Indian Population in USA: అమెరికాలో ఇండియన్స్ అడ్డా.. ఈ 5 నగరాల్లోనే ఎక్కువ మంది.. ఎందుకో తెలుసా?

Published : Jul 15, 2026, 12:06 PM IST

Indian Population in USA: అమెరికాలో ఇండియన్స్ అడ్డాలు చాలానే ఉన్నాయి. అయితే, అమెరికాలో భారతీయులు ఎక్కువగా నివసించే టాప్ 5 మెట్రోపాలిటన్ నగరాలు ఏవో మీకు తెలుసా? అక్కడ వారికి లభించే ఉద్యోగాలు, సాంస్కృతిక వసతులు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
17
అమెరికాలో భారతీయులు ఎక్కువగా ఉండే నగరాలు ఇవే

అమెరికా కల సాకారం చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ముఖ్యంగా భారతీయులు ఉన్నత చదువులు, ఐటీ ఉద్యోగాల కోసం యూఎస్ఏ కు క్యూ కడుతుంటారు. అయితే అమెరికా వెళ్లే మన వాళ్లంతా కొన్ని నగరాల్లోనే నివసించడానికి ఇష్టపడతారు. అక్కడ మంచి ఉద్యోగ అవకాశాలతో పాటు, మన దేశ సంస్కృతి, ఫుడ్, మన పండగల వాతావరణం దొరకడమే అందుకు ప్రధాన కారణం. అమెరికాలో భారతీయ జనాభా అత్యధికంగా ఉన్న టాప్ 5 మెట్రోపాలిటన్ ప్రాంతాలు ఏవి? వారు అక్కడే ఎందుకు ఉంటున్నారు? ఆ నగరాల ప్రత్యేకతలేంటో ఇప్పుడు చూద్దాం.

27
1. న్యూయార్క్ మెట్రోపాలిటన్ ఏరియా (న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్)

అమెరికాలో భారతీయులు అత్యధికంగా ఉండే ప్రాంతాల్లో న్యూయార్క్ మెట్రోపాలిటన్ ఏరియా మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ ఏకంగా 7 లక్షలకు పైగా భారతీయ జనాభా నివసిస్తోంది. న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్ రాష్ట్రాల్లో ఈ జనాభా విస్తరించి ఉంది. ఫైనాన్స్, హెల్త్‌కేర్, ఫార్మాస్యూటికల్స్, ఐటీ రంగాల్లో ఇక్కడ అద్భుతమైన కెరీర్ అవకాశాలు ఉన్నాయి.

అమెరికాలోనే అత్యంత పాతదైన ఇండియన్ కమ్యూనిటీ ఇక్కడే ఉంది. ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ చాలా బాగుంటుంది. బిజినెస్ చేసుకునే వారికి కూడా ఈ ఏరియా బెస్ట్ ఆప్షన్. న్యూజెర్సీలోని ఓక్ ట్రీ రోడ్ ను అందరూ "లిటిల్ ఇండియా ఆఫ్ అమెరికా" అని పిలుస్తుంటారు. ఇక్కడ వందల సంఖ్యలో ఇండియన్ రెస్టారెంట్లు, జ్యువెలరీ షాపులు, సూపర్ మార్కెట్లు ఉన్నాయి. క్వీన్స్, ఎడిసన్ పరిసరాల్లో మన ఊరి వాతావరణం కనిపిస్తుంది. పెద్ద పెద్ద హిందూ దేవాలయాలు, సిక్కు గురుద్వారాలు, జైన్ టెంపుల్స్, మసీదులు ఇక్కడ ఉన్నాయి. దీపావళి, హోలీ, నవరాత్రి పండగలను ఇక్కడ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తారు. బాలీవుడ్ సినిమాలు కూడా లోకల్ థియేటర్లలో రిలీజ్ అవుతాయి.

