Ambani Home: ముఖేష్ అంబానీ ఇల్లు ఇప్పుడు అమ్మితే ఎంత ధర ఉంటుందో తెలుసా? ఎవరూ కొనలేరేమో

Published : Jul 15, 2026, 09:52 AM IST

Ambani Home:  ముఖేష్ అంబానీ కుటుంబం వేల కోట్ల విలువైన సొంత ఇంట్లో నివసిస్తున్నారు. 2010లో సుమారు రూ.15,000 కోట్లతో ముఖేష్ అంబానీ తన ఇల్లు 'యాంటిలియా'ను నిర్మించారు. మరి అదే ఇంటిని ఇప్పుడు అమ్మితే ఎంత ధర ఉంటుందో తెలుసా?

PREV
13
ముఖేష్ అంబానీ ఇల్లు

ఆసియాలోని ధనవంతుల్లో ముఖేష్ అంబానీ ఒకరు. ఇతని కుటుంబం ముంబైలోని ఆల్టామౌంట్ రోడ్‌లో ఉన్న యాంటిలియా  భవంతితో నివసిస్తున్నారు.  2010లో దీని నిర్మాణానికి అప్పట్లో సుమారు రూ.15,000 కోట్లు ఖర్చయింది. 

యాంటిలియా భవనాన్ని నిర్మించడానికి నాలుగేళ్ల సమయం పట్టింది. 2006లో మొదలై 2010లో పూర్తయింది. అప్పటి అంచనా ప్రకారం దీని నిర్మాణానికి 2 బిలియన్ డాలర్లు ఖర్చయ్యింది. అంటే సుమారు రూ.15,000 కోట్ల నుంచి రూ.17,400 కోట్లు ఖర్చయింది. కేవలం బేస్ స్ట్రక్చర్‌కే రూ.6,000 కోట్లు అయినట్టు సమాచారం.

23
ఇప్పుడు దీని ధర

అప్పట్లో యాంటిలియా నిర్మాణానికి 15000 కోట్లు ఖర్చుయిందంటే.. ఇప్పుడు దాని ధర ఎంత ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్న  ప్రకారం 2026లో యాంటిలియాను  కట్టాలంటే రెట్టింపు ఖర్చవుతుంది. అంటే సుమారు 4.6 బిలియన్ డాలర్లు అవుతుంది. అదే మన రూపాయల్లో చెప్పుకోవాలంటే రూ.38,000 కోట్లకు పైగా కావాలి. ముంబైలో భూమి ధరలు, సిమెంట్, స్టీల్ వంటి వాటి ధరలు పెరగడమే దీనికి కారణం. అంటే యాంటిలియాను ఇప్పుడు అమ్మితే రూ.38,000 కోట్ల నుంచి రూ.40,000 కోట్లు ధర ఉంటుంది.

యాంటిలియా ఇంట్లోలో  ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ ఇంట్లో 4,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఇది 8.0 తీవ్రత భూకంపాన్ని తట్టుకుంటుంది. ఈ ఇంట్లో 3 హెలిప్యాడ్‌లు, 168 కార్ల కోసం 6 అంతస్తుల పార్కింగ్, ప్రైవేట్ సినిమా థియేటర్, జిమ్, స్పా, గుడి.. ఇలా ఎన్నో ఏర్పాట్లు ఉన్నాయి. ముంబై వేడిని తట్టుకోవడానికి ప్రత్యేకంగా 'స్నో రూమ్' కూడా ఏర్పాటు చేశారు.

33
ఇంటీరియర్ అదిరిపోతుంది

యాంటిలియా భవనం బయటి నుంచే కాదు… లోపల ఇంటీరియర్ కూడా అందంగా ఉంటుంది. చూపుతిప్పుకోలేనంత అందంగా ఉంటుంది ఈ ఇల్లు.  అంబానీ కుటుంబం నివసించే యాంటిలియా కేవలం డబ్బుకు చిహ్నం కాదు.. ఆధునిక భవనాల నిర్మాణానికి ఒక మైలురాయి. ముంబై నడిబొడ్డున ఇలాంటి మరో భవంతిని కట్టడం ఎవరికైనా అసాధ్యమే అని చెప్పుకోవాలి.

Read more Photos on
click me!

Recommended Stories