మసాలా పులిహోర పేరు చెబితే కొత్తగా అనిపించొచ్చు. కానీ ఇది చాలా రుచిగా ఉంటుంది. సాధారణ పులిహోరతో పోలిస్తే మసాలా పులిహోర టేస్టు అదిరిపోతుంది. రెసిపీ తెలుసుకోండి.
వర్షాలు పడుతున్నాయి. స్పైసీగా ఏదైనా తింటే అద్భుతంగా అనిపిస్తుంది. మీకు కారంగా ఏదైనా తినాలనిపిస్తే ఒకసారి మసాలా పులిహోర చేసుకొని చూడండి. ఇంట్లో అన్నం మిగిలిపోయినప్పుడు కూడా ఈ మసాలా పులిహోరను ప్రయత్నించవచ్చు. మిగిలిపోయిన అన్నంతో కేవలం 10 నిమిషాల్లో ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. ఇది లంచ్, డిన్నర్ లలో అదిరిపోతుంది. రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
25
మసాలా పులిహోర రెసిపీకి కావలసిన పదార్థాలు
వండిన అన్నాన్ని రెండు కప్పులు తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఉప్పు రుచికి సరిపడినంత, ఆవాలు అర స్పూను, పసుపు అర స్పూను, పచ్చిమిర్చి నాలుగు, ఎండు మిర్చి మూడు, పచ్చి శనగపప్పు ఒక స్పూను, కొత్తిమీర తరుగు ఒక స్పూను, ఉల్లిపాయ ఒకటి, పల్లీలు గుప్పెడు, జీలకర్ర ఒక స్పూను, నూనె ఒక స్పూను, కరివేపాకులు గుప్పెడు సిద్ధం చేసి పెట్టుకోండి.
35
మసాలా పులిహోర రెసిపీ ఇదిగో
మసాలా పులిహోర చేసుకోవడానికి ముందుగా వండి అన్నాన్ని ఒక ప్లేటులో పొడిపొడిగా వచ్చేలా పెట్టుకోండి. ఇప్పుడు అదే అన్నంలో రుచికి సరిపడినంత ఉప్పు, కారం వేసి చేత్తోనే కలపండి. ఇప్పుడు స్టవ్ మీద కలాయి పెట్టి నూనె లేదా నెయ్యి వేసి అందులో ఆవాలు, జీలకర్ర వేసి వేయించండి. ఆ తర్వాత పచ్చిమిర్చి తరుగు, శనగపప్పు, వేరుశెనగ పలుకులు, ఎండు మిర్చి వేసి వేయించండి. ఆ తర్వాత పసుపు వేసి వేయించండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కారం కలిపిన అన్నంలో వేసి బాగా కలపండి. మరోవైపు ఉల్లిపాయలను సన్నగా తరిగి ఈ అన్నంలో వేసి కలపండి. అలాగే కొత్తిమీర తరుగును కూడా వేసి బాగా కలుపుకోండి. అంతే మసాలా పులిహోర రెడీ అయిపోయినట్టే.
45
పులిహోరతో రైతా
ఈ మసాలా పులిహోర పక్కన రైతాను పెట్టుకొని రెండింటి కాంబినేషన్లో తింటే రుచి అదిరిపోతుంది. ఒక్కసారి మేము చెప్పిన పద్ధతిలో ట్రై చేసి చూడండి. మీకు కచ్చితంగా నచ్చుతుంది. పులావ్ బిర్యానీలాగే ఈ మసాలా పులిహోర కూడా స్పైసీగా అనిపిస్తుంది. సాధారణ పులిహోర బోర్ కొడితే దీన్ని అప్పుడప్పుడు చేసుకొని తినండి.
55
అన్నం మిగిలిపోతే ఇలా
అన్నం మిగిలిపోయినప్పుడు ఇలా మసాలా పులిహోరను చేసుకోవచ్చు. లంచ్ బాక్స్ రెసిపీ గా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కూర వండే ఓపిక లేనప్పుడు ఇలా అప్పటికప్పుడు మసాలా పులిహోర వండేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది. నూనెకి బదులు నెయ్యి వేస్తే మరింత అద్భుతంగా అనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ఒకసారి ప్రయత్నించి చూడండి.