37
2. శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా, కాలిఫోర్నియా (సిలికాన్ వ్యాలీ)

ప్రపంచ టెక్నాలజీ గుండెకాయ అయిన సిలికాన్ వ్యాలీలో భారతీయుల హవా నడుస్తోంది. శాన్ ఫ్రాన్సిస్కో, ఓక్లాండ్, శాన్ జోస్, సన్నీవేల్, ఫ్రీమాంట్, కుపెర్టినో నగరాలతో కూడిన బే ఏరియాలో 5 లక్షలకు పైగా భారతీయులు ఉన్నారు. గ్లోబల్ టెక్ కంపెనీలు, స్టార్టప్‌లకు ఇది నిలయం. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, ఏఐ ప్రొఫెషనల్స్, రీసెర్చర్లకు ఇక్కడ భారీ డిమాండ్ ఉంది. ప్రఖ్యాత స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ, లీడింగ్ రీసెర్చ్ సెంటర్లు ఇక్కడే ఉన్నాయి.

గూగుల్, యాపిల్, ఎన్విడియా, మెటా వంటి టాప్ కంపెనీల ప్రధాన కార్యాలయాలు ఇక్కడే ఉండటంతో ఇండియన్ ప్రొఫెషనల్స్‌కు అత్యధిక జీతాలు లభిస్తాయి. ఇక్కడ స్టార్టప్, వెంచర్ క్యాపిటల్ ఎకోసిస్టమ్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ మాట్లాడే కమ్యూనిటీలు ఇక్కడ భారీగా ఉన్నారు.

47
3. డల్లాస్-ఫోర్ట్ వర్త్, టెక్సాస్ (ప్లానో, ఇర్వింగ్, ఫ్రిస్కో)

నార్త్ టెక్సాస్‌లో ఉన్న డల్లాస్-ఫోర్ట్ వర్త్ మెట్రోప్లెక్స్ ప్రాంతంలో దాదాపు 2.5 లక్షల మందికి పైగా భారతీయులు నివసిస్తున్నారు. అమెరికాలో అత్యంత వేగంగా పెరుగుతున్న ఇండియన్ కమ్యూనిటీలలో ఇది ఒకటి. ఇక్కడ ఐటీ, కార్పొరేట్ ఉద్యోగ మార్కెట్ చాలా వేగంగా విస్తరిస్తోంది. కాలిఫోర్నియాతో పోలిస్తే ఇక్కడ ఇళ్ల ధరలు తక్కువ, జీవన వ్యయం కూడా అందుబాటులోనే ఉంటుంది.

అన్నిటికంటే ముఖ్యంగా టెక్సాస్ రాష్ట్రంలో స్టేట్ ఇన్‌కమ్ టాక్స్ ఉండదు. దీనివల్ల సేవింగ్స్ ఎక్కువ చేసుకునే అవకాశం ఉంటుంది. పిల్లల చదువుల కోసం బెస్ట్ పబ్లిక్ స్కూల్స్ ఇక్కడి ప్రత్యేకత. విశాలమైన ఇళ్లతో కూడిన అందమైన సబర్బన్ ప్రాంతాలు, పెద్ద పెద్ద ఇండియన్ గ్రోసరీ చైన్స్, రెస్టారెంట్లు, అనేక దేవాలయాలు, సాంస్కృతిక సంస్థలు ఇక్కడ ఉన్నాయి. కుటుంబంతో కలిసి ప్రశాంతంగా నివసించడానికి భారతీయులు దీనిని ఫస్ట్ ఛాయిస్‌గా ఎంచుకుంటున్నారు.

57
4. సీటెల్ మెట్రోపాలిటన్ ఏరియా, వాషింగ్టన్ (బెల్వ్యూ, రెడ్‌మండ్, కిర్క్‌లాండ్)

వాషింగ్టన్ స్టేట్‌లోని సీటెల్ పరిసర ప్రాంతాల్లో 1.8 లక్షల మందికి పైగా భారతీయులు ఉంటున్నారు. మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి టెక్ దిగ్గజాల హెడ్‌క్వార్టర్స్ ఇక్కడే ఉండటంతో టెక్ ప్రొఫెషనల్స్ ఇక్కడికి క్యూ కడుతున్నారు. క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టాలెంట్‌కు ఇక్కడ భారీ డిమాండ్ ఉంది.

ఇక్కడ కెరీర్ గ్రోత్ తో పాటు జీతాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు అత్యధికంగా కేంద్రీకృతమైన ప్రాంతాల్లో ఇది ఒకటి. పర్వతాలు, సరస్సులతో కూడిన అందమైన ప్రకృతి వాతావరణం, హై క్వాలిటీ లైఫ్ స్టైల్ ఇక్కడి ప్రత్యేకత. భారతీయుల కోసం బలమైన సాంస్కృతిక, వృత్తిపరమైన నెట్‌వర్క్‌లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.

67
5. చికాగో మెట్రోపాలిటన్ ఏరియా, ఇల్లినాయిస్ (నేపర్‌విల్లే, షాంబర్గ్)

ఇల్లినాయిస్ కేంద్రంగా ఉన్న చికాగో మెట్రోపాలిటన్ ఏరియాలో దాదాపు 1.7 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. మెడిసిన్, ఇంజనీరింగ్, కన్సల్టింగ్, మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో ఇక్కడ స్థిరపడిన వారు ఎక్కువ. కోస్టల్ సిటీలతో పోలిస్తే ఇక్కడ లివింగ్ కాస్ట్ చాలా తక్కువ. గత కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ బలమైన ఇండియన్ కమ్యూనిటీ ఏర్పడింది. నేపర్‌విల్లే, షాంబర్గ్ వంటి ఫ్యామిలీ ఫ్రెండ్లీ సబర్బన్ ఏరియాలు భారతీయులకు అనుకూలంగా ఉంటాయి.

పెద్ద పెద్ద దేవాలయాలు, కమ్యూనిటీ సెంటర్లు ఇక్కడ ఉన్నాయి. ఏడాది పొడవునా భారతీయ పండగలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి. మంచి విద్యాసంస్థలు, మెరుగైన వైద్య సదుపాయాలతో పాటు భారతదేశంలోని అన్ని ప్రాంతాల రుచులు దొరికే వైవిధ్యం ఇక్కడి ప్రత్యేకత.

77
భారతీయులు ఈ ప్రాంతాల్లోనే ఎందుకు ఉంటున్నారు?

ఎక్కువ మంది భారతీయ వలసదారులు ఈ ప్రాంతాలనే ఎంచుకోవడానికి బలమైన కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది టెక్నాలజీ, హెల్త్‌కేర్, ఫైనాన్స్, ఇంజనీరింగ్ రంగాలలో లభించే హై పేయింగ్ ఉద్యోగాలు. రెండవది పిల్లల భవిష్యత్తు కోసం టాప్ యూనివర్సిటీలు, అద్భుతమైన పబ్లిక్ స్కూల్స్ ఉండటం.

కొత్తగా అమెరికా వచ్చే వారికి హెల్ప్ చేయడానికి ఇప్పటికే అక్కడ స్థిరపడిన పాత ఇండియన్ కమ్యూనిటీలు ఎంతో తోడ్పడతాయి. మన ఊరి ఫీలింగ్ వచ్చేలా గుడులు, గురుద్వారాలు, మసీదులు, సాంస్కృతిక కేంద్రాలు అందుబాటులో ఉంటాయి. ఇండియన్ గ్రోసరీ స్టోర్స్, రెస్టారెంట్లు ఉండటం వల్ల తిండికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. వీటన్నిటితో పాటు సురక్షితమైన పరిసరాలు, మెరుగైన జీవన ప్రమాణాలు ఉండటం వల్ల మనవాళ్లు ఈ నగరాల వైపు మొగ్గు చూపుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories