పప్పు అన్నమే కదా అని తీసిపారేయకండి.. దీన్ని తింటే ఎన్ని లాభాలున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు

First Published Mar 15, 2024, 10:05 AM IST

కాలాలతో సంబంధం లేకుండా పప్పు చారును తింటుంటాం. చాలా మంది పప్పు చారును  ఇష్టంగా తింటుంటారు. నిజానికి పప్పు చారు టేస్టీగా ఉండటమే కాకుండా.. మన ఆరోగ్యానికి కూడా ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. అవును అన్నంలో పప్పును తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. 

మన దేశంలో చాలా మంది అన్నంలో పప్పు చారును తినడానికి బాగా ఇష్టపడతారు. ఈ కాంబినేషన్ బలే టేస్టీగా ఉంటుంది. చాలా మంది ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేనప్పుడు లేదా టమాటాలు మాత్రమే ఉన్నప్పుడు పప్పు చారునే చేస్తారు. పిల్లలకైతే పప్పు చారే ఎక్కువగా నచ్చుతుంది. పప్పు, అన్నం కాంబినేషన్ మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది తెలుసా?  వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతగానో సహాయపడతాయి. పప్పులు, అన్నం కలిపి తినడం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

తేలికగా జీర్ణం 

రాత్రిపూట అన్నం, పప్పు తినడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా సులువుగా జీర్ణం అవుతుంది. దీనిలో ఉండే పోషకాలను కూడా పొందుతారు. రాత్రిపూట తేలిగ్గా జీర్ణమయ్యే ఆహరాన్ని తింటే అజీర్థి వంటి జీర్ణ సమస్యలు ఉండవు. 
 

మంచి నిద్ర

పప్పుచారును అన్నంలో  కలుపుకుని తింటే రాత్రిళ్లు హాయిగా నిద్రపడుతుంది. దీన్ని తినడం వల్ల మీరు నిద్రకోసం కష్టపడాల్సిన అవసరం లేదు. ఇది మీరు చాలా త్వరగా నిద్రలోకి జారుకునేలా చేస్తుంది. దీంతో మీరు పొద్దున్నే ఎనర్జిటిక్ గా మేల్కొంటారు. రోజంతా రీఫ్రెష్ గా ఉంటారు. 
 


బరువును నియంత్రిస్తుంది

అన్నం, పప్పు తినడం వల్ల మీ కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. దీనివల్ల మీరు అతిగా తినలేరు. వీటివల్ల మీరు బరువు పెరిగే అవకాశం అసలే ఉండదు. అలాగే బరువు కూడా సులువుగా తగ్గుతారు. బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి ఫుడ్ అనే చెప్పాలి. 

జీర్ణక్రియ మెరుగు

ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఈ తేలికపాటి భోజనం చేయడం వల్ల మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పప్పు అన్నాన్ని తినడం వల్ల ఉదర సంబంధ సమస్యల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. 

బలమైన ఎముకలు

పప్పు అన్నాన్ని కలిపి తినడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. ఎముకల సమస్యలు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. ఈ తేలికపాటి భోజనంలో ప్రోటీన్లు,  కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి దంతాలను, ఎముకలను బలోపేతం చేస్తాయి. మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
 

కండరాలు బలోపేతం 

అన్నం, పప్పును కలుపుకుని తింటే కండరాలు బలోపేతం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు పప్పు అన్నం తింటే దంతాలు కూడా స్ట్రాంగ్ గా ఉంటాయి. దంతాల సమస్యలు వచ్చే రిస్క్ కూడా తగ్గుతుంది. 

ఉబ్బరం నుంచి ఉపశమనం 

పప్పు అన్నం తినడం వల్ల కడుపు ఉబ్బరం సమస్య నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. అలాగే ఇది ప్రేగు కదలికను సులభతరం చేస్తుంది. దీంతో మీకు మలబద్దకం అనే సమస్యే ఉండదు. ఒకవేళ మలబద్దకం సమస్య ఉన్నా సులువుగా బయటపడతారు.

click me!