చేపలను తినడం వల్ల ఇన్ని లాభాలున్నాయా?

First Published May 16, 2023, 2:39 PM IST

చేపలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో మన ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. 
 

Image: Getty

ఇతర మాంసాల కంటే చేపలే మన ఆరోగ్యానికి ఎక్కువ మంచివి. ఎందుకంటే వీటిలో మనల్ని  ఆరోగ్యంగా ఉంచే ఎన్నో పోషకాలు ఉంటాయి. చేపల్లో ఎన్నోఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. మీకు చేపలకు అలెర్జీ లేకపోతే ఇవి మీకు సూపర్ ఫుడ్. చేపలు ఎన్నో రోగాల ముప్పును కూడా తగ్గిస్తాయి తెలుసా? 
 

Image: Getty

చేపల నుంచి మనం అనేక విధాలుగా ప్రయోజనం పొందుతాం. దీనిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. అయితే మన శరీరం ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లను ఉత్పత్తి చేయదు. అందుకే వీటిని ఆహారం ద్వారే తీసుకోవాలి. కాగా ఇవి చేపల్లో పుష్కలంగా ఉంటాయి. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పెద్ద మొత్తంలో ఐకోసాపెంటెనోయిక్ ఆమ్లం (ఇపిఎ), డోకోసాహెక్సేనోయిక్ ఆమ్లం (డిహెచ్ఎ) కలిగి ఉంటాయి.
 

Image: Getty

మెదడు ఆరోగ్యంగా ఉండటానికి, దాని పనితీరు మెరుగ్గా ఉండేందుకు ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఎంతో అవసరం. ఇవి మంట, అధిక రక్తపోటును తగ్గించడానికి కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయి. 
 

Image: Getty

చేపల్లో ఉండే సెలీనియం, జింక్, అయోడిన్, విటమిన్ ఇ, విటమిన్ ఎ, విటమిన్ బి 2, విటమిన్ డి తో సహా సూక్ష్మపోషకాలు, విటమిన్లు మెదడు పెరుగుదలకు సహాయపడతాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. మన రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. ఇవి మన చర్మాన్ని కూడా తాజాగా, ఆరోగ్యంగా ఉంచుతాయి.
 

Image: Getty

చేపల్లో ఉండే పోషకాలు సాధారణ మెదడు పనితీరుకు మద్దతునిస్తాయి. నవజాత శిశువుల దృష్టి, నాడీ వ్యవస్థ అభివృద్ధికి ఇవి చాలా చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.
 

Image: Getty

చేపలు అధిక-నాణ్యత ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వును కలిగి ఉన్నందున ఊబకాయాన్ని తగ్గించడానికి, బరువు తగ్గడానికి పర్ఫెక్ట్ గా సహాయపడతాయి. ఇవి ఎన్నో రోగాలను దూరం చేస్తాయి. అందుకే చేపలను తరచుగా తింటూ ఉండండి. 

click me!