hibiscus tea
ముద్ద మందారం పూలు, మందారం ఆకులు మన అందాన్ని పెంచడంలోనూ సహాయం చేస్తాయి. ఎక్కువగా మనం.. మందారపూలు, ఆకులు జుట్టు బలంగా పెరగడానికి, మృదువుగా మారడానికి వాడతాం. కానీ... మందారపూలతో చేసిన టీని ఎప్పుడైనా తాగారా..? ఈ తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా? మరి ఈ టీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం...
hibiscus tea
ఈ మందారపూల టీని.. ప్రతిరోజూ ఉదయాన్నే తాగడం చాలా అవసరం మంచి జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ముందు ఈ టీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..
hibiscus tea
ఎండిపోయిన మందారపూల రెమ్మలను రెండు, మూడు స్పూన్లు తీసుకోవాలి. అప్పుడు వీటిని రెండు కప్పుల నీటిలో వేయాలి. అంతే.. ఐదు నిమిషాలపాటు మరిగించితే.. ఈ మందారపూల టీ తయారైనట్లే. వీటిని వడబోసి.. కాస్త తేనె, నిమ్మకాయ రసం జోడించి.. తాగేయడమే.
hibiscus tea
ఈ మందారపూల టీని ప్రతిరోజూ ఉదయం తాగడం వల్ల.. సులభంగా బరువు తగ్గవచ్చు. శరీరంలోని కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. మనం తీసుకునే కార్బో హైడ్రేట్స్ ని కూడా ఫ్యాట్స్ గా మారకుండా అడ్డుకుంటుంది. క్రమంగా.. బరువు తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది.
అంతేకాదు.. అధిక బీపీ ఉన్నవారు కూడా రెగ్యులర్ గా ఈ టీ తాగాలి. ఇలా తాగడం వల్ల బీపీ చాలా వరకు కంట్రోల్ లో ఉంటుంది. రెగ్యులర్ గా తాగడం వల్ల.. హై బీపీ కి ఇక మీరు ట్యాబ్లెట్స్ మింగాల్సిన అవసరం కూడా ఉండదు.
మందారపూల టీలో యాంటీడిప్రసెంట్ ప్రాపర్టీలు పుష్కలంగా ఉంటాయి. ఇవి.. మన బాడీలో యాంక్సైటీ, డిప్రెషనల్ లాంటివి తగ్గించడంలో సహాయం చేస్తాయి.