ఒక కడాయిలో కొద్దిగా నూనె పోసి వేడి చేయాలి. అందులో మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ధనియాలు వేసి దోరగా వేయించి ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. అదే నూనెలో తరిగిన ఉల్లిపాయ, వెల్లుల్లి, చిన్న చింతపండు ముక్క, పసుపు వేసి ఉల్లిపాయలు బాగా వేగే వరకు కలిపి, చల్లారనివ్వాలి.
అదే కడాయిలో గింజలు తీసేసిన కాకరకాయ ముక్కలను వేసి, అవి బాగా మెత్తబడే వరకు నూనెలో మగ్గించి పక్కన పెట్టుకోవాలి.