kitchen tips: స్టీల్ గిన్నెల్లో ఈ కూరలు మాత్రం వేయకండి

Published : Aug 15, 2025, 05:26 PM IST

స్టీల్ గిన్నెల్లోనే చాలా మంది అన్నం, కూరలను వండుతుంటారు. అలాగే రకరకాల వంట పనుల కోసం ఉపయోగిస్తుంటారు. కానీ ఈ స్టీల్ గిన్నెలు మన ఆరోగ్యానికి చెడు చేస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

PREV
14
స్టీల్ గిన్నెలు

ప్రతి వంటింట్లో స్టీల్ పాత్రలు ఖచ్చితంగా ఉంటాయి. అన్నం, కూరలను వండటం నుంచి ఫుడ్ ను వడ్డించడం, ఆహారాలను నిల్వ చేయడం వరకు స్టీల్ పాత్రలను బాగా ఉపయోగిస్తుంటారు. ఇవి చూడటానికి నీట్ గా, తలతలా మెరిసిపోతుంటాయి. 

అందులోనూ ఈ పాత్రలు తొందరగా పాడవవు కూడా. వీటిని రెగ్యులర్ గా ఉపయోగించొచ్చు. కానీ ఈ పాత్రల్లో కొన్ని ఆహార పదార్థాలను నిల్వ చేయకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే స్టీల్ తో స్పందించే ఆహార పదార్థాలు చాలా ఉంటాయి. 

దీనివల్ల వాటి టేస్ట్ మారుతుంది. ముఖ్యంగా మన ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు అంటున్నారు. అందుకే స్టీల్ పాత్రల్లో ఏయే ఆహారాలను వేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

24
పెరుగు

స్టీల్ గిన్నెల్లో పెరుగును అస్సలు నిల్వ చేయకూడదు. ఎందుకంటే పెరుగు పుల్లగా ఉంటుంది. అంటే ఇది ఆమ్ల స్వభావాన్ని కలిగుంటుంది. కాబట్టి దీన్ని మీరు స్టీల్ పాత్రల్లో ఎక్కువ సేపు నిల్వ చేస్తే ఆది టేస్ట్, ఆకృతి మారతాయి. ఇలాంటి పెరుగును తినలేం. అలాగే పెరుగు తొందరగా పాడవుతుంది. అందుకే పెరుగును నిల్వ చేయడానికి గాజు లేదా మట్టి పాత్రలను ఉపయోగించాలి.

ఊరగాయ

స్టీల్ పాత్రల్లో పుల్లని లేదా తీయని ఊరగాయలను కూడా నిల్వ చేయకూడదు. ఎందుకంటే ఊరగాయల్లో నూనె, ఉప్పు, పులుపు వంటి పదార్థాలు ఉంటాయి. ఇవి స్టీల్ తో రియాక్ట్ అవుతాయి. ముఖ్యంగా సరైన నాణ్యతలేని స్టీల్ పాత్రల్లో ఊరగాయను ఉంచితే దాని రుచి పూర్తిగా మారిపోతుంది. అలాగే ఊరగాయ తొందరగా పాడైపోతుంది కూడా.

34
టమాటాలతో చేసిన వంటకాలు

టమాటా చారు, టమాటా పప్పు వంటి టమాటాతో చేసిన ఏ కూరనైనా సరే స్టీల్ గిన్నెల్లో నిల్వ చేయకూడదు. ఎందుకంటే టమాటాల్లో యాసిడ్ ఉంటుంది. ఇది స్టీల్ తో రియాక్ట్ అయ్యి వంట టేస్ట్ చెడిపోతుంది. అలాగే కూరలోని పోషకాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఎప్పుడైనా సరే టమాటా వంటకాలను గాజు లేదా సిరామిక్ పాత్రల్లో నిల్వ చేయాలి.

తరిగిన పండ్లు

పండ్లు కోసిన తర్వాత వాటిని స్టీల్ బాక్స్ లో అస్సలు ఉంచకూడదు. దీని వల్ల పండ్లు చాలా త్వరగా పొడిబారిపోయి వాటి రుచి కూడా చెడిపోతుంది. ముఖ్యంగా అరటి, నారింజ, సపోటా వంటి మృదువైన పండ్లను ఎప్పుడూ స్టీల్ పాత్రల్లో నిల్వ చేయకూడదు. వాటిని ఎల్లప్పుడూ ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ లేదా గాజు గాలి చొరబడని కంటైనర్లలో నిల్వ చేయండి.

44
నిమ్మకాయ వంటకాలు

నిమ్మకాయతో చేసిన వంటలను కూడా స్టీల్ గిన్నెల్లో వేయకూడదు. ఎందుకంటే నిమ్మకాయలో ఉన్న ఆమ్ల స్వభావం వల్ల స్టీల్ చర్య జరుపుతుంది. మీరు గనుక నిమ్మకాయను స్టీల్ పాత్రల్లో ఎక్కువ సేపు ఉంచితే దాని రుచి చెడిపోతుంది. ఫుడ్ కూడా తొందరగా కుళ్లిపోతుంది. అందుకే నిమ్మకాయతో చేసిన ఫుడ్ ను ఎప్పుడూ కూడా గాజు లేదా ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ తో చేసిన పాత్రల్లోనే నిల్వ చేయాలని నిపుణులు చెబుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories