139కు కాల్ చేయండి..
బ్యాగ్ దొంగతనానికి గురైందని అనుమానం ఉంటే వెంటనే రైల్వే పోలీస్ లేదా ఆర్పీఎఫ్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలి. రైల్వే అధికారుల ప్రకారం పోయిన వస్తువులపై ‘రైల్ మదద్’లో ఫిర్యాదు చేయవచ్చు. 139కు కాల్ చేయడం ద్వారా కూడా సహాయం పొందొచ్చు. ఫిర్యాదు చేసేటప్పుడు మీ మొబైల్ నంబర్, రైలు నంబర్, పీఎన్ఆర్ నంబర్, కోచ్ నంబర్, సీటు నంబర్, ప్రయాణ వివరాలు, బ్యాగ్ రంగు, పరిమాణం, ప్రత్యేక గుర్తులు, అందులో ఉన్న వస్తువులు వంటి వివరాలను స్పష్టంగా చెప్పాలి. రైల్ మదద్‌లో రైలు ఫిర్యాదు నమోదు చేసే సమయంలో కోచ్, సీటు, ప్రయాణ తేదీ, ఫిర్యాదు వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అవసరమైతే ఫోటోలు లేదా ఇతర ఆధారాలను కూడా అప్‌లోడ్ చేసే అవకాశం ఉంది.