వీళ్లు వంకాయ తినొద్దు

First Published | Sep 18, 2024, 10:15 AM IST

వంకాయ కూర ఎంతో టేస్టీగా ఉంటుంది. అందుకే వారానికి రెండు మూడు సార్లు తినే వారున్నారు. కానీ కొంతమంది వంకాయను పొరపాటున కూడా తినకూడదు. వాళ్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం
 

వంకాయ కూరను ఎలా చేసినా టేస్ట్ అదిరిపోతుంది. అందులో గుత్తి వంకాయ టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. అందుకే చాలా మంది వారంలో ఒకటి రెండు సార్లైనా వంకాయ కూరను వండుకుని తింటుంటారు. కానీ ఈ కూరగాయ ఆరోగ్యానికి మంచిది కాదన్న ముచ్చట చాలా మందికి తెలియదు. ముఖ్యంగా కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడేవారు వంకాయను అస్సలు తినకూడదు.

brinjalc


గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం

వంకాయ  కూరను తింటే జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు వస్తాయి. వంకాయ గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలను మరింత పెంచుతుంది. ముందే వానాకాలంలో మన జీర్ణవ్యవస్థ మరింత సున్నితంగా మారుతుంది. అందుకే మీకు ఇప్పటికే గ్యాస్ట్రిక్ లేదా జీర్ణ సమస్యలు ఉంటే వంకాయను అస్సలు తినకండి. 
 

Latest Videos


రక్తహీనత

శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు కూడా వంకాయను అస్సలు తినకూడదు. ఎందుకంటే వంకాయలో ఉండే కొన్ని మూలకాలు మన శరీరంలో ఇనుము శోషణను తగ్గిస్తాయి. దీంతో ఒంట్లో రక్తం మరింత తగ్గుతుంది. అందుకే మీకు రక్తహీనత సమస్య ఉంటే వంకాయను పొరపాటున కూడా తినకండి. 

అలెర్జీ 

కొంతమందికి వంకాయకు అలెర్జీ ఉంటుంది. వంకాయలో ఉండే 'సోలనిన్' అనే మూలకం అలెర్జీకి కారణమవుతుంది. అందుకే వంకాయను తింటే కొంతమందికి చర్మంపై దురద, ముఖం లేదా గొంతు వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. వంకాయను తిన్న తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తే మీరు ఇంకెప్పుడూ వంకాయను తినకండి. అలాగే వెంటనే హాస్పటల్ కు వెళ్లండి.
 

brinjal

కిడ్నీ సమస్యలు

మూత్రపిండాల వ్యాధి ఉన్నవారు వంకాయను అస్సలు తినకూడదు. ఎందుకంట వంకాయలో ఆక్సలేట్ అనే మూలకం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్లను ఏర్పరుస్తుంది. మీకు ఇప్పటికే కిడ్నీ స్టోన్స్ ఉంటే వంకాయను అస్సలు తినకండి. 
 

ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు

మోకాళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు ఉన్నవారు టమాటాలు, బంగాళాదుంపలు, క్యాప్సికమ్, వంకాయ వంటి కూరగాయలకు దూరంగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు. ఈ కూరగాయలలో సోలనిన్ అనే మూలకం ఉంటుంది. ఇది కొంతమందిలో కీళ్లలో మంట, నొప్పిని కలిగిస్తుంది. ముఖ్యంగా ఇది కీళ్ల నొప్పులను బాగా పెంచుతుంది. అందుకే ఆర్థరైటిస్ పేషెంట్లు వంకాయను తినకూడదు. 

click me!