ఎండాకాలంలో సాల్మన్ ఫిష్ ను తింటే ఇలా అవుతుందా?

First Published | Jun 10, 2023, 10:33 AM IST

సాధారణంగా చలికాలంలోనే సాల్మన్ వంటి సీఫుడ్ ను తింటుంటాం. కానీ వీటిని ఎండాకాలంలో కూడా తినొచ్చు. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు అంటున్నారు. 
 

సీ ఫుడ్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే సాధారణంగా వేడి వాతావరణంలో చేపలను తినకూడదని చాలా మంది చెబుతుంటారు. ఎందుకంటే జీర్ణవ్యవస్థ దీన్ని జీర్ణించుకోవడం అంత సులభం కాదు. సాల్మన్ వంటి సీఫుడ్ ను వేసవిలో కూడా తినొచ్చని సీఫుడ్ పై చేసిన ఎన్నో పరిశోధనలు చెబుతున్నాయి. మరి ఎండాకాలంలో సాల్మన్ మన శరీరానికి ఎలాంటి ప్రయోజనాలను అందిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

పోషకాలు ఎక్కువగా ఉంటాయి 

న్యూట్రియంట్ జర్నల్‌లో ప్రచురించబడిన పరిశోధన ప్రకారం.. సాల్మన్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగున్న విభిన్నమైన చేప. 100 గ్రాముల సాల్మన్ లో మన శరీరానికి ఒక రోజుకు అవసరమైన ప్రోటీన్ లో  41% ఉంటుంది. అంతేకాదు దీనిలో విటమిన్ బి 3, విటమిన్ బి 5, విటమిన్ బి 6, విటమిన్ బి 12, విటమిన్ డి, విటమిన్ ఇ, సెలీనియం ఒక రోజుకు మన శరీరానికి అవసరమైన దానిలో 20% ఉంటాయి. ఈ చేపలు పొటాషియానికి గొప్ప మూలం.
 


హైడ్రేషన్ 

పాకిస్తాన్ లోని బోలాన్ యూనివర్శిటీ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సైన్సెస్ నిర్వహించిన పరిశోధన ప్రకారం.. వాటర్ సమృద్ధిగా ఉండటం వల్ల చాలా చేపలు ఎండాకాలంలో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి. సాల్మన్ ఇతర చేపల కంటే శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచుతుంది.
 

నాడీ వ్యవస్థ సంరక్షణ

బోలన్ యూనివర్శిటీ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సైన్సెస్ ప్రకారం.. సాల్మన్ లో డీహెచ్ఏ, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఎండాకాలంలో ఇవి మన మెదడు ఎదుగుదలకు ఎంతో మేలు చేస్తాయి. ఇది 3-10 సంవత్సరాల వయస్సున్న పిల్లలలో సానుకూలంగా పనిచేస్తుంది. ఇది నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.
 

ఒత్తిడి, నిరాశ

హార్వర్డ్ హెల్త్ లో ప్రచురించిన ఒక పరిశోధన కథనం ప్రకారం.. ఎక్కువ పని వల్ల అలసట, ఒత్తిడి వంటి సమస్యలు వస్తాయి. అలా అయితే వీకెండ్స్ లో సాల్మన్ ఫిష్ ను తినండి. ఇది అలసట వల్ల కలిగే నిరాశ, ఒత్తిడి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అందుకే ఎండాకాలంలో సాల్మన్ చేపలను తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

కీళ్ల నొప్పులు

హార్వర్డ్ హెల్త్ ప్రకారం.. కీళ్ల నొప్పులు, ఆస్టియో ఆర్థరైటిస్ తో బాధపడుతున్న వారికి సాల్మన్ ప్రయోజనకరంగా ఉంటుంది. ఇవి మన శరీరానికి బయోయాక్టివ్ పెప్టైడ్లను సరఫరా చేస్తాయి. ఇవి కీళ్లు, మృదులాస్థిలో కొల్లాజెన్ సంశ్లేషణను పెంచడానికి సహాయపడతాయి. ఇది ఆస్టియో ఆర్థరైటిస్ వల్ల కలిగే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందటానికి సహాయపడుతుంది.
 

Image: Getty Images

హృదయ సంబంధ వ్యాధులను నివారిస్తుంది

బ్రిటిష్ మెడికల్ జర్నల్ ప్రకారం.. సాల్మన్ ను తినడం గుండె ఆరోగ్యానికి మంచిది. డీహెచ్ఏ, ఒమేగా -3 కొవ్వులతో పాటుగా ఇది ఇపీఏ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. ఇది గుండె సజావుగా పనిచేయడానికి సహాయపడుతుంది. ఇది మంటను కూడా తగ్గిస్తుంది. అలాగే రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. సాల్మన్ చేపలను తింటే ధమనులు విస్తరిస్తాయి. చేపలను వారానికి రెండుసార్లు తింటే గుండెపోటు, ఇతర గుండె జబ్బుల ముప్పు తప్పుతుంది. సాల్మన్ చేపలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలలో ఇదీ ఒకటి. 

విటమిన్ డి 

హార్వర్డ్ హెల్త్ ప్రకారం.. సాల్మన్ విటమిన్ డి కి గొప్ప వనరులలో ఒకటి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఈ పోషకం చాలా అవసరం. ఈ విటమిన్ లోపం క్యాన్సర్, స్క్లెరోసిస్, ఆర్థరైటిస్ వంటి భయంకరమైన వ్యాధులకు దారితీస్తుంది. 

Image: Youtube Video Still

నిద్రలేమి

బ్రిటిష్ మెడికల్ జర్నల్ ప్రకారం.. సాల్మన్ లో ఉండే పోషకాలు మంచి నిద్రకు సహాయపడతాయి. ఇది మెదడును శాంతపరుస్తుంది. ఇది విశ్రాంతి తీసుకోవడానికి బాగా సహాయపడుతుంది.

Image: Freepik

ఎండాకాలంలో సాల్మన్ ఎలా తినాలి?

ఎండాకాలంలో సాల్మన్ ను డీప్ ఫ్రై చేయడం మంచిది కాదు. వీటిని ఎప్పుడూ కూడా తక్కువ మంటపై పాన్ లో లేదా అవసరమైన ఉష్ణోగ్రత వద్ద ఉడికించండి. బాగా శుభ్రం చేసిన సాల్మన్ ను పసుపు, ఉప్పు, మిరియాలు, వెల్లుల్లి పేస్ట్, 1 టీస్పూన్ నూనెతో కలపండి. పాన్ లేదా పొయ్యి మీద ఉడికించండి.

Latest Videos

click me!