Haunted Village: ప్రపంచంలోనే అత్యంత భయానకమైన గ్రామం.. ఊళ్లో అరుపులే వినిపిస్తాయి మనుషులు కనిపించరు

Published : May 15, 2026, 04:29 PM IST

Haunted Village: దెయ్యాల ఊరుగా పేరు తెచ్చుకున్న ఒక గ్రామం ఇది. ఈ గ్రామంలో మనుషులు కనిపించరు కానీ రాత్రయితే అరుపులు మాత్రం వినిపిస్తాయి. ఈ గ్రామంలో మనుషుల ఆత్మలతో పాటూ  జంతువుల ఆత్మలు కూడా రాత్రిపూట తిరుగుతాయని చుట్టుపక్కల వారు నమ్ముతారు.

PREV
14
అరుపులు వినిపించే గ్రామం ఇది

కొన్ని గ్రామాలు మనుషులు లేకుండా ఖాళీగా ఉంటాయి. అలా ఖాళీ అయిన గ్రామాల వెనుక ఏదో ఒక కారణం ఉంటుంది. అలాంటి ఒక గ్రామం గురించే ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఇది ప్రపంచంలోనే అత్యంత భయానకమైన గ్రామంగా చెప్పుకుంటారు. పగలు సాధారణంగా కనిపించే ఈ ఊరు, రాత్రి అయితే భయంకరంగా మారుతుందట. ఇక్కడ మనుషులే కాదు, జంతువుల ఆత్మలు కూడా తిరుగుతాయని స్థానికులు చెబుతారు. 1989లో ఈ గ్రామం 'మోస్ట్ హాంటెడ్ విలేజ్'గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా నమోదైంది. ఈ గ్రామం పేరు ఫ్లక్లీ. ఇది లండన్‌కు కేవలం గంట దూరంలో ఉంది. దీన్ని ప్రపంచంలోనే అత్యంత భయానకమైన దెయ్యాల గ్రామంగా పిలుస్తారు. 

24
భయానక స్థలం

ఈ గ్రామంలో పన్నెండు భయానక ప్రదేశాలను చాలా భయానకమైనవిగా చెప్పుకుంటారు. ఊరి రోడ్లపై నడుస్తుంటే వెనక నుంచి ఎవరో పిలిచినట్లు అనిపిస్తుందని పర్యాటకులు చెబుతుంటారు. అది మనుషుల పిలుపు కాకపోవచ్చు, ఆత్మల పిలుపు కూడా కావొచ్చని స్థానికులు అంటారు.

34
గ్రామం వెనుక కథ

ఈ గ్రామంలో 'స్క్రీమింగ్ మ్యాన్' అనే ఆత్మ చాలా ఫేమస్. ఇతను ఇటుకల ఫ్యాక్టరీలో పనిచేస్తూ కిందపడి చనిపోయాడని నమ్ముతారు. 'హైవేమ్యాన్' అనే దెయ్యాన్ని కత్తితో పొడిచి, చెట్టుకు ఉరితీశారని చెబుతారు. ఇంకో వృద్ధురాలి ఆత్మ, తన ఇంట్లో మంటల్లో చిక్కుకుని చనిపోయిన తర్వాత ఇక్కడే తిరుగుతోందని మరో కథ ప్రచారంలో ఉంది. ఇలా ప్రతి ఆత్మకు ఒక్కో కథ ఉంది.

44
ఇప్పుడు పెద్ద పర్యాటక గ్రామం

ఎన్ని భయానక కథలు ఉన్నప్పటికీ, ప్లక్లీ గ్రామం ఇప్పుడు ఒక ప్రముఖ పర్యాటక ప్రదేశంగా మారిపోయింది. చర్చి, పాఠశాల, దుకాణాలు, రెస్టారెంట్లు ఉన్న ఈ గ్రామానికి సాహస ప్రియులు, పారానార్మల్ అనుభవాలు కోరుకునేవారు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. దెయ్యాల అంశాలు ఇష్టపడేవారు ఇక్కడికి ఎక్కువగా ప్రయాణం చేస్తూ ఉంటారు.

Read more Photos on
click me!

Recommended Stories