Future Planning Tips : ఈ ఐదు చిట్కాలు పాటించారో.. మీరు కోటీశ్వరులు కావడం ఖాయం..!

Published : May 06, 2026, 06:22 PM IST

ఇప్పుడు చెప్పబోయే ఐదు అంశాల్లో కనీసం ఏ మూడింటిని ఫాలో అయినా ... మీరే రేపటితరం కోటీశ్వరులు. మీ ముందు అంబానీలైనా, ఆదానీలైనా దిగదుడుపే. భవిష్యత్ ఆస్తులేంటో తెలుసా..?  

PREV
15
1. బంగారం కొనండి.

పాంచ్ పటాకా..!

మీ భవిష్యత్తును మార్చగల అయిదు నిర్ణయాలు..!

1. బంగారం కొనండి. 

బంగారం ధర 60 వేలు ఉన్నప్పుడు "బంగారం కొనండి "అని చెప్పాను .

ఈ రోజు అది లక్షా యాభై నాలుగు... మూడేళ్ళలో రెండున్నర రెట్లు అయ్యింది.

ఈ రోజు తేదీ 2026 మే ఆరు.

ఈ రోజు మళ్ళీ చెబుతున్నాను.

బంగారం కొనండి.

మరో ఐదేళ్లల్లో బంగారం.. నేటి ధరతో పోలిస్తే రెట్టింపు.. అంతకన్నా ఎక్కువ అవుతుంది .

వెండితో అంతగా భరోసా ఉండదు.

పేపర్ బంగారాలు... అంటే బాండ్స్ .. ఇలాంటివి కాదు. ఫిజికల్ గా బంగారం కొనండి.

దీనికి సంభందించి ఉన్న... ఒకే ఒక సమస్య బంగారాన్ని భద్రంగా దాచుకోవడం.

బంగారం దొంగతనాలు ఎక్కువ అవుతాయి.

బాగా సెక్యూరిటీ ఉంటే తప్పించి బయటకు బంగారు నగలు వేసుకొని వెళ్లొద్దు.

బంగారం ఇప్పుడు ఆస్తి... ఆభరణం కాదు.

25
2 . పిల్లల్ని కనండి.

రాబోయే రోజుల్లో ఇది అన్నిటికంటే పెద్ద ఆస్తి అవుతుంది. ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ప్రకటిస్తాయి.

పిలల్ల చదువులకు అయ్యే ఖర్చు భరిస్తాయి.

అమెరికా పని అయిపోయింది.

అక్కడ వీసాపై ఉన్నవారు పెద్ద ఎత్తున ఇండియా కు తిరిగి వచ్చేస్తారు.

లేదా కెనడా జర్మనీ లాంటి దేశాలకు వెళ్ళిపోతారు.

ఎవరో కొంతమందికి తప్పించి అమెరికాకు ఉన్నత విద్యకోసం ఆపై ఉపాధి కోసం వెళ్లే అవకాశం లేదు.

అమెరికా గతం .

ఇండియా భవిష్యత్తు...

పోనీ మీకు ఇండియాలో ఉండడం ఇష్టం లేకుంటే... అనేక దేశాలకు వెళ్లి స్థిరపడే అవకాశం.

ఇటలీ, స్పెయిన్, ఫిన్లాండ్, పోలాండ్, ఆస్ట్రియా, గ్రీస్, బెల్జియం, నార్వే, స్వీడన్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, జర్మనీ, హంగేరి, పోర్చుగల్, డెన్మార్క్ లాంటి యురోపియన్ దేశాలు... దక్షిణ కొరియా, తైవాన్, చిలి, చైనా, జపాన్, సింగపూర్, హాంగ్ కాంగ్, థాయిలాండ్ లాంటి ఆసియా దేశాల్లో... జనాభా క్షీణత భారీగా ఉంది.

2.1 ఉండాలి... పైన చెప్పిన దేశాల్లో ఇది 1.5.

అంటే రానున్న రోజుల్లో వృద్ధుల సంఖ్య భారీగా పెరుగుతుంది.

ఇది... ఆర్థిక సామజిక సంక్షోభాలకు దారి తీస్తుంది.

ఈ విషయం చాల మందికి సరిగా అర్థం కాదు.. జనాభా తగ్గితే మంచిదే కదా అనుకొంటారు.

ఒక బిల్డింగ్ ఎత్తు పరిమితికి మించి 19 మీటర్లు ఉంది. నిబంధనల ప్రకారం ఇది 15 మీటర్లే ఉండాలి.

ఒకడు గ్రౌండ్ ఫ్లోర్ ను కూల్చేశాడట. మొత్తం బిల్డింగ్ కూలి పోయింది.

అంటు రోగమ.. యుద్ధమో వచ్చి జనాలు పోవడం వేరు.

జననాల రేట్ తగ్గి... పిలల్లు తగ్గిపోతే అది గ్రౌండ్ ఫ్లోర్ కూల్చినట్టే. పైన చెప్పిన దేశాల్లో కొన్ని అయినా "మా దేశానికి రండి" అంటూ యువతరాన్ని పిలిచే రోజులు త్వరలో వస్తాయి.

"రోబో లు వస్తాయి కదా .. ఇక ఉద్యోగాలు ఎలా వస్తాయి"... రోబో లు ఉండగా మనుషులు.. పనులకోసం ఎందుకు?" అని అనుకోకండి. ఆర్థిక సామజిక సైనిక వ్యవస్థలు సాగాలంటే మనుషులు ఉండాలి .

35
3. పిల్లల పెంపకాన్ని మొబైల్ కు అవుట్ సోర్స్ చేయకండి.

