Viral Video: ఏం వీడియో బ్రో.. మ‌న‌సులో నుంచి పోవట్లే. మిడిల్ క్లాస్ జీవితాలు ఇలాగే ఉంటాయి

Published : Oct 13, 2025, 03:18 PM IST

Viral Video: ప్ర‌తీ రోజూ మ‌నం సోష‌ల్ మీడియాలో వంద‌ల‌కొద్ది వీడియోలు చూస్తుంటాం. వీటిలో కొన్ని మాత్ర‌మే మ‌నకు ఎప్ప‌టికీ గుర్తుండిపోతాయి. అలాంటి ఓ వీడియో తాజాగా నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. 

PREV
15
కలలతో నిండిన క్షణం

ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న ఓ చిన్న వీడియో ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. వీడియోలో ఓ యువకుడు సైకిల్‌పై అటుగా వెళ్తుంటాడు. రోడ్డుపక్కన ఒక ఖరీదైన బైక్ కనిపించగానే అతను ఒక్కసారిగా ఆగిపోతాడు. కళ్లలో ఆనందం, ఆశ కలగలిసిన మెరుపు కనిపిస్తుంది.

25
ఫోన్‌లో బైక్ ఫోటో

ఆ కుర్రాడు జేబులోని మొబైల్ తీసి ఆ బైక్‌కి ఫోటో తీస్తాడు. బహుశా అది తన కలల బైక్ అయి ఉండొచ్చు. అతని ముఖంలో కనిపించే సంతోషం ఆ క్షణం ఎంత విలువైనదో చెప్పేస్తుంది.

35
మురిసిన మనసు

ఫోటో తీసి ఆగిపోకుండా, సైకిల్ దిగి బైక్ హ్యాండిల్‌ను తాకుతాడు. ఆ క్షణంలో అతని కళ్లలో “ఏదో రోజు ఈ బైక్ సొంతం చేసుకుంటా” అనే ఆశను తెలియజేస్తుంది. బైక్ చుట్టూ తిరుగుతూ ఆ మనసు మురిసిపోతుంది.

45
చుట్టుపక్కల చూసి

తనను ఎవరైనా చూస్తున్నారా అని అటు ఇటు చూసి, బైక్ సీట్‌ని మెల్లిగా టచ్ చేసి వెనక్కి నడుస్తాడు. వెళ్తూ వెళ్తూ ఆ బైక్ వైపు తిరిగి చూడడం అతని కలలపై ఉన్న ప్రేమను స్పష్టంగా చూపిస్తుంది. దీనంతటినీ పైన బిల్డింగ్ పైన ఉన్న ఓ వ్యక్తి సీక్రెట్ గా వీడియో రికార్డ్ చేశాడు. దీంతో ఈ వీడియో కాస్త వైరల్ అవుతోంది. 

55
నెటిజన్ల స్పందన

ఈ హృదయాన్ని తాకే వీడియోని english_with_rajesh అనే యూజర్ పోస్ట్ చేశారు. ఇప్పటికే దీన్ని 1.7 లక్షల మంది వీక్షించారు. కామెంట్లలో నెటిజన్లు “ఒక రోజు నీ కల నిజమవుతుంది బ్రో” అంటూ ప్రోత్స‌హిస్తున్నారు. మధ్యతరగతి యువకుడి కలల అందాన్ని ప్రతిబింబించిన ఈ వీడియో, సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. మ‌రెందుకు ఆల‌స్యం ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

Read more Photos on
click me!

Recommended Stories