యూకే లో నెల ఖర్చులు ఎంత అవుతాయి..
యూకేలో నెలవారీ ఖర్చుల గురించి మాట్లాడుకుంటే.. అందులో రెంట్, కరెంట్, వాటర్, ఫుడ్, కిరాణా, గ్యాస్, ఇలా చాలా రకాల ఖర్చులు ఏరియాల వారిగా తగ్గుతూ పెరుగుతూ ఉంటాయి. ఈ రకంగా చూసుకుంటే ముందుగా…
వసతి (Rent): ఇది మీ బడ్జెట్‌లో అతిపెద్ద వాటా. లండన్ వెలుపల ఒక ప్రైవేట్ రూమ్ (షేరింగ్) కోసం నెలకు సగటున 554 పౌండ్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు 58,000 రూపాయల వరకు ఖర్చవుతుంది. అదే మీరు లండన్ నగరంలో ఉండాలనుకుంటే, కేవలం రెంట్ కోసమే కనీసం 750 నుండి £1,100 పౌండ్స్ వరకూ కేటాయించాల్సి ఉంటుంది. అంటే ఇండియన్ కరెన్సలో 1,15,000 దాకా కేటాయించాల్సి ఉంటుంది.