మీకు దెయ్యాలు, ఆత్మలతో కూడిన హారర్ కథలంటే ఇష్టమా..? అడ్వెంచర్ ట్రిప్స్ అంటే సరదానా..? అయితే ఇండియాలో కొన్ని భయానక ప్రదేశాలున్నాయి. వాటి గురించి తెలిస్తే ఒంటరిగా వెళ్లడానికి పగలు కూడా భయపడతారు.
రాజస్థాన్‌లోని భంగర్ కోటను ఇండియాలో అత్యంత భయానక ప్రదేశంగా చెబుతారు. అందుకే సూర్యాస్తమయం తర్వాత ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) ఇక్కడికి ఎవరినీ అనుమతించదు. ఓ మాంత్రికుడి శాపం వల్లే ఈ కోట ఇలా మారిపోయిందని కథలున్నాయి. ఇక్కడికి వచ్చినవాళ్లకు గాలిలో మాటలు, అడుగుల శబ్దాలు వినిపిస్తాయట.
26
కులధార గ్రామం
రాజస్థాన్‌లోని ఈ కులధార గ్రామాన్ని పాలివాల్ బ్రాహ్మణులు ఒక్క రాత్రిలోనే ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఓ మంత్రి వేధింపుల నుంచి తప్పించుకోవడానికి వాళ్లంతా అలా చేశారట. వెళ్తూ వెళ్తూ.. ఈ గ్రామంలో మళ్లీ ఎవరూ స్థిరపడకూడదని శపించారని చెబుతారు. అప్పటి నుంచి ఇది ఓ పాడుబడిన దెయ్యాల ఊరిగా మిగిలిపోయింది.
36
గుజరాత్ డుమాస్ బీచ్
గుజరాత్‌లోని ఈ డుమాస్ బీచ్‌లో ఇసుక నల్లగా ఉంటుంది. ఒకప్పుడు ఇది హిందువుల శ్మశానవాటిక. ఇక్కడ గాలిలో గుసగుసలు వినిపిస్తాయని, ఒంటరిగా వెళ్లినవాళ్లు మాయమైపోతారని అంటారు. చనిపోయిన వారి ఆత్మలు ఇక్కడే తిరుగుతాయని, అందుకే కుక్కలు కూడా ఖాళీ ప్రదేశం వైపు చూస్తూ అరుస్తాయని స్థానికులు నమ్ముతారు.
పుణెలోని ఈ శనివార్ వాడా కోటలో ఓ యువ పేశ్వా రాకుమారుడి ఆత్మ తిరుగుతుందట. అతడి బంధువులే అతన్ని దారుణంగా చంపేశారని చెబుతారు. పౌర్ణమి రాత్రుళ్లలో 'కాకా మాలా వాచా' (బాబాయ్, నన్ను రక్షించు) అంటూ ఆ యువరాజు పెట్టే కేకలు ఈ రాతి గోడల్లో ప్రతిధ్వనిస్తాయని స్థానికులు అంటారు.
56
మీరట్‌లోని జీపీ బ్లాక్
మీరట్‌లోని ఈ పాడుబడిన రెండంతస్తుల భవనంలో వింత ఘటనలు జరుగుతాయట. ఓ కొవ్వొత్తి వెలుగులో నలుగురు వ్యక్తులు కూర్చొని మందు తాగుతూ కనిపిస్తారని చాలామంది చెప్పారు. మరికొందరేమో ఎర్ర చీర కట్టుకున్న ఓ మహిళ ఈ ఇంటి నుంచి బయటకు వస్తుందని, దగ్గరికి వెళ్లేసరికి గాలిలో కలిసిపోతుందని చెబుతుంటారు.
66
డౌ హిల్, కుర్సియాంగ్
కుర్సియాంగ్‌లోని డౌ హిల్‌లో 'డెత్ రోడ్' అనే ఓ దారి ఉంది. ఇక్కడ తలలేని ఓ అబ్బాయి చెట్లలోకి నడుచుకుంటూ వెళ్లి మాయమైపోతాడని చెబుతారు. అంతేకాదు సమీపంలోని బోర్డింగ్ స్కూళ్లలో రాత్రిపూట కారిడార్లలో అడుగుల శబ్దాలు, నవ్వులు వినిపిస్తాయని కూడా చాలామంది రిపోర్ట్ చేశారు.