Top 10 Spiritual Temples: ఇండియా అంటేనే విభిన్న సంస్కృతులు, ప్రాచీన సంప్రదాయాలకు నిలయం. ప్రతి అణువులోనూ ఆధ్యాత్మికత ఉట్టిపడుతుంది. ఎన్నో పురాతన దేవాలయాలకు ఎంతో మతపరమైన, చారిత్రక ప్రాధాన్యం ఉంది. దేశంలో టాప్ 10 పుణ్యక్షేత్రాల వివరాలు గమనిస్తే..
లైఫ్ లో ఒక్కసారైనా తప్పక సందర్శించాల్సిన 10 ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలు ఇవే!
భారతదేశంలో ఆధ్యాత్మిక యాత్ర చేయడం అంటే.. కేవలం దేవుడిని దర్శించుకోవడం మాత్రమే కాదు, కాలంలో వెనక్కి ప్రయాణించి మన సంస్కృతిని అనుభూతి చెందడం. మీరు కూడా మీ నెక్స్ట్ వెకేషన్‌లో ఒక మంచి స్పిరిచువల్ ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటే, తప్పకుండా విజిట్ చేయాల్సిన 10 అద్భుతమైన దేవాలయాల లిస్ట్ మీకోసం..
26
1. గోల్డెన్ టెంపుల్ (హర్మందిర్ సాహిబ్), అమృత్‌సర్
పంజాబ్‌లో ఉన్న ఈ ఐకానిక్ సిక్కు దేవాలయం ఐక్యతకు, సమానత్వానికి ఒక గొప్ప చిహ్నం. ఎటు చూసినా మెరిసిపోయే బంగారు కట్టడం, దాని చుట్టూ ప్రశాంతంగా ఉండే సరస్సు.. ఇక్కడికి వచ్చే భక్తులకు ఒక అద్భుతమైన, మనసుకు హాయినిచ్చే అనుభూతిని అందిస్తాయి. లైఫ్‌లో ఒక్కసారైనా చూడాల్సిన ప్లేస్ ఇది.
2. జగన్నాథ ఆలయం, పూరి
ఒడిశాలో ఉన్న జగన్నాథ ఆలయం, విష్ణుమూర్తి అవతారమైన జగన్నాథ స్వామి కోలువైన ఆలయం. ఈ టెంపుల్ వద్ద జరిగే ప్రతిష్ఠాత్మక రథయాత్ర ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫేమస్. ఈ రథోత్సవాన్ని కళ్లారా చూసేందుకు దేశ విదేశాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు.
36
3. కేదార్‌నాథ్ ఆలయం, ఉత్తరాఖండ్
హిమాలయ పర్వతాల మధ్య కొలువై ఉన్న కేదార్‌నాథ్ ఆలయం, పరమశివుని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. చుట్టూ మంచు కొండలు, మైమరపించే ప్రకృతి అందాల మధ్య ఉన్న ఈ ఆలయం, ఒక స్వర్గంలాంటి అనుభూతిని ఇస్తుంది.
4. లోటస్ టెంపుల్, ఢిల్లీ
ఢిల్లీలో ఉన్న లోటస్ టెంపుల్ ఒక ప్రత్యేకమైన, అద్భుతమైన కట్టడం. ఇది ఒక ప్రార్థనా మందిరం. తామరపువ్వు ఆకారంలో ఉండే దీని ఆర్కిటెక్చర్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక్కడ ఎలాంటి కుల, మత భేదాలు లేవు. శాంతి, ఐక్యతను పెంపొందించేందుకు అన్ని మతాల ప్రజలకు ఇక్కడికి అనుమతి ఉంటుంది.
తమిళనాడులోని మధురైలో ఉన్న మీనాక్షి అమ్మన్ ఆలయం, ద్రవిడ నిర్మాణ శైలికి ఒక అద్భుతమైన నిదర్శనం. మీనాక్షి దేవి, సుందరేశ్వరుడు కొలువైన ఈ ఆలయంలోని అద్భుతమైన శిల్పకళ, రంగురంగుల గోపురాలు భక్తులను, పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.
6. సిద్ధివినాయక ఆలయం, ముంబై
మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఉన్న సిద్ధివినాయక ఆలయం దేశంలోనే అత్యంత ప్రసిద్ధ గణపతి దేవాలయాలలో ఒకటి. ఏదైనా పని మొదలుపెట్టే ముందు విజయం, ఐశ్వర్యం కోసం ఇక్కడికి వచ్చి బప్పా ఆశీస్సులు తీసుకోవడం భక్తులకు ఒక నమ్మకం. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు అందరూ ఇక్కడికి క్యూ కడతారు.
56
7. రామనాథస్వామి ఆలయం, రామేశ్వరం
తమిళనాడులోని రామేశ్వరంలో ఉన్న ఈ పుణ్యక్షేత్రానికి హిందూ మతంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ ఆలయానికి శ్రీరాముడితో ముడిపడిన గొప్ప చరిత్ర ఉంది. ఇక్కడి 1,000 స్తంభాల మండపం (హాల్) ఆర్కిటెక్చర్ పరంగా చాలా ఫేమస్. హిందువులు తప్పక దర్శించాల్సిన ముఖ్యమైన యాత్రా స్థలాలలో ఇది ఒకటి.
8. బోధ్ గయ, బీహార్
బీహార్‌లోని బోధ్ గయ.. గౌతమ బుద్ధుడికి జ్ఞానోదయం అయిన పవిత్ర స్థలం. ఇక్కడి మహాబోధి ఆలయ సముదాయాన్ని యునెస్కో (UNESCO) ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. బౌద్ధమతం పాటించే వారితో పాటు, మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక మేల్కొలుపును కోరుకునే వారికి ఇది ఒక పర్ఫెక్ట్ డెస్టినేషన్.
66
9. ద్వారకాధీశ ఆలయం, ద్వారక
శ్రీకృష్ణుడు కోలువైన ఈ ఆలయం గుజరాత్‌లో ఉంది. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే 'చార్ ధామ్' యాత్రా స్థలాలలో ద్వారక ఒకటి. కృష్ణుడి భక్తులకు ఈ ఆలయం అత్యంత ముఖ్యమైన, పవిత్రమైన పుణ్యక్షేత్రం.
10. తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం, తిరుమల
ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేవాలయాలలో తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి ఆలయం ఒకటి. ఆంధ్రప్రదేశ్‌లోని ఏడు కొండలపై కొలువై ఉన్న కలియుగ దైవం శ్రీవారి ఆశీస్సుల కోసం ప్రతిరోజూ వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ఇక్కడి భక్తిభావం, ఆలయ వైభవం ప్రతి ఒక్కరినీ ఫిదా చేస్తాయి.