విద్యుత్ సబ్ స్టేషన్లలో కంకర రాళ్లు ఎందుకుంటాయి? దీని వెనక ఇంత మ్యాటర్ దాగుందా..!

Published : Aug 26, 2026, 01:54 PM IST

మీ ప్రాంతానికి విద్యుత్ సరఫరా చేసే సబ్ స్టేషన్ ను నిత్యం చూస్తూనే ఉంటారు. అయితే ఇందులో నేలపై కంకర రాళ్లు ఎందుకుంటాయి? అనే డౌట్ వచ్చేవుంటుంది. దీనిపై క్లారిటీ రావాలంటే ఈ సమాచారం తెలుసుకోవాల్సిందే.

PREV
15
కంకర రాళ్లతో ఇన్ని లాభాలా..!

పెద్దపెద్ద నగరాల నుండి చిన్న గ్రామాల వరకు ప్రస్తుతం ప్రతి చోటు విద్యుత్ కాంతులతో మెరిసిపోతోంది. ఈ టెక్ జమానాలో కరెంట్ సరఫరా లేని మారుమూలప్రాంతాలు చాలా తక్కువ.. వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. అయితే ఏ ప్రాంతానికైనా విద్యుత్ సరఫరా చేయాలంటే తప్పనిసరిగా సబ్ స్టేషన్ ఉండాలి. సబ్ స్టేషన్ నుండే నివాస ప్రాంతాలు, కంపెనీలకు కరెంట్ సరఫరా జరిగేది. మీరు ఎప్పుడైనా విద్యుత్ సబ్ స్టేషన్ ను గమనిస్తే అక్కడ పెద్దపెద్ద విద్యుత్ పరికరాల కింద కంకరరాళ్లు ఉంటాయి. ఇలా ఎందుకనే డౌట్ చాలామందికి వచ్చివుంటుంది. మరి విద్యుత్ సబ్ స్టేషన్లలో నేలపై ఈ రాళ్లను వేయడం వెనకున్న సైన్స్ ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

25
1. ఫైర్ సెప్టీ (విద్యుత్ ప్రమాదాల నివారణ)

విద్యుత్ సరఫరా కోసం ఏర్పాటుచేసే సబ్ స్టేషన్లలో భారీ ట్రాన్స్ ఫార్మర్లు ఉంటాయి. నిరంతరం పనిచేసే వీటిని కూల్ చేసేందుకు ప్రత్యేకమైన ఆయిల్ వాడతారు. అయితే కొన్నిసార్లు ట్రాన్స్ ఫార్మర్ల నుండి ఈ ఆయిల్ లీక్ అవుతుంటుంది. ఈ సమయంలోనే సబ్ స్టేషన్లలో ఉండే కంకరరాళ్లు ప్రమాదాలను నివారిస్తాయి.

ట్రాన్స్ ఫార్మర్లలోంచి లీక్ అయ్యే ఆయిల్ సబ్ స్టేషన్ మొత్తం వ్యాపించకుండా కంకర రాళ్లు అడ్డుకుంటాయి. దీంతో మంటలు చెలరేగే ప్రమాదం ఉండదు. ఒకవేళ ఈ రాళ్లు లేకపోతే సబ్ స్టేషన్ మొత్తం ఆయిల్ వ్యాపించి మొదట మంటలు, తర్వాత భారీ పేలుడు సంభవించే ఆస్కారం ఉంటుంది.

35
2. ఇన్సులేషన్ (విద్యుత్ ప్రవాహాన్ని అడ్డుకోవడం)

విద్యుత్ సబ్ స్టేషన్లలో నిత్యం హైవోల్టేజ్ కరెంట్ ప్రవాహం జరుగుతుంటుంది. కొన్నిసార్లు సాంకేతిక కారణాలు, ప్రకృతి వైపరిత్యాల కారణంగా సబ్ స్టేషన్ పరిసరాల్లో కరెంట్ ప్రవహించే అవకాశాలుంటాయి. దీంతో అక్కడ ఉండే సిబ్బంది లేదా దగ్గర్లోని ప్రజలు కరెంట్ షాక్ గురికావచ్చు. అయితే సబ్ స్టేషన్లలో ఉండే కంకర రాళ్లు ఈ విద్యుత్ ప్రవాహాన్ని అడ్డుకుంటాయి. ఈ రాళ్లు సహజ విద్యుత్ నిరోదకాలు పనిచేస్తాయి... 'స్టెప్ వోల్టేజ్', 'టచ్ వోల్టేజ్' ప్రమాదాలను నివారిస్తాయి.

45
3. జంతువుల నుండి రక్షణ

జంతువుల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా చూడటమే కాదు అవి కరెంట్ షాక్ కు గురయి ప్రాణాలు కోల్పోకుండా సబ్ స్టేషన్లలోని రాళ్లు కాపాడతాయి. ఈ రాళ్ళ వల్ల సబ్ స్టేషన్లలో గడ్డి మొలిచే అవకాశాలుండవు... దీంతో ఆవులు, గేదెలు వంటి పాడిపశువులే కాదు ప్రమాదకర జంతువులేవీ సబ్ స్టేషన్ లోకి రావు, వచ్చినా ఈ పదునైన రాళ్లపై నడవడం కష్టం. కాబట్టి వీటివల్ల విద్యుత్ ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉండదు.

విషపూరిత పాములు, ఎలుకలు వంటి జంతువులు కూడా ఈ కంకర రాళ్ల మీద పాకలేవు. కాబట్టి సబ్ స్టేషన్ సిబ్బందికి వీటితో ప్రమాదం ఉండదు. తోడేళ్లు, నక్కలు, అడవి పందులు వంటి జంతువుల నుండి కూడా సబ్ స్టేషన్ సిబ్బందిని కాపాడటంతో ఈ రాళ్లు ఉపయోగపడతాయి.

55
4. సబ్ స్టేషన్ పరిశుభ్రత

కంకర రాళ్ళ కారణంగా విద్యుత్ సబ్ స్టేషన్లలో పిచ్చి గడ్డి మొలకెత్తలేదు... కాబట్టి ఆ పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయి. వర్షం పడినప్పుడు నేల బురదగా మారకుండా నీరు త్వరగా ఇంకిపోవడానికి ఈ కంకర సహాయపడుతుంది. దీనివల్ల సిబ్బంది ఎప్పుడైనా సురక్షితంగా నడవడానికి వీలవుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories