కేరళ స్టైల్ మటన్ కర్రీ.. ఇలా చేశారంటే ఒక్క ముక్కలేకుండా తింటారు..

First Published Mar 14, 2024, 1:10 PM IST

ఎప్పుడూ ఒకేలా తినాలంటే కూడా విసుగొస్తుంది. అలాగే అలా చేసి చేసి కూడా అలసటొస్తుంది. అందుకే ఈ సారి మటన్ కర్రీని కాస్త డిఫరెంట్ గా, టేస్టీగా తయారుచేయండి. మీరు గనుక కేరళ స్టైల్ లో మనట్ కర్రీని తయారుచేశారంటే ఒక్క ముక్క లేకుండా తింటారు. అదెలా తయారుచేయాలో తెలుసా? 

చాలా మంది వారం వారం చికెన్ లేదా మటన్ ను వండుకుని తింటుంటారు. కానీ ప్రతి వారం ఒకేరకంగా తినాలనింపించదు. కాస్త డిఫరెంట్ ను కోరుకునేవాళ్లు చాలా మందే ఉన్నారు. కానీ చాలా మంది మన సంప్రదాయ పద్ధతిలోనే మటన్, చికెన్ వంటకాలను తింటుంటారు. మీకు డిఫరెంట్ గా తినాలనిపిస్తే మాత్రం ఈ సారి మీరు కేరళ స్టైల్ మటన్ కర్రీని తయారుచేయండి. కేరళ స్టైల్ మటన్ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే దీన్ని ఎలా తయారుచేయాలో చూసేద్దాం పదండి. 

mutton curry

కేరళ స్టైల్ మటన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు

350గ్రా మటన్, 1 టీస్పూన్ తరిగిన అల్లం, 1 టేబుల్ స్పూన్ తరిగిన వెల్లుల్లి,  1/2 టీస్పూన్ పసుపు, 1  పచ్చిమిర్చి తరిగినవి, 1/4 కప్పు ఉల్లిపాయ, 8-10 కరివేపాకు, నీళ్లు, తగినంత ఉప్పు, 
 

Image Credit: Getty Images

కర్రీ కోసం..

2-3 టీస్పూన్ల కొబ్బరి నూనె, 1 టీస్పూన్ కారం పొడి, 3/4 కప్పు తరిగిన ఉల్లిపాయ, 1 టీస్పూన్ తురిమిన అల్లం, 3-4 తరిగిన వెల్లుల్లి రెబ్బలు, 8-10 కరివేపాకు, 1/4 కప్పు టమాటా ముక్కలు, 3 టేబుల్ స్పూన్ల కొబ్బరి.
 

కేరళ స్టైల్ లో మటన్ కర్రీ ఎలా చేయాలి?

ముందుగా మటన్ ను బాగా ఉడకబెట్టాలి. ఇందుకోసం మటన్ లో నీళ్లు, పసుపు, కరివేపాకు, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉప్పు వేసి ప్రెషర్ కుక్కర్ లో వేయండి. దీన్ని బాగా కలిపి 15-20 నిమిషాలు లేదా విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించండి. 
 

ఇప్పుడు బాణలిలో కొబ్బరి నూనె వేసి మీడియం మంట మీద వేడి చేయండి. నూనె వేడి అయ్యాక కరివేపాకు, ఉల్లిపాయలు వేయండి. ఒకటి లేదా రెండు నిమిషాలు వేయించిన తర్వాత అల్లం, వెల్లుల్లి వేసి వేయించండి. ఆ తర్వాత ఉడికించిన మటన్ ను దీంట్లో వేయండి. తర్వాత కొబ్బరి, టొమాటో, ఎండుమిర్చి వేసి కలపండి. దీనిలో సరిపడా నీళ్లను కూడా కలపండి. మంట తక్కువగా పెట్టి.. పెట్టి 20-25 నిమిషాలు మెత్తగా ఉడికించండి. అపుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండండి. అంతే ఎంతో టేస్టీగా ఉండే కేరళ స్టైల్ మటన్ కర్రీ రెడీ అయినట్టే. వేడివేడిగా సర్వ చేస్తే రుచి అదిరిపోతుంది. 

click me!