1. పసుపు రంగు సులభంగా కనిపిస్తుంది
సైన్స్ ప్రకారం... ఇతర రంగుల కంటే పసుపు రంగు 1.24 రెట్లు వేగంగా మనిషి కంటికి కనిపిస్తుంది. దూరం నుండి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే విద్యార్థుల భద్రత దృష్ట్యా వారు ప్రయాణించే బస్సుకు పసుపు రంగు వేస్తారు.
2. పొగమంచు, వర్షంలోనూ కనిపించే రంగు పసుపు
చలికాలంలో దట్టమైన పొగమంచు, వర్షాకాలంలో భారీ వానలు పడుతుంటాయి. ఇలాంటి సమయంలోనే విద్యార్థులు ఉదయమే స్కూల్ కి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఈ పొగమంచు, వానల సమయంలోనూ పసుపు రంగులో ఉండే స్కూల్ బస్సులు ఇతర వాహనాల డ్రైవర్లకు దూరంనుండే స్పష్టంగా కనిపిస్తాయి. దీంతో ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉండదు.
3. చీకట్లోనూ స్పష్టంగా కనిపించే రంగు పసుపు
పసుపు రంగుకు ఉన్న మరో ప్రత్యేకత చీకటిలోనూ కనిపిస్తుంది. స్పెషల్ క్లాసులు, ప్రత్యేక కార్యక్రమాల సమయంలో విద్యార్థులు రాత్రి వరకు స్కూల్లోనే ఉండాల్సి వస్తుంది. ఇలాంటి సమయాల్లో రాత్రుళ్లు విద్యార్థులు ప్రయాణించినా ఎలాంటి ప్రమాదాలకు అవకాశం ఉండకుండా బస్సు రంగు ఉపయోగపడుతుంది.