దాల్చిన చెక్కను తింటే ఏమౌతుందో తెలుసా?

First Published | Nov 8, 2024, 7:01 PM IST

దాల్చిన చెక్క ఒక మసాలా దినుసు. ఇది అందరికీ తెలిసిందే. ఇది ఫుడ్ రుచిని పెంచడానికి సహాయపడుతుంది. కానీ ఇది మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీన్ని తింటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా?

దాల్చిన చెక్క తెలియని వారు ఎవరూ ఉండరు. సాధారణంగా దీన్ని మనం ఒక మసాలా దినుసుగా ఉపయోగిస్తాం. దీనికున్న స్పెషల్ స్మెల్, టేస్ట్ వల్ల దీన్ని మనం ఎన్నో వంటల్లో వేస్తుంటాం. అయితే ఇదొక మసాలా దినుసు మాత్రమే కాదు.. ఆయుర్వేద మూలిక కూడా. అవును ఇది మన ఆరోగ్యానికి ఈ మసాలా దినుసు ఎంతో ప్రయోజనకరంగ ఉంటుంది. 

దాల్చిన చెక్కలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే దీనిలో విటమిన్ విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి6, కాల్షియం, ఫైబర్, మెగ్నీషియం, విటమిన్ కె వంటి ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఎన్నో ఔషదగుణాలున్న ఈ చెక్క మన ఆరోగ్యానికి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. 
 

దాల్చిన చెక్క మన జీర్ణక్రియను మెరుగుపరచడం నుంచి గుండెను ఆరోగ్యంగా ఉంచడం వరకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. కానీ ఈ చెక్క చేసే ఆరోగ్య ప్రయోజనాలు మనలో చాలా మందికి తెలియవు. అందుకే ఈ మసాలా దినుసు మన ఆరోగ్యానికి చేసే మేలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది

డయాబెటీస్ ఉన్నవారికి దాల్చిన చెక్క ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ చెక్కను తింటే శరీరంలో ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది. ఇది బ్లడ్ షుగర్ ను నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది. దాల్చిన చెక్క టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది.
 


గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

దాల్చిన చెక్క గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. దాల్చిన చెక్కలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. ఆ మసాలా దినుసు చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. అలాగే ట్రైగ్లిజరైడ్లను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే శరీరంలో మంచి కొలెస్ట్రాల్ ను పెంచడానికి సహాయపడుతుంది. దీంతో మీకు గుండె జబ్బులొచ్చే ప్రమాదం తగ్గుతుంది. మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. 

బరువు తగ్గడానికి సహాయపడుతుంది

బరువు తగ్గాలనుకునేవారికి కూడా దాల్చిన చెక్క ఉపయోగపడుతుంది. ఈ మసాలా దినుసు మీ శరీర జీవక్రియను పెంచుతుంది. దీంతో మీ శరీరంలో పేరుకుపోయిన కొవ్వు ఫాస్ట్ గా కరగడం మొదలవుతుంది. అలాగే దాల్చిన చెక్కను తీసుకోవడం వల్ల ఆకలి చాలా వరకు తగ్గుతుంది. అలాగే మీ కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉన్న అనుభూతి కలుగుతుంది. ఇది మీరు బరువు తగ్గడానికి, బరువు పెరగకుండా ఉండటానికి సహాయపడుతుంది. 


రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది

దాల్చిన చెక్కలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మీ శరీరానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. ఈ చెక్కను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మీ ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. అలాగే జలుబు, దగ్గు, ఫ్లూ వంటి జబ్బులు కూడా మీకు రావు. 

మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది

దాల్చిన చెక్క మీ మెదడు పనితీరును మెరుగుపర్చడానికి కూడా సహాయపడుతుంది. దీనిని తీసుకోవడం వల్ల మీ మెమోరీ పవర్ బాగా పెరుగుతుంది. అలాగే అభిజ్ఞా పనితీరు కూడా మెరుగుపడుతుంది. ఈ చెక్క వినియోగం పార్కిన్సన్, అల్జీమర్స్ వంటి న్యూరోడెజెనరేటివ్ వ్యాధుల ప్రమాదాల్ని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. 
 

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

దాల్చిన చెక్క జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనిని తీసుకోవడం వల్ల గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఈ మసాలా దినుసులో ఉండే యాంటీ మైక్రోబయల్ లక్షణాలు పేగుల్లోని హానికరమైన బ్యాక్టీరియాను నియంత్రిస్తాయి. దీంతో కడుపునకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. 

Latest Videos

click me!