ఒకప్పుడు ఈ అధిక రక్తపోటు సమస్య 40,50 ఏండ్లు పై బడిన వారికి మాత్రమే వచ్చేది. ఇదిప్పుడు పిల్లలు, యుక్తవయసు వారు కూడా ఈ రోగం బారిన పడుతున్నారు. దీన్ని చిన్న సమస్యే అనుకుంటే పొరపాటే. ఎందుకంటే అధిక రక్తపోటు వల్ల మన ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది. ఈ హైబీపీ గుండెపోటు, స్ట్రోక్ వంటి రోగాలకు దారితీస్తుంది. మానసిక ఒత్తిడి, మారిన జీవనశైలి, ఉప్పును ఎక్కువగా తీసుకోవడం, స్మోకింగ్, ఊబకాయం, మద్యపానం వంటివి అలవాట్లు రక్తపోటు పెరగడానికి దారితీస్తాయి. ఈ అధిక రక్తపోటును నియంత్రించడానికి మీ రోజువారి ఆహారంలో ఎన్నో మార్పులు చేసుకోవాలి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. కొన్ని రకాల కూరగాయలు రక్తపోటును నియంత్రించడానికి సహాయపడతాయి. అవేంటో తెలుసుకుందాం పదండి.