విద్యా రంగంలోనూ, బిజినెస్ పరంగానూ భారతీయులు అమెరికాలో తమదైన ముద్ర వేస్తున్నారు. STEM అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్, హెల్త్‌కేర్, ఫైనాన్స్ వంటి రంగాల్లో దూసుకుపోతున్నారు.
• ఉద్యోగాలు, రంగాలు: టాప్ అమెరికన్ యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు, నాసా, బయోటెక్ సంస్థల్లో R&D శాస్త్రవేత్తలు, పోస్ట్-డాక్టోరల్ రీసెర్చర్లుగా సేవలందిస్తున్నారు. యూఎస్‌లోని పిహెచ్‌డి స్థాయి పరిశోధకులలో 12% మంది భారతీయులే.
• స్వయం ఉపాధి : ఉద్యోగాలే కాకుండా మోటెల్స్/హోటల్స్, గ్యాస్ స్టేషన్లు, కన్వీనియన్స్ స్టోర్లు, ఇండియన్ రెస్టారెంట్లు, ఐటీ కన్సల్టింగ్ ఏజెన్సీలు నడుపుతూ వేలాది మందికి భారతీయులు ఉపాధి కల్పిస్తున్నారు.
మొత్తంగా చూస్తే.. అమెరికాలో ఉన్న భారతీయ కమ్యూనిటీలో 70% కంటే ఎక్కువ మంది మేనేజ్‌మెంట్, బిజినెస్, సైన్స్ వంటి ప్రొఫెషనల్ రంగాల్లోనే పనిచేస్తున్నారు. ఒకప్పుడు భారతీయులు అంటే కేవలం ఐటీ ఉద్యోగాలు అనే అభిప్రాయం ఉండేది. కానీ నేడు డాక్టర్ల నుంచి బిజినెస్ లీడర్ల వరకు, సైంటిస్టుల నుంచి ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ల వరకు అన్ని రంగాల్లోనూ అమెరికాలో మనోళ్లు జెండా పాతారు.