పెరుగు మన బరువు కూడా పెంచేస్తుంది. ఈ విషయం చాలా మందికి తెలీదు. తెలీకుండా రాత్రిపూట పెరుగన్నం తినేస్తూ ఉంటారు. కానీ , దాని వల్ల అధిక బరువు పెరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. పెరుగు మన బాడీలో ఫ్యాట్ పెరగడానికి కారణం అయితే, అన్నం గ్లూకోజ్ లెవల్స్ పెరగడానికి కారణం అవుతుంది. ఫలితంగా బరువు పెరిగిపోతారు. బరువు పెరిగిపోతున్నాం అనే భయం ఉన్నవారు దీనికి దూరంగా ఉండటమే మంచిది.
పెరుగు మన జీర్ణ వ్యవస్థకు మంచిది అయనప్పటికీ.. రాత్రిపూట మాత్రం జీర్ణ సమస్యలకు కారణం కావచ్చు. ఎందుకంటే.. పెరుగన్నం కలిపి తీసుకున్నప్పుడు దాంట్లో ఫైబర్ తక్కువగా ఉంటుంది. దీంతో.. అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది. దాని వల్ల గ్యాస్, మలబద్దకం సమస్య కూడా ఏర్పడుతుంది.