాని తొక్కలో ఎన్నో పోషకాలు, ముఖ్యంగా యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ లు ఉంటాయి. ఇది ఎన్నో దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 
 


జామపండు 

జామకాయను సాధారంగా తొక్కతోనే తింటుంటారు. ఎందుకంటే ఈ కాయతొక్క మన చర్మం, జుట్టుకు ఎన్నో పోషకాలను అందిస్తుంది. అంతేకాదు ఇది మొటిమలను కూడా నివారిస్తుంది. చర్మ కణాలను పునరుత్పత్తి చేస్తుంది. అలాగే ఫ్రీ రాడికల్స్ తో  పోరాడుతుంది కూడా. అంతే కాదు జామ తొక్క సారం మన చర్మాన్ని అందంగా, ప్రకాశవంతంగా చేస్తుంది. అలాగే చర్మంపై మచ్చలను పోగొడుతుంది. 
 

ఆపిల్ పండు

కొంతమంది ఆపిల్ పండు తొక్కను తీసేసి తింటుంటారు. కానీ ఇలా చేయడం వల్ల మీరు ఎన్నో పోషకాలను కోల్పోతారు. ఆపిల్ తొక్కలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె లు పుష్కలంగా ఉంటాయి. దీనిలో పొటాషియం, భాస్వరం, కాల్షియం కూడా ఉంటాయి. ఇవి మన మొత్తం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. కొన్ని అధ్యయనాలు.. ప్రతి ఆపిల్ తొక్కలో సుమారు 8.4 మి.గ్రా విటమిన్ సి, 98 విటమిన్ ఎ ఉన్నాయని చూపించాయి. ఈ తొక్కను తీసేస్తే మాత్రం మీరు ఈ ప్రయోజనాలను మిస్సై పోతారు మరి. 
 

డ్రాగన్ ఫ్రూట్

సాధారణంగా డ్రాగన్ ఫ్రూట్ ను తొక్కను తీసేసే తింటుంటారు. కానీ ఇది చాలా ఆరోగ్యకరమైనదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఈ తొక్కలో ఎక్కువ మొత్తంలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, బీటాసైనిన్ లు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిలో మంచి మొత్తంలో ఆంథోసైనిన్లను కూడా ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి సహాయపడుతాయి. అంతేకాదు ఈ తొక్కలో ఉండే డైటరీ ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. 

Latest Videos

click me!