Top 5 Scenic Places in South India:సౌత్ ఇండియా చాలా వైవిధ్యంగా ఉంటుంది. కేరళ బ్యాక్‌వాటర్స్, కర్ణాటక-తమిళనాడు పచ్చని హిల్ స్టేషన్లు, ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన తీరప్రాంతాలు, తెలంగాణ నాటి చారిత్రక కట్టడాలు.. ఇలా ఐదు రాష్ట్రాల్లోనూ ఎన్నో అద్భుతాలు ఉన్నాయి.
వీకెండ్‌లో మైండ్ బ్లాక్ చేసే సౌత్ ఇండియాలోని 5 క్రేజీ లొకేషన్స్
సౌత్ ఇండియా.. ప్రకృతి తన అందాలన్నింటినీ ఇక్కడ అద్భుతంగా పరిచేసింది. కేరళ బ్యాక్‌వాటర్స్ నుంచి కర్ణాటక కాఫీ తోటల వరకు, ఆంధ్రా-తెలంగాణ సంస్కృతి నుంచి తమిళనాడు ప్రాచీన కట్టడాల వరకు.. సౌత్‌లో ఎక్స్‌ప్లోర్ చేయడానికి బోలెడన్ని అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి.
వీకెండ్ వస్తే చాలు ల్యాప్‌టాప్‌లు క్లోజ్ చేసి, బ్యాగ్‌లు సర్దేసుకునే నేటి జెన్ జీ ట్రావెలర్ల కోసం, ఫ్యామిలీతో కలిసి చిల్ అవ్వాలనుకునే వారి కోసం మైండ్ బ్లోయింగ్ అనిపించే టాప్ 5 సీనిక్ ప్లేసెస్ డీటెయిల్స్ ఇక్కడ తెలుసుకుందాం.
26
1. గోకర్ణ: పీస్ ఫుల్ వైబ్స్ కావాలనే వారికి బెస్ట్ స్పాట్
మీకు గోవా క్రేజ్ బోర్ కొట్టేసిందా? కాస్త ప్రశాంతంగా, ప్రకృతికి దగ్గరగా బీచ్ వైబ్స్ ఎంజాయ్ చేయాలనుకుంటే కర్ణాటకలోని గోకర్ణ పర్ఫెక్ట్ ఛాయిస్. బెంగళూరు నుంచి దాదాపు 483 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ చిన్న టౌన్, బీచ్ లవర్స్‌కు ఒక హెవెన్ లాంటిది.
ఓం బీచ్, హాఫ్ మూన్ బీచ్‌లు వాటి షేప్స్‌తోనే మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తాయి. ఇక ప్యారడైజ్ బీచ్ అయితే పేరుకు తగ్గట్టే స్వర్గంలా ఉంటుంది. పొడవైన తాటి చెట్లు, రాళ్లను తాకుతూ వచ్చే సముద్రపు అలలు, సాయంత్రం వేళ సూర్యాస్తమయం.. ఇవన్నీ మీ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌కు సూపర్ కంటెంట్ ఇస్తాయి. ఇక్కడ ఫేమస్ మహాబలేశ్వర ఆలయం కూడా ఉంది, కాబట్టి భక్తి, ప్రకృతి రెండూ ఇక్కడ దొరుకుతాయి.
36
2. మున్నార్: పచ్చటి తివాచీ పరిచినట్లుండే కేరళ అందం
కేరళలో మున్నార్ ఒక అద్భుతం. ఎటు చూసినా పచ్చటి కొండలు, ఆ కొండలపై పరుచుకున్న అంతులేని టీ తోటలు మిమ్మల్ని మరో లోకంలోకి తీసుకెళ్తాయి. ఇక్కడి చల్లటి వాతావరణం, జలపాతాల సడి మైండ్ రిలాక్స్ అయ్యేలా చేస్తాయి. ఇక్కడ లగ్జరీ ట్రీ హౌస్‌లో స్టే చేయడం లేదా టీ ఎస్టేట్ టూర్‌కి వెళ్లడం మీ లైఫ్‌లోనే ఒక మెమరబుల్ ఎక్స్‌పీరియన్స్ అవుతుంది.
తమిళనాడులోని నీలగిరి కొండల్లో ఉన్న ఊటీని క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్స్ అని ఊరికే అనలేదు. నగరాల రొటీన్ లైఫ్, ట్రాఫిక్ పొల్యూషన్ నుంచి దూరంగా వుండటానికి ఇది బెస్ట్ ప్లేస్. వేసవిలో కూడా ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. నీలి రంగు కొండలు, పచ్చటి ప్రకృతి దృశ్యాలు మీ కళ్లకు ఎంతో హాయిని ఇస్తాయి. ఇక్కడి బొటానికల్ గార్డెన్స్, ఊటీ లేక్ సూపర్బ్ గా ఉంటాయి.
56
4. కొడైకెనాల్: ప్రకృతి ప్రేమికుల కోసమే ఇది
తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో ఉన్న కొడైకెనాల్‌ను ప్రిన్సెస్ ఆఫ్ హిల్ స్టేషన్స్ అని పిలుస్తారు. దట్టమైన అడవులు, అందమైన సరస్సులు, లోయలతో ఈ ప్రాంతం పర్యాటకులను కట్టిపడేస్తుంది. సిల్వర్ కాస్కేడ్ ఫాల్స్, బేరిజం లేక్, పాంబార్ ఫాల్స్ వంటి లొకేషన్స్ మిమ్మల్ని థ్రిల్ చేస్తాయి. కాస్త పీస్, ప్రైవసీ కోరుకునే కపుల్స్‌కి, ఫ్రెండ్స్ గ్యాంగ్‌కి ఇది క్రేజీ స్పాట్.
66
5. కూర్గ్: ఇండియాలోనే స్కాట్లాండ్ ఇది
కర్ణాటకలోని కూర్గ్‌ను ఇండియాస్ స్కాట్లాండ్ అని పిలుస్తారు. ఎటు చూసినా కాఫీ, తేయాకు తోటల సువాసనలు మిమ్మల్ని పలకరిస్తాయి. అబ్బే ఫాల్స్, ఇరుప్పు ఫాల్స్, చారిత్రక మడికేరి ఫోర్ట్ ఇక్కడి టాప్ విజిటింగ్ ప్లేసెస్. ట్రెక్కర్లకు, అడ్వెంచర్ ఇష్టపడే జెన్ జీ కి కూర్గ్ ఒక పర్ఫెక్ట్ హ్యాంగౌట్ స్పాట్. ఇవే కాకుండా బీచ్‌లు, కొండలు, సరస్సులు, జలపాతాలు.. ఇలా మీ బకెట్ లిస్ట్‌లో ఉండే ప్రతీదీ సౌత్ ఇండియాలో ఉంది.