మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి కరివేపాకు కూడా ఎంతో సహాయపడుతుంది. కరివేపాకు మన శరీరంలోని అనేక వ్యాధులతో పోరాడుతుంది. కరివేపాకులో ఐరన్, కాపర్, కాల్షియం, ఫాస్పరస్, ఫైబర్, విటమిన్ కె, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. పరిగడుపున ఒక గ్లాసు నీటితో పాటు 5-6 పచ్చి కరివేపాకు ఆకులను నమలడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. కరివేపాకును పరగడుపున నమలడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం.
బలమైన జుట్టు
కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇలాంటి కరివేపాకు ఫ్రీ రాడికల్స్ ను నిరోధిస్తుంది. అలాగే మన జుట్టును బలంగా, ఆరోగ్యంగా చేస్తుంది. కరివేపాకులో ఉండే విటమిన్ బి జుట్టు మొత్తం ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఇది జుట్టు బాగా పెరిగేందుకు సహాయపడుతుంది. అలాగే జుట్టు తెల్లబడే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
Curry Leaves
ఇమ్యూనిటీ పవర్
యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే కరివేపాకు రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది. ఇమ్యూనిటీ పవర్ పెరగడం వల్ల అంటువ్యాధులు, ఇతర రోగాల ముప్పు తప్పుతుంది.
కంటిచూపు
కరివేపాకు విటమిన్ ఎ భాండాగారం. కరివేపాకును రోజూ ఆహారంలో చేర్చుకోవడం వల్ల కంటి చూపు మెరుగవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కరివేపాకు మీ కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది.
curry leaves
గ్యాస్, ఉబ్బరం
కరివేపాకును పరగడుపున తినడం వల్ల గ్యాస్, ఉబ్బరం మొదలైన జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. ప్రస్తుతం చాలా మంది మలబద్దకంతో బాధపడుతున్నారు. కరివేపాకు మలబద్ధకం నుంచి ఉపశమనం పొందటానికి, ఎసిడిటీని నివారించడానికి సహాయపడుతుంది.
curry leaves benefits
వెయిట్ లాస్
బరువు తగ్గాలనుకునే వారు కూడా కరివేపాకును రోజూ డైట్ లో చేర్చుకోవచ్చు. ఎందుకంటే వీటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఇది మీ జీవక్రియను మెరుగుపరచడానికి కూడా సహాయపడతాయి.
మధుమేహులు
డయాబెటిస్ పేషెంట్లు కూడా కరివేపాకును ఎంచక్కా తినొచ్చు. ఇది వీరి ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. కరివేపాకు మధుమేహాన్ని కొంతవరకు నియంత్రిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇందులో ఉండే హైపర్ గ్లైసెమిక్ పదార్థాలు మధుమేహాన్ని నివారిస్తాయి. కరివేపాకులో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది.
చెడు కొలెస్ట్రాల్
కరివేపాకు తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. కొలెస్ట్రాల్ తగ్గడానికి ప్రతిరోజూ ఉదయం 10 గంటల వరకు పచ్చి కరివేపాకును నమలండి.
గుండె ఆరోగ్యం
కరివేపాకును రోజువారి డైట్ లో చేర్చుకోవడం వల్ల మీ గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే గుండె పనితీరు కూడా బాగుంటుంది.