Sucess Story: ల‌డ్డూలు అమ్ముతూ ల‌క్ష‌లు సంపాదిస్తున్నారు.. నిజంగానే వీళ్లు ‘స్వీట్’ క‌పుల్

Published : Oct 13, 2025, 02:41 PM IST

Sucess Story: ఉద్యోగం చేసే చాలా మంది ఏదో ఒక‌రోజు వ్యాపారం మొద‌లు పెట్టాల‌ని భావిస్తుంటారు. అయితే చాలా కొంత‌మందే దీనిని కార్య‌రూరం దాల్చుతారు. అలాంటి వారిలో ఈ జంట కూడా ఒక‌టి. ఇంత‌కీ క‌పుల్ ఏం సాధించారంటే. 

PREV
15
ఐటీ ఉద్యోగాన్ని వ‌దిలి

సందీప్, కవిత అనే జంట అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్లుగా ప‌నిచేశారు. ఐదు సంవత్సరాల పాటు అక్క‌డ ప‌ని చేసిన త‌ర్వాత సొంతంగా వ్యాపారం చేయాల‌ని ఆలోచించారు. అనుకున్న‌దే త‌డ‌వుగా 2018లో హైదరాబాదు తిరిగి వచ్చారు. ఆ త‌ర్వాత ఏం చేయాల‌ని ఆలోచించ‌సాగారు. సందీప్‌కి భోజ‌నం చేసిన త‌ర్వాత స్వీట్ తినే అల‌వాటు ఉండేదు. అయితే కుటుంబ సభ్యులు ఎక్కువ రిఫైన్డ్ షుగర్ వద్దు, బదులుగా బెల్లంతో చేసిన స్వీట్స్‌ను తినొచ్చు క‌దా అని స‌ల‌హాలిస్తుండే వారు. అదే ఆలోచన, వ్యాపార ఆవిష్కరణకు మార్గం చూపింది. “ఆరోగ్యకరమైన, రిఫైన్డ్ షుగర్ లేకుండా భారతీయ తీపి పదార్థాలు తయారు చేయడం ఎలా ఉంటుంది?” అని ఆలోచించిన సందీప్ ఆ దిశ‌గా అడుగులు వేశాడు.

25
లడ్డు బాక్స్ ప్రారంభం

2019లో సాందీప్, కవిత కలిసి లడ్డు బాక్స్ ని ప్రారంభించారు. ఈ స్టార్ట్‌అప్ సంప్రదాయ భారతీయ లడ్డులు తయారీలో ప్రత్యేకత చూపుతుంది. మిలెట్స్, బెల్లం, నెయ్యి (ఘీ) వంటి ఆరోగ్యకరమైన పదార్థాలతో 11 రకాల లడ్డులు రూపొందించారు. కొన్ని కొలెస్ట్రాల్ తగ్గించడానికి, కొన్ని జీర్ణక్రియ మెరుగుపరచడానికి, మరికొన్ని రక్తంలో షుగర్ స్థాయిని కంట్రోల్‌లో ఉంచడానికి సహాయపడతాయి.

35
కోవిడ్ స‌వాళ్లు

2019 చివరికి జంట ఉద్యోగాలను వదిలి పూర్తిగా లడ్డు బాక్స్‌కి కేంద్రీకృతమయ్యారు. ఫెయిర్లు, IT ఆఫీసులు, వివిధ ఈవెంట్లలో అమ్మకాలు భారీగా జ‌రిగాయి. వినియోగదారులు కొత్త ఆరోగ్యకరమైన లడ్డులను ఇష్ట‌ప‌డడం మొద‌లు పెట్టారు. కానీ 2020లో కోవిడ్ కారణంగా ఆఫ్‌లైన్‌ అమ్మకాలు నిలిచిపోయాయి.

45
అంతర్జాతీయ గుర్తింపు

కోవిడ్ ప‌రిస్థితుల‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకున్న ఈ క‌పుల్‌.. ఆన్‌లైన్ అమ్మకాలపై దృష్టి సారించారు. వెబ్‌సైట్ ప్రారంభించి, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేశారు. భారత్‌లోని విభిన్న ప్రాంతాల నుంచి ఆర్డర్లు వ‌చ్చాయి. కేవ‌లం భార‌త్‌కే ప‌రిమితం కాకుండా UK, USA నుంచి కూడా లడ్డుల ఆర్డ‌ర్లు వ‌చ్చాయి. ఆన్‌లైన్ అమ్మకాలు ఆఫ్‌లైన్‌ కంటే ఎక్కువ విజయవంతమయ్యాయి. ఈ ఏడాది ఆగ‌స్టు నాటికి 6,000 కంటే ఎక్కువ ఆర్డర్లు, రూ. 55 లక్షల టర్నోవర్ సాధించారు.

55
ఏయే ల‌డ్డులు ఉన్నాయంటే.?

ప్రోటీన్ లడ్డులు – ఫిట్‌నెస్ అభిమానులకు

ఐరన్ రిచ్ లడ్డులు – మహిళలకు

వెగన్ ఆప్షన్లు – డేట్స్‌తో, నెయ్యి లేకుండా

ప్రతి లడ్డీ ప్రత్యేక అవసరాన్ని తీర్చేలా రూపొందించారు. సాధారణ ఆలోచనను నమ్మకం, సంప్రదాయంతోపాటు ప్యాషన్ కలిపితే, చిన్న ఐడియా నుంచిపెద్ద విజయం సాధించవచ్చని ఈ జంట స‌క్సెస్ చెబుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories