Astronaut: వ్యోమగామి అంతరిక్షంలో చనిపోతే ఏం చేస్తారు? ఎవరైనా అంతరిక్షంలో ఇంతవరకు మరణించారా?

Published : Oct 13, 2025, 10:34 AM IST

అంతరిక్ష పరిశోధనలు, అంతరిక్ష సంబంధిత సంఘటనలు ప్రతి ఏడాది సంభవిస్తూనే ఉంటాయి. అయితే అరుదుగా వినిపించే ప్రశ్న..‘అంతరిక్షంలో వ్యోమగామి (Astronaut) చనిపోతే ఏం జరుగుతుంది’ అనేది. దానికి సమాధానాన్ని ఇక్కడ మేము ఇస్తున్నాము. 

PREV
15
అరవై ఏళ్లలో ఏం జరిగింది?

అంతరిక్ష పరిశోధనలో పెద్ద దేశాలన్నీ పాల్గొంటున్నాయి. ప్రతి ఏటా అంతరిక్షంలోకి కొంతమంది వ్యోమగాములు వెళుతూ ఉంటారు. గత 60 సంవత్సరాలుగా అంతరిక్ష ప్రయాణాలు అధికంగానే జరుగుతున్నాయి. అయితే ఈ 60 ఏళ్లలో ఎవరైనా అంతరిక్షంలో మరణించారా? మరణిస్తే ఏం చేస్తారు? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

25
అంతరిక్షంలో ప్రమాదాలు జరిగాయా?

గత 60 ఏళ్లలో అంతరిక్ష సంబంధిత ప్రమాదాల్లో 20 మంది వ్యోమగాములు మరణించారు. 1986లో ఒక అంతరిక్ష ప్రమాదం జరిగింది. అలాగే 2003లో కొలంబియా అంతరిక్ష ప్రమాదంలో కూడా కొంతమంది మరణించారు. 1971లో సోయుజ్11 లో ముగ్గురు వ్యోమగాములు మరణించారు. ఇక 1967లో లాంచ్ పాడ్ అగ్నిప్రమాదంలో కూడా ముగ్గురు వ్యోమగాములు మరణించినట్టు చెబుతారు. వీళ్ళందరూ కూడా అంతరిక్ష కేంద్రంలో ఉన్నప్పుడు చనిపోలేదు.. ప్రమాదవశాత్తు మరణించారు.

35
వ్యోమగాములకు భయం వేయదా?

దాదాపు 20 మంది వ్యోమగాములు అంతరిక్ష సంబంధిత ప్రమాదాలలో మరణించారంటే మిగతా వ్యోమగాములకు కచ్చితంగా భయం వేస్తుంది. కానీ వారి దృఢ సంకల్పం, అంతరిక్షం పై ఉన్న ఆసక్తి, దేశాభిమానం వంటివి వారికి భయాన్ని దూరం చేస్తాయి. అంతరిక్షంలో ఏర్పడే ప్రతి సంఘటనకు వ్యోమగాములను ముందే సిద్ధం చేస్తారు. అంతరిక్షంలోకి వెళ్ళబోయే వ్యోముగాములు కొన్ని నెలల పాటు శిక్షణ కార్యక్రమంలోనే ఉంటారు. అంతరిక్ష కేంద్రంలో ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే ఎలా ప్రతిస్పందించాలో ఒకరు లేదా ఇద్దరు సిబ్బందికి శిక్షణను అందిస్తారు.

45
అంతరిక్షంలో కేంద్రంలో మరణిస్తే

అంతరిక్ష కేంద్రంలో ఎవరైనా వ్యోమగామి మరణిస్తే ఆ మృతదేహాన్ని చల్లని ప్రదేశంలో ఉంచుతారు. కొన్ని గంటలు లేదా కొన్ని రోజులు మృతదేహం కుళ్ళిపోకుండా చూసుకునే ఏర్పాటు అక్కడ ఉంటుంది. తర్వాత ఒక ప్రత్యేకమైన క్యాప్సూల్ లో భూమికి తిరిగి పంపుతారు. నాసా గతంలో మృతదేహాన్ని అంతరిక్షంలోనే ఏదైనా గ్రహం మీద పాతి పెట్టడం లేదా అంతరిక్షంలో అలా వదిలేయడం వంటివి చేసేది. కానీ ఆ పనులు పర్యావరణ సవాళ్లను కలిగిస్తాయని, అలాగే నైతికతను కూడా ప్రశ్నిస్తాయని భావించి అలా చేయడం మానేశారు. భూమికే తీసుకొచ్చి అంతిమ సంస్కారాలు చేస్తున్నారు.

55
చంద్రునిపై ఎవరైనా మరణిస్తే

చంద్రునిపై అడుగుపెడుతున్న వ్యోమగాముల సంఖ్య పెరుగుతుంది. ఒకవేళ చంద్రుడి యాత్ర చేస్తున్నప్పుడు ఎవరైనా వ్యోమగామి మరణిస్తే మిగిలిన సిబ్బంది కొద్ది రోజులపాటు ఆ మృతదేహాన్ని భద్రపరుస్తారు. ఆ తర్వాత తమతో పాటు భూమికి తిరిగివస్తారు. చంద్రుడి నుంచి భూమికి ప్రయాణం చాలా తక్కువ సమయమే కాబట్టి మృతదేహాన్ని సంరక్షించడం పెద్ద సమస్యగా మారదు.

Read more Photos on
click me!

Recommended Stories