పిల్లలకు పాలు ఇస్తున్నారా..? వెంటనే ఈ ఫుడ్స్ మాత్రం పెట్టకండి..!

First Published Mar 14, 2024, 3:19 PM IST

కొన్ని రకాల ఫుడ్స్ తో కలిపి తీసుకోవడం వల్ల ప్రమాదంగా మారతాయనే విషయం మీకు తెలుసా? మరి ఎలాంటి ఫుడ్స్ తో పాలు కాంబినేషన్ తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
 

పాలు ఆరోగ్యానికి చాలా మంచిది. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎదిగే పిల్లలకు కచ్చితంగా ప్రతిరోజూ పాలు ఇవ్వాల్సిందే. పాల ద్వారా మన శరీరానికి కాల్షియం అందుతుంది. అయితే.. మంచిది అయిన పాలను.. కొన్ని రకాల ఫుడ్స్ తో కలిపి తీసుకోవడం వల్ల ప్రమాదంగా మారతాయనే విషయం మీకు తెలుసా? మరి ఎలాంటి ఫుడ్స్ తో పాలు కాంబినేషన్ తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

egg

1.గుడ్డు..
చాలా మంది పిల్లలకు స్కూల్ కి వెళ్లేముందు బ్రేక్ ఫాస్ట్ తినడం లేదని.. ఒక గుడ్డు, గ్లాసు పాలు ఇచ్చేస్తూ ఉంటారు. కానీ.. ఈ రెండు కాంబినేషన్ అస్సలు మంచిది కాదు. వెంట వెంటనే తినకూడదు. ఈరెండు ఫుడ్స్ తినడానికి కాస్త గ్యాప్ తీసుకోవడం చాలా అవసరం. దాని కడుపు హెవీగా ఉండటంతోపాటు.. డైజెషన్ సమస్యలు వస్తూ ఉంటాయి.

meat

2.మీట్ ( మాంసం)

మీట్ తిన్నప్పుడు  పాలు తాగడకూదడు. లేదంటే.. పాలు తాగిన వెంటనే కూడా మీట్ తినకూడదు. ఈ రెండింటి కాంబినేషన్ కూడా ఆరోగ్యానికి అంత మంచిదేమీ కాదు. మీట్ లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది.  ఈ రెండూ కలిపి తీసుకుంటే.. శరీరంలో కెమికల్ రియాక్షన్స్ జరిగే ప్రమాదం ఉంది.

fish

3.చేపలు..
మీట్ లాగానే... చేపల తర్వాత..  కూడా పాలు తాగకూడదు. చేపల్లోనూ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి... చేపలు తిని పాలు తాగితే.. ఏవైనా జీర్ణ సమస్యలు వచ్చే  అవకాశం ఎక్కువగా ఉంటుంది.  ఈ కాంబినేషన్ తీసుకుంటే.. తర్వాత ఇబ్బంది పడతారు.

curd

4.పెరుగు..
ఇది అందరికీ తెలిసిన సత్యం. పాలు తీసుకున్నప్పుడు పెరుగు, పెరుగు తిన్న వెంటనే పాలు అస్సలు తీసుకోకూడదు. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే వాంతులు అవ్వడం.. లేదంటే ఏదైనా  అరుగుదల సమస్యలు వస్తాయి. కొంచెం గ్యాప్ ఇచ్చి కూడా తినకుండా ఉండటమే మంచిది. తక్కువలో తక్కువ మూడు, నాలుగు గంటల గ్యాప్ చాలా అవసరం.
 

Citrus Fruits

5.సిట్రస్ ఫుడ్స్..
విటమిన్ సీ ఎక్కువగా పండ్లు అంటే లెమన్, ఆరెంజ్ లాంటివి కూడా పాలతో తీసుకోకూడదు. ఈ పండ్లలో పెరుగులో ఉండే లక్షణాలు ఉంటాయి. ఇవి కూడా  కలిపి తీసుకుంటే.. కూడా కడుపులో  రకరకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

banana

6.అరటిపండు..
పాలతో కలిపి చాలా ఎక్కువగా  అరటిపండు ను చాలా మంది తీసుకుంటే..బనానా మిల్క్ షేక్ అంటూ కూడా చేసుకొని తాగుతూ ఉంటారు. కానీ.. ఇది కూడా మంచి ఆప్షన్ కాదు. ఈ రెండూ తీసుకుంటూ.. అరగడానికి చాలా సమయం తీసుకుంటుంది., అరుగుదల సమస్యలు కూడా వస్తూ ఉంటాయి.

spicy food

7స్పైసీ ఫుడ్..
స్పైస్ ఎక్కువగా ఉండే ఆహారాలు కూడా పాలతో కలిపి తీసుకోకూడదు. కడుపులో యాసిడ్ రియాక్షన్స్ జరుగుతాయి. కాబట్టి.. ఎక్కువ స్పైసీగా ఉండే ఆహారం తీసుకున్నప్పుడు కూడా  పాలు తీసుకోకుండా ఉండటమే మంచిది.

click me!