Penguin Huddling: అంటార్కిటికాలో వేలకొద్ది పెంగ్విన్లు ఒకే దగ్గర నిల్చుంటాయి. రౌండ్ గా గుంపుగా, ఒకటినొకటి అనుకుని ఇలా ఎందుకు నిల్చుంటాయి? పెంగ్విన్లు ఇలా చేయడం వెనకున్న ఆసక్తికరమైన విశేషాలు ఇక్కడ తెలుసుకుందాం.
అంటార్కిటికాలో వేల కొద్దీ పెంగ్విన్లు అలా అంటుకుని ఎందుకు నిలబడతాయి?
అంటార్కిటికా అనగానే మనకు గుర్తొచ్చేది మంచు కొండలు, అలాగే లైన్ గా నిలబడే క్యూట్ పెంగ్విన్లు. ఐస్ ల్యాండ్స్ లో వేల కొద్దీ పెంగ్విన్లు ఒకటినొకటి అంటుకుని, అస్సలు గ్యాప్ లేకుండా నిలబడటం మనం టీవీల్లో, సోషల్ మీడియాలో చూసే ఉంటాం. చూడటానికి ఇదో అందమైన దృశ్యంగా అనిపించినా.. దీని వెనుక వేల సంవత్సరాల నాటి ఒక అద్భుతమైన జీవన పోరాట పద్ధతి దాగి ఉంది.
అంటార్కిటికా చలిలో టెంపరేచర్ మైనస్ 40 డిగ్రీల కంటే తక్కువకు కూడా పడిపోతుంది. గంటకు 150 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో మంచు గాలులు వీస్తాయి. ఇలాంటి టైంలో ఎంపరర్ పెంగ్విన్లు ప్రాణాలు కాపాడుకోవడానికి ఒక అద్భుతమైన గ్రూప్ ప్లాన్ వేశాయి. దాన్నే హడ్లింగ్ (గుంపుగా కూడటం) అంటారు. అసలు పెంగ్విన్లు అలా ఎందుకు నిలబడతాయో తెలుసా?
26
ఒంటి వేడిని కాపాడుకోవడానికి
పెంగ్విన్లు అలా ఒకటినొకటి అంటుకుని నిలబడటానికి మెయిన్ రీజన్ బాడీ హీట్ ని కాపాడుకోవడమే. ఒక పెంగ్విన్ పక్కన ఉన్న ఇంకో పెంగ్విన్ కు గాలి తగలకుండా అడ్డుగా నిలబడుతుంది. దీనివల్ల చల్లటి గాలి నేరుగా వాటి బాడీకి తగలదు. ఇలా గట్టిగా ఒకరినొకరు పట్టుకోవడం వల్ల వాటి చుట్టూ ఒక వెచ్చటి వాతావరణం క్రియేట్ అవుతుంది. బయట చలి ఎంత ఎక్కువగా ఉన్నా, ఈ గ్రూప్ మధ్యలో మాత్రం చాలా వెచ్చగా ఉంటుంది.
36
ఘోరమైన మంచు తుపానులను తట్టుకోవడానికి
ఎంపరర్ పెంగ్విన్లు అంటార్కిటికాలో అత్యంత దారుణమైన శీతాకాలంలో గుడ్లు పెడతాయి. చాలా జంతువులు ఈ చలి కాలంలో ఎక్కడికైనా వెళ్లిపోతాయి లేదా దాక్కుంటాయి. కానీ, ఈ పెంగ్విన్లు మాత్రం మంచు గడ్డలపైనే ఉంటూ గుడ్లను సేఫ్ గా కాపాడుకుంటాయి. మంచు తుపానులను తట్టుకుంటూ చాలా తక్కువ ఎనర్జీతో బతకడానికి ఈ గ్రూప్ పద్ధతి వీటికి బాగా హెల్ప్ అవుతుంది. ఒకవేళ ఇవి ఇలా కలిసి ఉండకపోతే, చలి తీవ్రతకు చాలా పెంగ్విన్లు చనిపోయే ఛాన్స్ ఉంటుంది.
గుడ్లు పెట్టిన తర్వాత, తండ్రి ఎంపరర్ పెంగ్విన్లు దాదాపు రెండు నెలల పాటు ఏమీ తినకుండా ఉపవాసం ఉంటాయి. ఆడ పెంగ్విన్లు ఫుడ్ కోసం సముద్రంలోకి వెళ్తాయి. అప్పటివరకు ఈ మగ పెంగ్విన్లు గుడ్లను కాపాడాలి. ఈ టైంలో వాటి ఒంట్లో ఎనర్జీ చాలా ముఖ్యం. అందుకే, ఎక్కువ ఎనర్జీ వేస్ట్ కాకుండా ఉండటానికి ఇవి గుంపుగా నిలబడతాయి. బాడీ టెంపరేచర్ ని మెయింటైన్ చేయడానికి తక్కువ ఎనర్జీ అవసరమయ్యేలా ఈ గ్రూపింగ్ ప్లాన్ హెల్ప్ చేస్తుంది. ఆడ పెంగ్విన్లు తిరిగి వచ్చే వరకు ఇవి ఇలాగే ప్రాణాలు కాపాడుకుంటాయి.
56
లోపల ఉండే వెచ్చదనం అందరికీ సమానంగా
పెంగ్విన్ల మధ్య చాలా మంచి యూనిటీ ఉంటుంది. వీక్ గా ఉన్న వాటిని బయట వదిలేయవు. ఈ గ్రూప్‌లో పెంగ్విన్లు ఎప్పుడూ ఒకే చోట స్థిరంగా ఉండవు. మెల్లమెల్లగా పొజిషన్స్ మారుస్తూ ఉంటాయి. బయటి వైపు ఉండి చలి గాలికి గురయ్యే పెంగ్విన్లు మెల్లగా లోపలి వైపు వెళ్తాయి. లోపల వెచ్చగా ఉన్న పెంగ్విన్లు మెల్లగా బయటి వైపునకు వస్తాయి. ఇలా అందరికీ వెచ్చదనం సమానంగా దక్కేలా ఇవి పొజిషన్స్ మార్చుకుంటూ కోఆపరేట్ చేసుకుంటాయి.
66
గుడ్లు, పిల్లలను కాపాడుకోవడానికి
మగ ఎంపరర్ పెంగ్విన్ తన కాళ్లపై గుడ్డును పెట్టి, దాని పొట్ట కింద ఉండే వెచ్చని చర్మంతో కప్పి ఉంచుతుంది. ఒక్క నిమిషం ఐస్ మీద పడినా ఆ గుడ్డు పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకే, ఈ పెంగ్విన్ల గ్రూప్ మగ పెంగ్విన్లకు గాలి తగలకుండా కాపాడుతుంది. దీనివల్ల గుడ్లు సేఫ్ గా ఉంటాయి. గుడ్డులోంచి పిల్లలు వచ్చిన తర్వాత కూడా ఈ గ్రూప్ ప్రవర్తన వాటిని చలి నుంచి రక్షిస్తుంది.
అయితే, అన్ని పెంగ్విన్లు ఇలా గుంపులుగా ఉండవు. ఎంపరర్, కింగ్ పెంగ్విన్లు మాత్రమే ఇలా చలి తట్టుకోవడానికి గ్రూప్స్ గా ఉంటాయి. కొంచెం వేడి వాతావరణంలో బతికే గాలాపాగోస్, ఆఫ్రికన్, లేదా లిటిల్ బ్లూ పెంగ్విన్లకు ఈ అవసరం ఉండదు. ఎందుకంటే అక్కడ వాతావరణం చాలా మైల్డ్ గా ఉంటుంది.