Pistol killed Gandhi: గాంధీని చంపేందుకు గాడ్సే వాడిన తుపాకీ ఇప్పుడు ఎక్కడ ఉంది?

Published : Jan 30, 2026, 12:23 PM IST

Pistol killed Gandhi: నాథూరామ్ గాడ్సే మహాత్మా గాంధీని తుపాకీతో కాల్చి చంపారని అందరికీ తెలిసిన విషయమే. 1948 జనవరి 30న మహాత్మా గాంధీని హత్య చేశారు. అయితే ఆ తుపాకీ ఇప్పుడు ఎక్కడ ఉందో ఎంతో మందికి తెలియదు. 

PREV
14
గాంధీని చంపిన తుపాకీ

భారత జాతిపిత మహాత్మా గాంధీ స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గాంధీని.. నాథూరామ్ గాడ్సే తుపాకీతో కాల్చి చంపారు. 1948 జనవరి 3న మహాత్మా గాంధీ హత్య జరిగింది. గాంధీని చంపేందుకు నాథూరామ్ గాడ్సే ‘బెరెట్టా ఎమ్ 1934’ పిస్టల్ ను ఉపయోగించారు. ఈ తుపాకీ భారత చరిత్రలోనే అత్యంత విషాదకరమైన ఘటనకు సాక్ష్యంగా నిలిచిపోయింది. స్వాతంత్ర పోరాటంలో అహింసా మార్గాన్ని ప్రపంచానికి చూపిన మహానేత ఒక ఆయుధానికి బలైపోయాడు. అయితే ఇప్పుడు ఆ తుపాకి ఎక్కడ ఉంది?

24
ఇప్పుడు ఎక్కడ ఉంది?

గాంధీని చంపేందుకు ఉపయోగించిన పిస్టల్ ఇటలీలో తయారైన సెమీ ఆటోమేటిక్ తుపాకీ. ఢిల్లీలోని బిర్లా భవన్ లో ప్రార్థన సభకు వెళ్లేందుకు గాంధీజీ వస్తుండగా గాడ్సే ఆయనపై మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ దాడిలో గాంధీజీ అక్కడకక్కడే ప్రాణాలు కోల్పోయారు. హత్య అనంతరం ఈ పిస్టల్ ను అక్కడున్న పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణ, న్యాయ ప్రక్రియలో కూడా ఈ తుపాకీ ఎంతో కీలక పాత్ర పోషించింది. ఆ తరువాత ఆ తుపాకీని ఢిల్లీ పోలీస్ మ్యూజియంలో ఉంచారు. ప్రస్తుతం మ్యూజియంలోనే ఇతర చారితరిక వస్తువులతో పాటు ఈ తుపాకీని కూడా ప్రదర్శిస్తున్నారు. ఈ తుపాకీని చూస్తే గాంధీజీ హత్య జరిగిన క్షణాలు ఒక్కసారి కళ్ళ ముందు కదులుతాయి. ఇది ఒక కేవలం ఒక ఆయుధం మాత్రమే కాదు.. ఒక దేశ చరిత్రను చీకట్లోకి తోసిన ఘటనకు ప్రత్యక్ష సాక్షి కూడా.

34
కచ్చితంగా చూసి తీరాలి

ఢిల్లీ ఎప్పుడైనా వెళ్తే కచ్చితంగా అక్కడ పోలీస్ మ్యూజియంకి వెళ్లి ఈ తుపాకీ ని చూడడం మర్చిపోకండి. ఇది మన దేశ చరిత్రలో ఒక మచ్చను గుర్తు చేస్తుంది. హింస వల్ల కలిగే నష్టాన్ని గుర్తుచేస్తుంది. ఈ తుపాకీని చూసినప్పుడు గాంధీజీ బోధించిన అహింసా, శాంతి, సత్యమార్గాలు గుర్తుకు రావాలి. శాంతి మార్గంలోనే నడవాలని సందేశం అర్థం చేసుకోవాలి.గాంధీని చంపిన గాడ్సే మొదట్లో అతడిని విపరీతమైన అభిమాని. కానీ తరువాత గాంధీ తీసుకున్న నిర్ణయాలను గాడ్సే వ్యతిరేకించడం మొదలుపెట్టాడు. ఇతనిది పుణెలోని బారామతి జిల్లా. భారత్ - పాక్ విభజనని కూడా గాడ్సే వ్యతిరేకించాడు. భారత్...పాకిస్తాన్ కు 55 కోట్ల రూపాయలు చెల్లించాలని గాంధీజీ కొన్ని రోజులు నిరాహార దీక్ష చేశారు. ఇది గాడ్సేకు ఏమాత్రం నచ్చలేదు. అందుకే గాడ్సే గాంధీనికి చంపేందుకు నిర్ణయించుకున్నాడు.

44
ఎందుకు చంపాడు

1948లో జనవరి 30న సాయంత్రం 5.17 నిమిషాలకు గాంధీ హత్య జరిగింది. బిర్లా నివాసంలోని ప్రార్థనా సమావేశ మందిరానికి వెళుతుండగా గాడ్సే గాంధీజీ దగ్గరికి వెళ్లి హథ్య చేశాడు. ఆ తరువాత అక్కడ్నించి పారిపోకుండా నిల్చునే ఉన్నాడు. దీంతో పోలీసులు పట్టుకున్నారు. ఇతను 39 ఏళ్ల వయసులో హర్యానాలోని అంబాలా జైలులో 1949లో నవంబర్ 15న ఉరితీశారు.

Read more Photos on
click me!

Recommended Stories