Train: ట్రైన్‌లో ఎక్కి కూర్చోక ముందే స్టేషన్ చేరితే ఎలా ఉంటుంది? ఇది వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా నిజంగానే ప్రపంచంలో ఇలాంటి చిన్న ట్రైన్ ఉంది. కేవలం ఒక నిమిషంలో ప్రయాణం పూర్తవుతుంది. ఈ చిన్న రైల్వే లైన్ 100 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది.
ప్రపంచంలో అతి చిన్న రైల్వే లైన్ పేరు ఏంజెల్స్ ఫ్లైట్ రైల్వే. ఇది అమెరికాలోని లాస్ ఏంజెల్స్ నగరంలో ఉంది. ఈ రైల్వే ట్రాక్ పొడవు కేవలం 90 మీటర్లు (సుమారు 315 అడుగులు) మాత్రమే. చిన్నదైనా ఇది ప్రముఖ పర్యాటక ఆకర్షణగా మారింది. ఈ ట్రైన్ ప్రయాణం చాలా తక్కువ సమయం మాత్రమే ఉంటుంది. ప్రయాణికులు ట్రైన్‌లో ఎక్కిన కొద్ది సెకన్లలోనే గమ్యస్థానానికి చేరుకుంటారు. అందుకే దీనిని ప్రపంచంలో అతి చిన్న ట్రైన్ ప్రయాణంగా భావిస్తారు.
25
కేబుల్‌తో నడిచే ప్రత్యేక ట్రైన్
ఈ ట్రైన్ సాధారణ రైలు కాదు. ఇది ఫ్యూనిక్యులర్ రైల్వే అనే ప్రత్యేక విధానంలో పనిచేస్తుంది. అంటే ఇది కేబుల్ సిస్టమ్‌తో పైకి కిందికి ప్రయాణిస్తుంది. ఈ ట్రాక్‌ను సుమారు 33 డిగ్రీల ఎత్తైన వంకరపై నిర్మించారు. ఈ ట్రైన్‌లో రెండు చిన్న కోచ్‌లు ఉంటాయి. వాటి పేర్లు ఒలివెట్‌తో పాటు సినై. ఒక కోచ్ పైకి వెళ్లినప్పుడు మరో కోచ్ కిందికి వస్తుంది. ఈ విధానం వల్ల ప్రయాణం సురక్షితంగా జరుగుతుంది.
35
1901లో ప్రారంభమైన చరిత్ర
ఈ రైల్వే లైన్ 1901లో ప్రారంభమైంది. అప్పట్లో కొండ ఎత్తులో ఉన్న ప్రాంతాలకు ప్రజలు సులభంగా వెళ్లేందుకు దీనిని నిర్మించారు. తర్వాత ఇది నగరానికి గుర్తింపుగా మారింది. ప్రారంభంలో ఈ రైల్వే మూడవ స్ట్రీట్ టన్నెల్ దగ్గర నిర్మించారు. 1969 వరకు లక్షలాది మంది ప్రయాణికులను కొండపైకి తీసుకెళ్లింది.
ఈ రైల్వే చరిత్రలో కొన్ని కష్టకాలాలు కూడా వచ్చాయి. 2001లో జరిగిన ఒక ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించాడు. ఈ సంఘటన తర్వాత రైల్వేను మూసివేశారు. పరిశీలన, మరమ్మతుల తర్వాత 2010లో మళ్లీ ప్రారంభించారు. ప్రస్తుతం ఇది మరింత సురక్షితంగా నడుస్తోంది. పర్యాటకులు ఎక్కువగా సందర్శించే ప్రదేశంగా మారింది. టికెట్ ధరల విషయానికొస్తే ఒక వైపు ప్రయాణం సుమారు 1.50 డాలర్లు, రౌండ్ ట్రిప్: సుమారు 3 డాలర్లుగా నిర్ణయించారు.
55
ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న వ్యక్తి ఎవరంటే.?
ఈ ప్రత్యేక రైల్వే నిర్మాణానికి కారణమైన వ్యక్తి కర్నల్ జె. డబ్ల్యూ. ఎడ్డి. ఆయన వృత్తిరీత్యా న్యాయవాది. అయితే ఇంజనీరింగ్‌పై మంచి అవగాహన కూడా ఉండేది. అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్‌కు ఆయన సన్నిహిత మిత్రుడిగా చెప్తారు. ఆయన ఆలోచన వల్లే ఈ చిన్న రైల్వే నిర్మాణం సాధ్యమైంది. చిన్నదైనా ఈ రైల్వే ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఒక నిమిషం ప్రయాణం అయినా, శతాబ్దం చరిత్ర కలిగిన ఈ ట్రైన్ పర్యాటకులను ఇప్పటికీ ఆకట్టుకుంటోంది.