మధుమేహ వ్యాధిగ్రస్తులకు స్ట్రాబెర్రీలు, కోరిందకాయలు, బ్లూబెర్రీలు, బ్లాక్ బెర్రీలు వంటి బెర్రీలు మంచి మేలు చేస్తాయి. వీటిలో చక్కెర తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది డయాబెటిస్ ఉన్నవారికి మంచి మేలు చేస్తుంది. బెర్రీ పండ్లలో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. అలాగే ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. అవి యాంటీఆక్సిడెంట్ల కు మంచి మూలం. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించేందుకు సహాయపడతాయి. కివిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్, విటమిన్ సి, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. జీర్ణక్రియను మెరుగుపరచడానికి, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి సహాయపడే ఎంజైమ్లు కూడా దీనిలో ఉంటాయి.