వేసవి వచ్చిందంటే మండే ఎండలతో పాటు వడగళ్ల వానలు కూడా జనాలకు భయపెడుతుంటాయి. వాటి వల్ల పంటలకు కూడా చాలా నష్టం జరుగుతుంది. అసలు ఈ వడగళ్ల వానలు ఎలా పడతాయి. వడగళ్లు ఎలా ఏర్పడతాయి.
ఎండాకాలం వచ్చిందంటే జానాలు ఎండవేడితో పాటు వడగళ్ల వానలకు కూడా భయపడుతుంటారు. పైనుంచి పడే మంచు రాళ్లవర్షం చూడటానికి ఎంతో అందంగా అనిపించినా.. వాటి వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. ముఖ్యంగా రైతులకు అవి పంటనష్టాన్ని తీసుకువస్తాయి. మనుషులను గాయపరుస్తాయి కూడా. అసలు ఈ వడగళ్లు ఎలా పుడతాయి. ఎక్కడి నుంచి వస్తాయి. వానరాళ్లు ఏర్పడటానికి కావల్సిన పరిస్థితులు ఏంటి? పై నుంచి మంచు రాళ్లు పడటం ఎలా సాధ్యం అవుతుంది.
26
క్యుములోనింబస్ మేఘాల కారణంగా..
ఈ వడగళ్ల వానలు సాధారణంగా ఉరుములు, మెరుపులతో కూడిన వానలు వచ్చినప్పుడు ఏర్పడుతుంటాయి. ముఖ్యంగా వేసవి కాలంలో భూమి వేడెక్కి గాలి వేగంగా పైకి లేచి.. తేమతో సహా బాగా ఎత్తుకు వెళ్లినప్పుడు ఇవి ఏర్పడతాయి. పైకి లేచే వేడి గాలి , క్రిందికి వచ్చే చల్లని గాలి మధ్య జరిగే సంఘర్షణ వల్ల ఏర్పడిన మేఘాలను క్యుములోనింబస్ మేఘాలు అంటారు. ఇవి ఒకదానికి మరొకటి ఢీ కొట్టడం వల్ల వడగళ్లు రాలి పడతాయి. వర్షంతో పాటుగా పడతాయి కాబట్టి.. వీటిని వాడుక భాషలో వానరాళ్లు అంటారు.
36
వడగళ్లు ఏ సైజ్ లో ఏర్పడతాయి?
వడగళ్ల పరిమాణం చిన్నదిగా ఉండవచ్చు, పెద్దదిగా కూడా ఉండవచ్చు. కొన్నిసార్లు పప్పు గింజలంత ఉంటే, మరికొన్ని సందర్భాల్లో నిమ్మకాయ సైజులో పెద్దగా ఉండే అవకాశం ఉంది. ఇక కొన్ని పరిస్థితుల్లో భారీ స్థాయిలో కూడా వడగళ్లు ఏర్పడుతుంటాయి. వాటి పరిమాణం మేఘాలలో గాలుల వేగం, తేమ, ఉష్ణోగ్రతలపై ఆధారపడి ఉంటుంది. చూడటానికి ఐస్ క్యూబ్స్ మాదిరిగా ఉండే ఈ వానరాళ్లను కొంత మంది తింటుంటారు కూడా.
46
వానరాళ్లు తినడం మంచిదేనా?
వెనకటి రోజుల్లో కొంత మంది పెద్దవారు వానరాళ్లు తింటే మంచిది అని చెపుతుండేవారు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు, వాతావరణ మార్పుల వలన వానరాళ్లు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు అని నిపుణులు చెపుతున్నారు. వాతావరణ కాలుష్యం వలన.. అవి కూడా కలుషితం అవుతున్నాయని వారు అంటున్నారు. కాబట్టి వానరాలు తినే అలవాటు ఉన్నవారు జాగ్రత్తగా ఉండటం మంచిది.
56
వేసవిలోనే ఎందుకు ఎక్కువ?
వడగళ్ల వానలు ఎక్కువగా వేసవిలోనే పడతాయి. దానికి కారణం కూడా ఉంది. వడగళ్లు ఏర్పడాలంటే నేలపై ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండాలి. సమ్మర్ లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి.. ఆ సమయంలో వడగాళ్ల వానలు కురిసేందుకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అయితే కేవలం వేసవిలో మాత్రమే కాదు, ఏడాది పొడవునా.. ఎప్పుడైనా వాడగళ్లు పడే అవకాశం ఉంది.
66
రాళ్లవాన వల్ల నష్టాలు..
వడగళ్ల వాన వల్ల పంటలకు, వాహనాలకు, ఇళ్లకు నష్టం కలగవచ్చు. రైతులకు ఇది పెద్ద సమస్యగా మారుతుంది. కొన్నిసార్లు పండిన పంటలను వడగళ్ల వాన పూర్తిగా నాశనం చేస్తుంది. అలాగే మనుషులకువీటి వల్ల గాయాలు కూడా అవుతుంటాయి. అందుకే వడగళ్ల వాన సమయంలో బయట ఉండటం ప్రమాదకరం.