పచ్చి మిరపకాయలు కూరలను టేస్టీగా చేస్తాయి. అందుకే చాలా మంది వీటిని రెగ్యలర్ గా కూరల్లో వేస్తుంటారు. ఆరోగ్యనిపుణుల అభిప్రాయం ప్రకారం.. పచ్చి మిరపకాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అవును పచ్చి మిరపకాయల్లో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. మీరు రెగ్యలర్ గా తినే ఆహారంలో పర్చిమిరపకాయలను చేర్చుకుంటే ఎన్నో రోగాలు తగ్గుతాయి. ఇవి రక్తపోటును తగ్గిస్తాయి. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి.
పచ్చిమిరపకాయల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి6, కాపర్, ప్రోటీన్, ఐరన్, పొటాషియం, బీటా కెరోటిన్ వంటి మూలకాలు మెండుగా ఉంటాయి. ఇవి మనల్ని ఎన్నో రోగాల నుంచి రక్షించడానికి సహాయపడతాయి. మరి పచ్చి మిరపకాయలను రోజూ తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం పదండి.
రోగనిరోధక శక్తి బలోపేతం
చలికాలంలో మన ఇమ్యూనిటీ పవర్ బాగా తగ్గుతుంది. దీనివల్లే దగ్గు, జలుబు, గొంతునొప్పి వంటి ఎన్నో సమస్యలు వస్తాయి. మీరు పచ్చిమిరపకాయలను రోజూ తింటే మీ రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. దీనిలో విటమిన్ సి, విటమిన్ ఎ లు పుష్కలంగా ఉంటాయి. ఇవే మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. దీంతో ఎన్నో అంటువ్యాధులు, ఇతర రోగాల ముప్పు తప్పుతుంది.
రక్తపోటు అదుపు
అధిక రక్తపోటుతో బాధపడేవారికి కూడా పచ్చి మిరపకాయలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. అవును ఇవి రక్తపోటును అదుపులో ఉంచడానికి సహాయపడతాయి. ఎలా అంటే పచ్చి మిరపకాయల్లో ఉండే యాంటీహైపర్టెన్సివ్ లక్షణాలు అధిక రక్తపోటును నియంత్రించడానికి సహాయపడతాయి.
Image: Freepik
కళ్ల ఆరోగ్యం
పచ్చి మిరపకాయలు కూడా మన కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రోజూ పచ్చి మిరపకాయలను తింటే కళ్లు మెరుగ్గా కనిపిస్తాయి. ఎలా అంటే వీటిలో కళ్లకు మేలుచేసే విటమిన్ ఎ, బీటా కెరోటిన్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే కంటిచూపును పెంచడానికి సహాయపడతాయి.
బరువు తగ్గడానికి
పచ్చి మిరపకాయలు కూడా మీరు బరువు తగ్గడానికి సహాయపడతాయి. అవును వీటిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మీరు ఆరోగ్యంగా బరువు తగ్గేందుకు సహాయపడుతుంది.
డయాబెటిస్
డయాబెటీస్ పేషెంట్లకు కూడా పచ్చి మిరపకాయలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. మీ రోజువారి ఆహారంలో ఒక్క పచ్చిమిరపకాయను చేర్చుకున్నా మీ రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. పచ్చి మిరపకాయల్లో ఉండే యాంటీ డయాబెటిక్ లక్షణాలు బ్లడ్ షుగర్ లెవల్స్ ను నియంత్రిస్తాయి.
కొలెస్ట్రాల్ అదుపులో
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఎందుకంటే ఇది గుండెపోటు వంటి ప్రాణాంతక రోగాలకు దారితీస్తుంది. అయితే పచ్చి మిరపకాయలు ఈ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడతాయంటున్నారు నిపుణులు. పచ్చి మిరపకాయల్లో ఉండే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. దీంతో గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది.
Chillies
చర్మ ఆరోగ్యం
రోజూ ఒక పచ్చిమిరపకాయలను తింటే చర్మం ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీనిలో విటమిన్ సి, విటమిన్ ఇ లు మెండుగా ఉంటాయి. ఇవి చర్మ సంబంధిత సమస్యలను నంయ చేయడానికి సహాయపడతాయి. అలాగే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.