Water Tank: వాటర్ ట్యాంకును టెర్రస్ పై కాకుండా నేలపై కడితే ఏమవుతుంది?

Published : Aug 27, 2026, 01:36 PM IST

Water Tanker: వాటర్ ట్యాంకును ఏ ఇంట్లోనైనా టెర్రస్ పైనే కనిపిస్తుంది. అదే ట్యాంకర్ నేల మీద ఎందుకు కట్టరు? ఒకవేళ అలా కడితే ఏం జరుగుతుంది? తెలుసుకోవాలంటే చదవండి.

PREV
13
నేల మీద వాటర్ ట్యాంకు ఎందుకు కట్టరు?

సాధారణంగా ఏ ఇంటిని చూసినా నీళ్ల ట్యాంకులు ఇంటి పైకప్పులపై లేదా టెర్రస్ పై నిర్మిస్తారు. ఏ ఇంట్లో కూడా నేల మీద కట్టరు. అయితే కొంతమంది స్థలం కొరత, మరమ్మతుల సులభం చేయడానికి, అవగాహన లోపం వల్ల కొందరు నీటి ట్యాంకులను నేలపై లేదా ఇంటి కింద భాగంలో అమర్చుకోవాలని ఆలోచిస్తున్నారు. చూడటానికి ఇది అనుకూలంగా అనిపించినప్పటికీ, దీనివల్ల రోజువారీ జీవితంలో తీవ్రమైన నీటి సమస్యలు, విద్యుత్ ఇబ్బందులు తలెత్తుతాయి. భూమిపై ట్యాంకును ఉంచినప్పుడు అందులోని నీరు సహజంగా పైకి ప్రవహించలేదు. అందుకే భూమి మీద వాటర్ ట్యాంకు కట్టరు.

23
కరెంట్ పోతే చుక్క నీరు దొరకదు

ట్యాంకు నేలపై ఉన్నప్పుడు ఇంట్లోని వంటిల్లు, బాత్రూమ్‌లు లేదా మొదటి అంతస్తులకు నీరు సరఫరా కావాలంటే ప్రతిసారీ బూస్టర్ పంపు లేదా మోటారును ఆన్ చేయాల్సిందే. దీనివల్ల నిరంతరం విద్యుత్ వినియోగం పెరిగి, నెలవారీ కరెంట్ బిల్లులు తడిసి మోపెడవుతాయి. అంతేకాకుండా, మోటార్లు తరచూ మరమ్మతులకు గురై అదనపు ఆర్థిక భారం పడుతుంది. వీటన్నింటికీ మించి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే ఇంట్లో కుళాయిల నుంచి ఒక్క చుక్క నీరు కూడా రాని పరిస్థితి ఏర్పడుతుంది. అత్యవసర సమయాల్లో కరెంట్ లేకపోతే రోజువారీ పనులన్నీ పూర్తిగా స్తంభించిపోయి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

33
పైకప్పుపై ట్యాంకు ఉంచడమే పరిష్కారం

సైన్స్ నియమాల ప్రకారం నీరు ఎల్లప్పుడూ ఎత్తు నుంచి పల్లం వైపుకు సహజ సిద్ధమైన గురుత్వాకర్షణ శక్తి (Gravity) ద్వారా వేగంగా ప్రవహిస్తుంది. ట్యాంకు ఎంత ఎత్తులో ఉంటే పైపుల్లో నీటి ప్రవాహ ఒత్తిడి (Water Pressure) అంత బలంగా ఉంటుంది. పైకప్పుపై ట్యాంకును ఏర్పాటు చేసుకోవడం వల్ల ఎలాంటి మోటార్ లేదా కరెంట్ అవసరం లేకుండానే నల్లా తిప్పగానే పుష్కలంగా నీరు లభిస్తుంది. ఇది విద్యుత్ ఆదా చేయడమే కాకుండా శాశ్వతమైన సౌకర్యాన్ని అందిస్తుంది. కాబట్టి ఇల్లు నిర్మించుకునేటప్పుడు లేదా నీటి వసతులు ఏర్పాటు చేసుకునేటప్పుడు ట్యాంకులను నేలపై కాకుండా ఎల్లప్పుడూ ఇంటి పైకప్పుపైనే ఉంచడం శ్రేయస్కరమని నిపుణులు సూచిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories