వర్షాకాలంలో ఏం తింటే.. జుట్టు రాలదో తెలుసా?

First Published | Aug 14, 2024, 3:37 PM IST

మన డైట్ లో కొన్ని మార్పులు చేసుకోవడం చాలా అవసరం. మనం..వర్షాకాలంలో ఎలాంటి ఫుడ్స్ తింటే జుట్టురాలదో ఇప్పుడు తెలుసుకుందాం..
 

వర్షాకాలం వచ్చింది అంటే చాలు.. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా జుట్టు విపరీతంగా  ఊడిపోతూ ఉంటుంది.  అప్పుడప్పుడు వర్షంలో తడిచినా కూడా.. జుట్టు రాలడం సమస్య మొదలౌతుంది. కొన్నిసార్లు మనం వర్షంలో తడవకపోయినా.. వాతావరణంలో ఉన్న తేమ కారణంగా కూడా జుట్టు రాలడం మొదలౌతుంది. మరి ఈ  సమస్యకు చెక్ పెట్టాలంటే,. మన డైట్ లో కొన్ని మార్పులు చేసుకోవడం చాలా అవసరం. మనం..వర్షాకాలంలో ఎలాంటి ఫుడ్స్ తింటే జుట్టురాలదో ఇప్పుడు తెలుసుకుందాం..
 

1.ఒమేగా 3 ఫ్యాటీ ఫుడ్స్..
ఒమేగా 3 ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటే జుట్టు రాలడం తగ్గుతుంది.  అంటే అవిసెగింజలు, వాల్ నట్స్ , చియా సీడ్స్ లాంటివి తీసుకోవాలి. వీటిలో ఏవి మీ డైట్ లో ఉన్నా... మీ జుట్టు బలంగా మారుతుంది.  ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది.
 



2.కరివేపాకు..
ప్రతిరోజూ క్రమం తప్పకుండా 7 నుంచి 8 కరివేపాకు ఆకులు తీసుకోవడం మొదలుపెట్టాలి.  వీటిని తీసుకోవడం వల్ల.. జుట్టురాలడం సమస్య తగ్గిపోవడంతో పాటు.. ఒత్తుగా మారడానికి సహాయపడుతుంది.


3.ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే ఫుడ్స్..
మీ డైట్ లో ఐరన్, ఫోలిక్  యాసిడ్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవడం మొదలుపెట్టాలి. హలీమ్ సీడ్స్, మునగాకు, డేట్స్, అత్తి పండ్లు లాంటివి తీసుకోవాలి. ఇవి తీసుకోవడం వల్ల జుట్టు బలంగా పెరగడానికి సహాయపడుతుంది.

4.ప్రోటీన్..
కచ్చితంగా ఆహారంలో ప్రోటీన్ పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. మన బాడీ బరువును పట్టి ప్రోటీన్ తీసుకోవాలి. ఒక కేజీ బరువుకు ఒక గ్రాము ప్రోటీన్ తీసుకోవాలి. ప్రోటీన్ పుష్కలంగా తీసుకున్నప్పుడే.. మన జుట్టు బలంగా, ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది.

5.నేరేడు కాయలు..
మనకు దాదాపు ఈ వర్షాకాలంలో నేరేడు కాయలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి తినడం వల్ల.. జుట్టు బాగా పెరుగుతుంది. అసలు జుట్టురాలే సమస్య ఉండదు. దీనిలో  యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి, కొల్లాజిన్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ.. మన జుట్టును కుదుళ్ల నుంచి బలంగా మారుస్తాయి.

6.షుగరీ ఫుడ్స్..
మనం ఎలాంటి ఫుడ్స్ తినాలో కాదు.. ఏవి తినకూడదో కూడా తెలుసుకోవాలి.  షుగర్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ ని మనం ఎక్కువగా తినకూడదు.  ఇవి మనం జుట్టును బలహీనం చేయడంలో ముందుంటాయి. అందుకే.. వీలైనంత వరకు వీటికి దూరంగా ఉండాలి.

refined flour

7.రిఫైండ్ ఫ్లోర్స్..
బ్లడ్ షుగర్ లెవల్స్ ని ఎక్కువగా పెంచేసే పిండ్లు అంటే.. మైదా పిండి లాంటి వాటి జోలికి వీలైనంత వరకు దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే.. ఇవి జుట్టును బలహీనంగా మార్చడంలో ముందుంటాయి. మైదా పిండితో చేసే ఫుడ్స్, బకేరీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ కి దూరంగా ఉండాలి.

Latest Videos

click me!