seeds
ఆరోగ్యం ఎవరికీ చేదు కాదు.. ఎలాంటి రోగాలు లేకుండా.. హ్యాపీగా ఉండాలంటే.. అది మన చేతుల్లోనే ఉంటుంది. మనం తీసుకునే ఆహారం మీదనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మరి.. ఎలాంటి సమస్యలు రాకుండా హెల్త్ బాగుండాలి అంటే... మన ఆహారంలో కొన్ని రకాల ఫుడ్స్ ని చేర్చుకోవాలి. అందులో గింజలు కచ్చితంగా ఉండాలి. ఈ ఏడు రకాల గింజలు కనుక.. మీరు రోజూ తీసుకునే ఆహారంలో ఉంటే... మీ ఆరోగ్యానికి వచ్చిన డోకా ఉండదు. మరి అవేంటి..? వాటి వల్ల కలిగే లాభాలేంటో ఓసారి చూద్దాం..
flax seed
1.అవిసె గింజలు..
అవిసె గింజలు.. వీటిని ఫ్లాక్స్ సీడ్స్ అని కూడా పిలుస్తారు. రెండు టేబుల్ స్పూన్ల అవిసె గింజల్లో 6 గ్రాముల ఫైబర్, 4 గ్రాముల ప్రోటీన్ పులస్కలంగా ఉంటాయి. వీటిలో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. వీటిని రోజూ మీ డైట్ లో తీసుకుంటే.. జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. అంతేకాకుండా.,. మీకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి.
chia seed
2.చియాసీడ్స్..
చిన్న ఆవగింజంత ఉండే ఈ చియా సీడ్స్ మన ఆరోగ్యంపై అద్భుతాలు చేస్తుంది. రెండు టేబుల్ స్పూన్ల చియా సీడ్స్ లో 10 గ్రాముల ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా.. మంచి ఆరోగ్యకరమైన ప్రోటీన్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ , యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటు, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం జింక్ వంటి మినరల్స్ కూడా ఉంటాయి. ఇవి బరువు తగ్గించడంలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. మన ఎముకలను బలంగా చేయడంలోనూ...బీపీ తగ్గించడంలోనూ.. ఈ చిన్న గింజలు కీలక పాత్ర పోషిస్తాయి.
3.సన్ ఫ్లవర్ గింజలు..
మనం వంటలో భాగంగా సన్ ఫ్లవర్ ఆయిల్ వాడుతూ ఉంటాం. అయితే... ఆ నూనె మాత్రమే కాదు.. ఆ పువ్వు గింజలు కూడా మన ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. వీటిలో ఆరోగ్యకరమైన ఫ్యాట్స్, ప్రోటీన్, ఫైబర్, మినరల్స్, విటమిన్ ఈ పుష్కలంగా ఉంటాయి. ఇమ్యూనిటీని పెంచడంలో సహాయపడతాయి. గర్భం దాల్చాలి అనుకునేవారు ముఖ్యంగా మహిళలు.. వీటిని తమ ఆహారంలో భాగం చేసుకుంటే... ఫలితం బాగుంటుంది.
4.గుమ్మడి గింజలు..
గుమ్మడి గింజలు కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. గుమ్మడి గింజల్లో 16శాతం ఐరన్ ఉంటుంది. అంతేకాదు.. వీటిలో అమీనో ఆసిడ్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, జింక్, మెగ్నీషియం వంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. బ్లాడర్ హెల్త్ కి కూడా ఇవి సహాయపడతాయి.
Basil Seeds Water
5.బేసిల్ సీడ్స్..
ఇవి చూడటానికి సబ్జా గింజల్లానే ఉంటాయి. కానీ ఇవి తులసి గింజలు. వీటిలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. దీనిలో క్యాలరీలు కూడా జీరో. బరువు పెరుగుతాం అనే భయం ఉండదు. వేసవిలో వేడి తగ్గించడంలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. మినరల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తాయి.
black sesame seeds
6.నువ్వులు..
నువ్వులు కూడా మనం తీసుకునే ఆహారంలో భాగం చేసుకోవాలి. నల్ల నువ్వులు కూడా తీసుకోవచ్చు. ఎముకలు బలంగా మార్చడానికి సహాయపడతాయి. శరీరంలో కొలిస్ట్రాల్ ని కంట్రోల్ చేయడానికి, బీపీ తగ్గించడానికి సహాయపడతాయి.
pomegranate
7.దానిమ్మ గింజలు..
మనం ఇష్టంగా దానిమ్మ గింజలు మన ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తాయి. వీటిలో ఫైబర్, విటమిన్ సీ ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా కాపాడతాయి. మంచి ప్రోటీన్స్చ యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయి.