Rakhi: 90s లో పెద్ద పెద్ద మెరుపుల రాఖీలు గుర్తున్నాయా? తక్కువ కాస్ట్ తో.. చేతినిండా కనిపించే రాఖీల తీపిజ్ఞాపకాలు..

Published : Aug 28, 2026, 07:00 AM IST

Rakhi: ప్రస్తుత కాలంలో రాఖీ పండుగ అంటే.. వెండీ, బంగారంతో చేసిన కాస్ట్లీ రాఖీలు, కాస్ట్లీ గిఫ్ట్ లు.. కామెడీ అయిపోయింది. కానీ ఒకప్పుడు రాఖీ అంటే వర్ణించలేని ఎమోషన్, 90స్ కాలంలో పావల నుంచి రూపాయి వరకు దొరికే మెరుపుల రాఖీలు వెలకట్టలేని తీపి జ్ఞాపకాలు.

PREV
15
అనుబంధానికి, స్నేహానికి ప్రతీక

అన్నా చెల్లెలు, అక్కతమ్ముళ్ల అనుబంధానికి, స్నేహానికి ప్రతీక రాఖీ. ప్రస్తుతం అన్ని పండుగల మాదిరిగానే ఈ పండుగ కూడా ఎంటర్టైన్మెంట్ కు, ఎంజాయ్ చేయడానికి, తమ డాబు, దర్పాలు చూపించడానికి ప్రతీకగా మారింది. వెండీ, బంగారు రాఖీలు, కాస్ట్లీ గిఫ్ట్ లు, రీల్స్, ఇలా రకరకాలుగా మార్చేసిన ఈ పండుగా.. ఒకప్పుడు ఇలా లేదు. 90వ దశకం నాటి రాఖీ పండుగ అనగానే ఒకవైపు అనురాగం, మరోవైపు అమాయకమైన ఆనందం కళ్లముందు మెదులుతాయి. నేటి డిజైనర్, ఎల్ఈడీ, గోల్డ్, సిల్వర్ రాఖీల హంగామా అప్పట్లో ఏమాత్రం లేదు. కానీ, అప్పటి రాఖీల్లో ఉన్న ఆప్యాయత, తీపి జ్ఞాపకాలు వెలకట్టలేనివి.

25
90స్ కాలంలో రాఖీల రూపం, వాటి వెనుక ఉన్న ప్రత్యేకత

25 ఏళ్ల క్రితం రాఖీల రూపం వేరేగా ఉండేది. ఇప్పటికీ 90s కిడ్స్ కి అవి ఓ ఎమోషన్.. ఎప్పుడైనా ఎక్కడైనా అప్పటి రాఖీలు కనిపిస్తే.. పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తుంటాయి. అప్పట్లో రాఖీలు ఎన్ని రకాలుగా దొరికేవంటే..?

దారపు పువ్వుల రాఖీలు

అప్పట్లో అత్యంత ప్రజాదరణ పొందిన రాఖీలలో పువ్వుల రాఖీలు ఎంతో బాగుండేవి. రంగురంగుల పట్టు దారాలు, జరీతో చేసిన గుండ్రటి పువ్వుల రాఖీలు ప్రముఖంగా దొరికేవి. విటి ధర కేవల 1 రూపాయి నుంచి 3 రూపాయల మధ్య లభించేవి. అవి చేతికి ఉంటే కాస్ల్లీ లుక్ వచ్చినట్టు గా ఫీల్ అయ్యేవారం. ఈ రాఖీ మధ్యలో ఒక మెరిసే ప్లాస్టిక్ చమ్కీ లేదా చిన్న అద్దం ఉండేది. దానికి అటు ఇటు పొడవాటి ఎరుపు, పసుపు దారాలు కట్టి ఉండేవి.

35
స్పాంజ్, థర్మకోల్ రాఖీలు

అప్పట్లో రాఖీ పండుగ అనుబందంతో పాటు.. పిల్లలను ఆకట్టుకోవడానికి స్పాంజ్, థర్మకోల్ డిజైన్లతో రాఖీలు వచ్చేవి. వీటి ధర సుమారుగా 2 నుండి 5 రూపాయల వరకూ ఉండేది. గుండ్రటి స్పాంజ్ ముక్కపై డిజైన్ ప్లాస్టిక్ పువ్వులు, వాటికి పైన చిన్న చిన్న ప్లాస్టిక్ మోతీలు (ముత్యాలు) అంటించేవారు. చేతికి కడితే ఎంతో తేలిగ్గా ఉండేవి.

ప్లాస్టిక్ గంటలు, బొమ్మల రాఖీలు

90స్ చివరి నాటికి చిన్నపిల్లల కోసం మొదటిసారిగా బొమ్మల రాఖీలు మార్కెట్‌లోకి రావడం మొదలైంది. వీటి ధర 5 నుండి 10 వరకు ఉండేది. రాఖీకి మధ్యలో చిన్న ప్లాస్టిక్ గంట (Bell) లేదా ఆ కాలంలో పాపులర్ అయిన శక్తిమాన్, ఫాంటమ్, డోనాల్డ్ డక్ బొమ్మల ప్లాస్టిక్ బిళ్లలు ఉండేవి. చెయ్యి ఊపితే గంటల శబ్దం రావడం పిల్లలకు పెద్ద సరదా.

45
రూపాయి నాణెం కవరు రాఖీలు

అప్పట్లో పల్లెటూర్లలో, చిన్న పట్టణాల్లో ఎక్కువగా కనిపించే మరో డిజైన్ ప్లాస్టిక్ కవరు రాఖీ. ఈ రాఖీలు 3 నుండి 5 రూపాయల ధరకే వచ్చేవి. వీటి ప్రత్యేకత ఏంటంటే.. ప్లాస్టిక్ రౌండ్ కవరులో మెరిసే చమకీలతో పాటు 'శ్రీరామ', 'ఓం' లేదా 'సోదర ప్రేమ' అని రాసిన చిన్న కాగితం బిళ్ల ఉండేది.

55
తక్కువ బడ్జెట్, అంతులేని ఆనందం..

90వ దశకంలో రూ. 10 తీసుకెళ్తే ఇంట్లో ఉన్న అన్నదమ్ములందరికీ రాఖీలు కొనేసి, మిగిలిన డబ్బులతో చాక్లెట్లు కూడా కొనేవారు. పండుగకు కొన్ని రోజుల ముందే వీధి చివర ఉండే చిన్న చిన్న షాపుల్లో తాటి ఆకుల బుట్టలు, బల్లలపై రాఖీలను పరచి అమ్మేవారు. అక్కడికి వెళ్లి బడ్జెట్‌లో నచ్చిన రాఖీలను ఎంచుకోవడమే ఒక పెద్ద సంబరం.

రాఖీ రోజున చెల్లెళ్లు తమ అన్నదమ్ములకు రూపాయి లేదా రెండు రూపాయల రాఖీలు కట్టి, బొట్టు పెట్టి స్వీట్ తినిపించేవారు. ఇంట్లో అమ్మ చేసే పాయసం లేదా రవ్వ లడ్డూలే ప్రధాన పిండివంటలు. అన్నయ్యలు తమ స్తోమతను బట్టి చెల్లెళ్లకు 5, 10 లేదా 20 నోటు చేతిలో పెట్టేవారు. ఆ చిన్న నోటుతో పాటు చాక్లెట్లు పొందిన చెల్లెళ్ల ముఖంలో కనిపించే ఆనందం వెలకట్టలేనిది.

ఈ రోజుల్లో వేల రూపాయల రాఖీలు, ఖరీదైన గ్యాడ్జెట్లు గిఫ్ట్‌లుగా ఇస్తున్నప్పటికీ, నాటి 10 బడ్జెట్ రాఖీ పండుగలో ఉన్న ఆప్యాయత, నిజమైన బంధాల తీపి జ్ఞాపకాలు ఎప్పటికీ ప్రత్యేకమైనవే.

Read more Photos on
click me!

Recommended Stories