కొంపలో స్మార్ట్ టీవీ ఉంటే అది సంసారానికి ఎసరు పెట్టే ప్రమాదం. పిల్లలకు మీరు ఇచ్చే నిజమయిన ఆస్తి మీ సమయం.

మీ తల్లి తండ్రి మిమ్మల్ని ఎలా పెంచారో అలాగే మీ పిల్లల్ని పెంచండి. సామాజిక తెలివి తేటలు... భావోద్వేగ తెలివి తేటలు నేర్పండి. బ్రాండెడ్ బడా బడులు వద్దు.

అక్కడ చేరిస్తే మీ పిలల్లు పరాన్నభుక్కులు... విలాసాలకు బానిసలు అయిపోతారు. అలాగే పరీక్షా కర్మాగారాల్లో చేర్చకండి. ఐఐటీలు గొప్ప సంస్థలు.

ఐఐటీ జేఈఈ పేరుతొ ఆరో తరగతి నుంచే పిల్లల్ని బ్రాయిలర్ కోళ్లుగా మార్చకండి. పిలల్లు చదవాలి. చదువంటే నేర్చుకోవడం. కేవలం ఒక ఎంట్రన్స్ పరీక్షకు తయారు కావడం కాదు.

కుతూహలం, నిరంతర అధ్యయనం, సంపూర్ణ అవగాహన-విశ్లేషణ- అనువర్తన, కుశాగ్ర బుద్ధి, అన్నిటికి మించి సృజన.. ఇవి AI యుగం లో ఉద్యోగాలను తెచ్చిపెట్టే నైపుణ్యాలు.

ఐఐటి ఫౌండేషన్ పేరుతొ ఆరోతరగతి నుంచే రుబ్బుడు ప్రారంభం అయితే ... కేవలం గణితం భౌతిక శాస్త్రంపై దృష్టి పెడితే ఈ నైపుణ్యాలు చచ్చిపోతాయి.

రుబ్బుడు తట్టుకొని ఐఐటీ లో సీట్ కొట్టినా.. అటుపై ఉద్యోగాలు రావు. ఐఐటీ సీట్ వస్తే బిడ్డ ఫోటో పత్రికలో వచ్చింది అనే తుత్తి సరే. కానీ అటుపై ఉద్యోగం..?

ఐఐటీ లో క్యాంపస్ ప్లేసెమెంట్ 50 % పడిపోయింది.

ఐఐటీలు అటుపై అమెరికాలో ఉన్నత విద్య చదివి పదేళ్లు ఉద్యోగం చేసి ఇప్పుడు నిరుద్యోగులుగా ఎంతో మంది.

కృతిమ మేథ కారణంగా ఉద్యోగాలు కోల్పోతున్న వారిలో ఐఐటీ పూర్వ విద్యార్థులే ముందు వరసలో.

పిల్లల్ని "కోడింగ్ కోళ్లు" చెయ్యొద్దు.

చదువు చెప్పండి.

ప్రైవేట్ మెడికల్ కాలేజీ లో చేర్పిస్తే అటుపై వారిలో చాలామంది ఫుడ్ డెలివరీ లాంటి గిగ్ జాబ్స్ చేసుకోవలసిందే.

AI మెషిన్ లెర్నింగ్ డేటా సైన్స్ నేర్వాలి.

రాబొయ్యే రోజుల్లో పాలిటెక్నిక్ లు, పారామెడికల్ కోర్సు లు జాబ్ గ్యారెంటీ ఇస్తాయి.

45
4. రాబొయే రోజులల్లో నిజమయిన ఆస్తి ఆరోగ్యం .

డబ్బాల్లో, ప్యాకెట్లలో, సీసాల్లో వచ్చే రసాయన రుచులు ప్రాణాలు నెమ్మదిగా హరిస్తాయి.

మీ ఆస్థిని ఫార్మసురలకు అప్పగిస్తాయి.

ఇంట్లో వండితే వంట.

బయటనుంచి ఆర్డర్ ఇస్తే అది కడుపు మంట. గట్ హెల్త్ దెబ్బ తింటుంది. అటు పై కాన్సర్.

సహజ ఆహారం తీసుకోండి. వ్యాయామం చేయండి. బాగా నిద్ర పోండి. కుటుంబ సభ్యులతో స్నేహితులతో హాయిగా కాలం గడపండి.

55
5. అద్దెలకు ఇవ్వడానికి రియల్ ఎస్టేట్ పెట్టుబడులు వద్దు.

దేశమంతా రోడ్లు, రవాణా వ్యవస్థ ఊహలకు అందని రీతిలో డెవలప్ అవుతోంది.

దూరం ఇప్పుడు సమస్య కాదు .

దూరంగా నైనా కాలుష్యం లేని చోట నివసించండి.

సొంత ఇల్లు అయితే సుఖం .

డబ్బుంటే ఊరికి దూరంగా ఎకరా భూమి.

అందులో పెద్ద కిటికీ లు ఉన్న ఇల్లు. ఇంటి బయట అట స్థలం. పళ్ళ తోట.

మీకు డబ్బుంటే... ఓపిక ఉంటే... వ్యవసాయ భూమి. పంటలు పండించాలి. ఆవులు, కోళ్లు పెంచాలి. సొంత పొలంలో పండిన రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు వాడని ఆహారం.. రసాయనాలు కలపని పాలు, పెరుగు, వెన్న, జున్ను...మాంసాహారులకు నాటు కోడి గుడ్లు, నాటు కోడి మాసం.

Read more Photos on
click me!

Recommended Stories