మనం అందరం రోజూ అన్నమే తింటూ ఉంటాం. కానీ.. బరువు తగ్గాలి, లేదు ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవాలి అనుకునేవాళ్లు.. అన్నం పక్కన పెట్టేసి.. మిలెట్స్ తినడం, చపాతీలు తినడం లాంటివి చేస్తూ ఉంటారు. రోజూ చపాతీలు, రోటీలు తినేవారు కూడా ఉంటారు. అయితే... రెగ్యులర్ గా తినేటప్పుడు.. కేవలం గోధుమ పిండితో మాత్రమే కాకుండా డిఫరెంట్ గా.. ఇతర పిండులతో కూడా ట్రై చేయాలి. ఏయే పిండులతో మనం చపాతీలు చేసుకోవచ్చు..? వాటిని తినడం వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో ఓసారి చూద్దాం..
1.రాగి చపాతీ..
రాగి పిండితో దోశలు తినే ఉంటారు. ఈసారి చపాతీ ట్రై చేయండి. రాగి పిండిలో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. మన ఎముకలు, దంతాలను బలంగా మార్చడంలో సహాయం చేస్తాయి. పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు వీటిని తినొచ్చు. ఆరోగ్యంగా ఉంటారు. కాస్త నెయ్యి జోడించి తింటే మరింత రుచిగా కూడా ఉంటాయి.
2.మొక్కజొన్న చపాతి..
మొక్కజొన్నతో మీరు చాలా రకాల వంటలుతినే ఉంటారు. కొందరు గారెలు కూడా చేసుకుంటారు. కానీ.. మీరు చపాతీకూడా చేసుకోవచ్చు. చక్కగా స్వీట్ కార్న్ ని పేస్టులాగా చేసుకొని గోధుమ పిండిలో కలిపి చేసుకోవచ్చు. రుచి అద్భుతంగా ఉంటుంది. ఈ మొక్క జొన్నలో సెలెనియం ఉంటుంది. థైరాయిడ్ సమస్య ఉన్నవారికి కచ్చితంగా వీటిని తినాలి. థైరాయిడ్ ని మేనేజ్ చేయడంలో చాలా బాగా సహాయపడుతుంది.
3.బార్లీ చపాతీ..
బార్లీ గింజల పొడిని గోధుమ పిండిలో కలిపి ఈ చపాతీ చేసుకోవచ్చు. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. గుండె సంబంధిత సమస్యలు రాకుండా కాపాడటంతో పాటు... డయాబెటిక్ సమస్యను తగ్గిస్తుంది. క్యాన్సర్ బారిన కూడా పడకుండా ఉంటారు. సులభంగా జీర్ణం కూడా అవుతుంది.
4.చట్టూ చపాతీ..
దీనిని.. శెనగలతో చేస్తారు. పచ్చి శెనగలను నానపెట్టి.. మిక్సీ చేసి.. గోధుమ పిండిలో కలుపుకొని ఈ చపాతీ చేసుకోవచ్చు. మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్ అందుతుంది. మజిల్ పెరగడానికి, బ్రెయిన్ చురుకుగా పని చేయడానికి కూడా సహాయపడుతుంది.
5.పల్లీ చపాతీ..
పల్లీ పొడితో కూడా చపాతీ చేసుకోవచ్చు. ఇది మన బాడడీలో కొలాజిన్ ఉత్పత్తి పెరగడానికి సహాయపడుతుంది. ఫలితంగా.. చర్మం అందంగా మారడానికి సహాయపడుతుంది. దీని వల్ల మీరు యవ్వనంగా కనపడతారు.